“గుణాతీత పరబ్రహ్మ మెతానై తన్నుదానే సాక్షిరూపాన చూచినదే తుర్యావస్థ - ఈ తుర్యావస్థ యొక్క పరికల్పనే ఉన్మని. అదెలాగంటే - వేపకాయ చేదు పక్వాన మధురమైనట్టే తుర్యమందలి శుద్ధ సాక్షివాసన చెడి అతీతమైన నిర్వాసన ఔను - అదే మధురమనంగాను. అందుకు దృష్టాంతం చెరుకు - స్థూలరసమే, సూక్ష్మందాని సాగె, కారణం శర్కరే తుర్యం. ఆ శర్కరే జలం తోకూడి పానకమైతే రూపం చెడి రుచి నిలిచిన రీతిని తుర్యమందు మగ్నమైనదే తుర్యాతీతమైన ఉన్మని అవస్థ”. (బ్రహ్మవిద్యాసుధార్ణవము - 8)
“విధి పూర్వకమగు ఆసనము, జాలంధరబంధము, మొదలగువిధులతో కూడినటువంటి ప్రాణాయామము వలన నాడీ సమూహములు అగునెడల ప్రాణవాయువు ఇడా, పింగళలనడుమనుండు సుషుమ్నాడి యొక్క మార్గమును తెఱచుకొని అందు సుఖముగ ప్రవిష్టమగుచున్నది. అఫ్ఫుడు మనస్థైర్యము అనగా ధ్యేయస్వరూపమైన వృత్తి ప్రవాహము కలుగుచున్నది. అట్లు కలుగు మన స్థిరత్వమే మనోన్మనీ అవస్థ అని అనబడుచున్నది. మనోన్మని అను పదమూన్మని యొక్క పర్యాయపదము”.
“guṇātīta parabrahma metānai tannudānē sākṣirūpāna cūcinadē turyāvastha - ī turyāvastha yokka parikalpanē unmani. adelāgaṃṭē - vēpakāya cēdu pakvāna madhuramainaṭṭē turyamaṃdali śuddha sākṣivāsana ceḍi atītamaina nirvāsana aunu - adē madhuramanaṃgānu. aṃduku dṛṣṭāṃtaṃ ceruku - sthūlarasamē, sūkṣmaṃdāni sāge, kāraṇaṃ śarkarē turyaṃ. ā śarkarē jalaṃ tōkūḍi pānakamaitē rūpaṃ ceḍi ruci nilicina rītini turyamaṃdu magnamainadē turyātītamaina unmani avastha”. (brahmavidyāsudhārṇavamu - 8)
“vidhi pūrvakamagu āsanamu, jālaṃdharabaṃdhamu, modalaguvidhulatō kūḍinaṭuvaṃṭi prāṇāyāmamu valana nāḍī samūhamulu aguneḍala prāṇavāyuvu iḍā, piṃgaḷalanaḍumanuṃḍu suṣumnāḍi yokka mārgamunu teṟacukoni aṃdu sukhamuga praviṣṭamagucunnadi. aphphuḍu manasthairyamu anagā dhyēyasvarūpamaina vṛtti pravāhamu kalugucunnadi. aṭlu kalugu mana sthiratvamē manōnmanī avastha ani anabaḍucunnadi. manōnmani anu padamūnmani yokka paryāyapadamu”.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.