← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉపాదానకారణము upādānakāraṇamu

Original — తెలుగు
  1. యత్ కార్య స్వరూపే ప్రవిశతి యద్వినా కార్యస్య స్థితిర్నాస్తి తదుపాదాన కారణ ముచ్యతే - యథా మృద్ ఘటస్య ఉపాదానకారణం ఘట స్వరూపే మృదః ప్రవేశో అస్తి, మృదం వినా ఘటో న స్థితిం లభతేచ.

(మట్టితో కుండ చేయబడుచున్నది. మట్టి కారణము, కుండ కార్యము. ఏది కార్యవస్తువు రూపములో ప్రవేశించియుండునో, యేది లేనిదే ఆ కార్యవస్తువు ఉండదో అది ఉపాదానకారణము. కుండకు మట్టి ఉపాదానకారణము - కుండరూపములో ఉన్నది మట్టియే. మట్టిలేనియడల మట్టితో చేయబడు కుండ ఉండదు - అందుచేత మట్టి కుండకు ఉపాదానకారణము - కుండ అంతా మట్టియే - కారణవస్తువే కార్యవస్తువుగా మారినది. అటువంటి కారణవస్తువు ఉపాదానకారణము.

  1. కార్యోత్పత్తి స్థితిలయకారణత్వం ఉపాదానకారణస్య లక్షణం.

(కార్యవస్తువు దేనిలోనుండి పుట్టినదో, దేనిలో స్థితి కలిగియున్నదో, దేనిలో లయమగుచున్నదో అది ఉపాదానకారణము. కుండ మట్టిలోనుండి పుట్టినది - మట్టితో చేయబడినది, మట్టిమాత్రముగనే - మట్టికుండగనే యుండును. కుండ బద్దలయిపోగా ఆ మట్టిలోనే కలిసిపోవును - మట్టియే యగును. అందుచేత కుండకు మట్టి ఉపాదానకారణము, నిమిత్తకారణము)

  1. కుండకు రెండు కారణములు - ఉపాదానకారణము, నిమిత్తకారణము -మట్టిలేనిదే మట్టికుండ చేయబడదు - అందుచేత మట్టి కుండకు ఉపాదానకారణము - మట్టి దానంతట అది కుండగా మారదు - కుమ్మరివాడు మట్టితో చేయును - అందుచేత కుమ్మరివాడు చేయనిదీ మట్టి కుండ అవదు - అందుచేత కుమ్మరివాడు కుండకు నిమిత్తకారణము - మట్టి కుండకు ప్రధానకారణము - కుండకు ఉపాదానకారణము వేరు, నిమిత్తకారణమువేరు - ప్రపంచము పరబ్రహ్మవలన పుట్టినది. అందుచేత ప్రపంచమునకు ఉపాదానకారణము, నిమిత్తకారణము పరబ్రహ్మమే).

(ఉపాదానకారణము మూడువిధములుగా ఉన్నది : -ఇంకొక కారణమువలన కార్యము కలిగినప్పుడు అవి ఆరంభోపాదానకారణము అని చెప్పబడును - కారణమగువస్తువు తనస్వరూపమును విడిచి ఇంకొకరూపమును పొందునపుడు అది పరిణామ్యుపాదాన కారణము - (పరిణమము = మార్పు). కారణవస్తువు తనరూపమును విడువకున్నను మార్పు చెందకున్నను భ్రమచేత ఇంకొకవస్తువుగా తోచునపుడు అది వివక్తోపాదానకారణము. నిరాకారుడు, నిర్విశేషుడు అయిన పరబ్రహ్మమునంది అనిర్వచనీయమగు అతని మాయాశక్తిచేత కల్పింపబడిన ప్రపంచము పరబ్రహ్మయొక్క వివర్తము - కల్పితరూపమగుచున్నది - అందుచేత వివర్తమగు ప్రపంచమునకు పరబ్రహ్మ వివర్తోపాదానకారణము కారణము). (ఎండమావులందు తోచు నీళ్ళు ఎండమావులకంటె వేరుకానట్లు బ్రహ్మమునందున్న ప్రపంచము బ్రహ్మముకంటె వేరుకాదు - అందుచేత పరబ్రహ్మ ప్రపంచమునకు ఉపాదానకారణము).

“క. మొదలును నీలో దోచెను

దుదియును నటదోచె, నడుమ దోచెను; నీవే

మొదలు నడుమ తుదిసృష్టికి

గదియగు ఘటమునకు మన్నుగతియగు మాడ్కిన్|“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 6 - 164)

(కార్యమునకు ఉత్పత్తి స్థితిలయములకు కారణమైనది ఉపాదానకారణము - ప్రపంచముయొక్క సృష్టి స్థితిలయములకు కారణమైనవాడు పరబ్రహ్మ. అందుచేత పరబ్రహ్మ ప్రపంచమునకు ఉపాదానకారణము).

“యతోవా ఇమాని భూతాని జాయంతే, యాని జాతాని జీవంతి, యస్మిన్శ్చ అభిసంవిశంతి - తద్బ్రహ్మ”.

(భూతములన్నియు బ్రహ్మలోనుండి పుట్టి, బ్రహ్మలో జీవించి బ్రహ్మలోనే లయమగుచున్నవి అని శ్రుతి చెప్పుచున్నది. అందుచేత భూతములకు ప్రపంచమునకు - పరబ్రహ్మ ఉపాదానకారణము).

