← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉమాపతి umāpati

Original — తెలుగు
  1. ఉమా శబ్దేన చిచ్ఛక్తిః, బ్రహ్మ విద్యా, బ్రహ్మ విద్యా ప్రథా త్రీ భవానీవా; తస్యాః పతిః పరమేశ్వరః.

(‘ఉమా’ అను మాటకు చిత్ శక్తి, బ్రహ్మ విద్య, బ్రహ్మవిద్యను ప్రసాదించు భవాని అనియు అర్థము. ఉమ యొక్క భర్త ఉమాపతి, పరమేశ్వరుడు).

  1. “ఉమేతి మాత్రా తపసో నిషిద్ధా పశ్చాదు మాభ్యాం సుముఖీ జగామ”. (కుమారసంభవము - కాళిదాసు)

(ఉ = ఓ పార్వతీ; ‘మా’ = వద్దు; - తపస్సు వద్దు అని తల్లిచే తపస్సునుండి నివారింపబడినది కనుక పార్వతికి ‘ఉమ’ అను పేరు కలిగినది).

  1. పరమేశ్వరుని శక్తి పార్వతి; ఎవరినుండి అయినను వారి శక్తి విడదీయుటకు వీలుకానిది. అట్లే పరమేశ్వరుని శక్తి పరమేశ్వరునుండి విడదీయుటకు వీలుకానిది. అందుచేత పరమేశ్వరుడు ఎల్లపుడు తనశక్తిని కలిగియే యుండును - పార్వతి పరమేశ్వరుని వదలక ఎల్లపుడు నిత్యానపాయినిగానే ఉండును - అందుచేతనే పరమేశ్వరుడు ‘సాంబశివుడు’ - అంబయాసహితః - అంబ అయిన పార్వతితో కూడియున్న శివుడు అని చెప్పబడుచున్నాడు, అర్థనారీశ్వరుడు అని చెప్పబడుచున్నాడు - ఇట్లే శ్రీమహాలక్ష్మి శ్రీమన్నారయణుని శక్తి, అతని వక్షస్థలమందు నిత్యము ఉండుటవలన నిత్యానపాయిని అని చెప్పబడుచున్నది - (సీతా సమేతం భజే - సీతాదేవితో కూడిన శ్రీరామచంద్రుని భజించుచున్నాను -). సృష్టిలో ప్రతి వస్తువులోను భగవదంశ, ప్రకృతి అంశ ఉన్నది - ప్రకృతి పురుషులు - ఏ వస్తువులోనుండి యైనను ప్రకృతిని వేరు, పురుషునివేరు - Matter and Energy - చేయుటకు అవకాశము లేదు - ప్రకృతి అంశలేని పురుషుడు (చైతన్య శక్తి) లేదు, పురుషుడు (చైతన్య శక్తి) లేదు, పురుషుడు (చైతన్య శక్తి) లేని ప్రకృతి అంశలేదు - (There is no particle of matter which is not permeated by Energy - and there can be no Energy without there being even a particle of matter).

(ఉమామహేశః = మహంశ్చాసౌ ఈశశ్చ మహేశః, ఉమయా పార్వత్యా సహితో మహేశః ఉమామహేశః.)

(మహా + ఈశః = మహేశుడు - ఉమతో - పార్వతితో కూడియున్న మహేశుడు).

Transliteration
  1. umā śabdēna cicchaktiḥ, brahma vidyā, brahma vidyā prathā trī bhavānīvā; tasyāḥ patiḥ paramēśvaraḥ.

(‘umā’ anu māṭaku cit śakti, brahma vidya, brahmavidyanu prasādiṃcu bhavāni aniyu arthamu. uma yokka bharta umāpati, paramēśvaruḍu).

  1. “umēti mātrā tapasō niṣiddhā paścādu mābhyāṃ sumukhī jagāma”. (kumārasaṃbhavamu - kāḷidāsu)

(u = ō pārvatī; ‘mā’ = vaddu; - tapassu vaddu ani tallicē tapassunuṃḍi nivāriṃpabaḍinadi kanuka pārvatiki ‘uma’ anu pēru kaliginadi).

  1. paramēśvaruni śakti pārvati; evarinuṃḍi ayinanu vāri śakti viḍadīyuṭaku vīlukānidi. aṭlē paramēśvaruni śakti paramēśvarunuṃḍi viḍadīyuṭaku vīlukānidi. aṃducēta paramēśvaruḍu ellapuḍu tanaśaktini kaligiyē yuṃḍunu - pārvati paramēśvaruni vadalaka ellapuḍu nityānapāyinigānē uṃḍunu - aṃducētanē paramēśvaruḍu ‘sāṃbaśivuḍu’ - aṃbayāsahitaḥ - aṃba ayina pārvatitō kūḍiyunna śivuḍu ani ceppabaḍucunnāḍu, arthanārīśvaruḍu ani ceppabaḍucunnāḍu - iṭlē śrīmahālakṣmi śrīmannārayaṇuni śakti, atani vakṣasthalamaṃdu nityamu uṃḍuṭavalana nityānapāyini ani ceppabaḍucunnadi - (sītā samētaṃ bhajē - sītādēvitō kūḍina śrīrāmacaṃdruni bhajiṃcucunnānu -). sṛṣṭilō prati vastuvulōnu bhagavadaṃśa, prakṛti aṃśa unnadi - prakṛti puruṣulu - ē vastuvulōnuṃḍi yainanu prakṛtini vēru, puruṣunivēru - Matter and Energy - cēyuṭaku avakāśamu lēdu - prakṛti aṃśalēni puruṣuḍu (caitanya śakti) lēdu, puruṣuḍu (caitanya śakti) lēdu, puruṣuḍu (caitanya śakti) lēni prakṛti aṃśalēdu - (There is no particle of matter which is not permeated by Energy - and there can be no Energy without there being even a particle of matter).

(umāmahēśaḥ = mahaṃścāsau īśaśca mahēśaḥ, umayā pārvatyā sahitō mahēśaḥ umāmahēśaḥ.)

(mahā + īśaḥ = mahēśuḍu - umatō - pārvatitō kūḍiyunna mahēśuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.