Transliteration
  1. yat kārya svarūpē praviśati yadvinā kāryasya sthitirnāsti tadupādāna kāraṇa mucyatē - yathā mṛd ghaṭasya upādānakāraṇaṃ ghaṭa svarūpē mṛdaḥ pravēśō asti, mṛdaṃ vinā ghaṭō na sthitiṃ labhatēca.

(maṭṭitō kuṃḍa cēyabaḍucunnadi. maṭṭi kāraṇamu, kuṃḍa kāryamu. ēdi kāryavastuvu rūpamulō pravēśiṃciyuṃḍunō, yēdi lēnidē ā kāryavastuvu uṃḍadō adi upādānakāraṇamu. kuṃḍaku maṭṭi upādānakāraṇamu - kuṃḍarūpamulō unnadi maṭṭiyē. maṭṭilēniyaḍala maṭṭitō cēyabaḍu kuṃḍa uṃḍadu - aṃducēta maṭṭi kuṃḍaku upādānakāraṇamu - kuṃḍa aṃtā maṭṭiyē - kāraṇavastuvē kāryavastuvugā mārinadi. aṭuvaṃṭi kāraṇavastuvu upādānakāraṇamu.

  1. kāryōtpatti sthitilayakāraṇatvaṃ upādānakāraṇasya lakṣaṇaṃ.

(kāryavastuvu dēnilōnuṃḍi puṭṭinadō, dēnilō sthiti kaligiyunnadō, dēnilō layamagucunnadō adi upādānakāraṇamu. kuṃḍa maṭṭilōnuṃḍi puṭṭinadi - maṭṭitō cēyabaḍinadi, maṭṭimātramuganē - maṭṭikuṃḍaganē yuṃḍunu. kuṃḍa baddalayipōgā ā maṭṭilōnē kalisipōvunu - maṭṭiyē yagunu. aṃducēta kuṃḍaku maṭṭi upādānakāraṇamu, nimittakāraṇamu)

  1. kuṃḍaku reṃḍu kāraṇamulu - upādānakāraṇamu, nimittakāraṇamu -maṭṭilēnidē maṭṭikuṃḍa cēyabaḍadu - aṃducēta maṭṭi kuṃḍaku upādānakāraṇamu - maṭṭi dānaṃtaṭa adi kuṃḍagā māradu - kummarivāḍu maṭṭitō cēyunu - aṃducēta kummarivāḍu cēyanidī maṭṭi kuṃḍa avadu - aṃducēta kummarivāḍu kuṃḍaku nimittakāraṇamu - maṭṭi kuṃḍaku pradhānakāraṇamu - kuṃḍaku upādānakāraṇamu vēru, nimittakāraṇamuvēru - prapaṃcamu parabrahmavalana puṭṭinadi. aṃducēta prapaṃcamunaku upādānakāraṇamu, nimittakāraṇamu parabrahmamē).

(upādānakāraṇamu mūḍuvidhamulugā unnadi : -iṃkoka kāraṇamuvalana kāryamu kaliginappuḍu avi āraṃbhōpādānakāraṇamu ani ceppabaḍunu - kāraṇamaguvastuvu tanasvarūpamunu viḍici iṃkokarūpamunu poṃdunapuḍu adi pariṇāmyupādāna kāraṇamu - (pariṇamamu = mārpu). kāraṇavastuvu tanarūpamunu viḍuvakunnanu mārpu ceṃdakunnanu bhramacēta iṃkokavastuvugā tōcunapuḍu adi vivaktōpādānakāraṇamu. nirākāruḍu, nirviśēṣuḍu ayina parabrahmamunaṃdi anirvacanīyamagu atani māyāśakticēta kalpiṃpabaḍina prapaṃcamu parabrahmayokka vivartamu - kalpitarūpamagucunnadi - aṃducēta vivartamagu prapaṃcamunaku parabrahma vivartōpādānakāraṇamu kāraṇamu). (eṃḍamāvulaṃdu tōcu nīḷḷu eṃḍamāvulakaṃṭe vērukānaṭlu brahmamunaṃdunna prapaṃcamu brahmamukaṃṭe vērukādu - aṃducēta parabrahma prapaṃcamunaku upādānakāraṇamu).

“ka. modalunu nīlō dōcenu

dudiyunu naṭadōce, naḍuma dōcenu; nīvē

modalu naḍuma tudisṛṣṭiki

gadiyagu ghaṭamunaku mannugatiyagu māḍkin|“. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 6 - 164)

(kāryamunaku utpatti sthitilayamulaku kāraṇamainadi upādānakāraṇamu - prapaṃcamuyokka sṛṣṭi sthitilayamulaku kāraṇamainavāḍu parabrahma. aṃducēta parabrahma prapaṃcamunaku upādānakāraṇamu).

“yatōvā imāni bhūtāni jāyaṃtē, yāni jātāni jīvaṃti, yasminśca abhisaṃviśaṃti - tadbrahma”.

(bhūtamulanniyu brahmalōnuṃḍi puṭṭi, brahmalō jīviṃci brahmalōnē layamagucunnavi ani śruti ceppucunnadi. aṃducēta bhūtamulaku prapaṃcamunaku - parabrahma upādānakāraṇamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.