ఉపదిశ్యతే అనేన ఇత్యుపదేశః. (ఉపదేశింపబడినవి; బోధ; మంత్రాదులనుపదేశించుట, విధివాక్యము).
పిత్రాది హితైషి వచనం. (తండ్రి మొదలగువారు హితమునుకోరి చెప్పు వాక్యము).
“చంద్ర సూర్య గ్రహే, తీర్థే, సిద్ధక్షేత్ర శివాలయే |
మంత్రమాత్ర ప్రకథనముపదేశః స ఉచ్యతే ||“.
(చంద్రగ్రహణ సమయమున, సూర్యగ్రహణ సమయమున, తీర్థప్రదేశమునందు, క్షేత్రమందు, శివాలయమునందు, మంత్రము చెప్పుట - బోధించుట - ఉపదేశమని చెప్పబడుచున్నది).
(ఆ పరబ్రహ్మ నీవే, నీవే ఆ పరబ్రహ్మ అనునది ఉపదేశము - ‘తత్వమసి’ అని మహా వాక్యము యొక్క అర్థమును బోధించు ఉపదేశము - “త్వమేవాహం, త్వమేవాహం న సంశయః” - నీవే నేను, నీవే నేను, సంశయములేదు).
“ఉప పన్నుండైన శిష్యుని అధికారంబు పరీక్షించి, కృపాకటాక్ష వీక్షణముల వీక్షించి భయపడవలదని యభయకరంబు శిరంబునం గీలించి, యనంతరంబున నతని దేహాద్యానత్మ బుద్ధుల ‘నేతి, నేతి’ వాక్యంబులచే దొలగించి, ‘నీవే పరబ్రహ్మంబు’ అనే తత్వంబు దెలియ నుపదేశించుట శ్రీగురువుల యుపదేశంబనం బడు”. (వేదాంత చింతామణి - పరమానందతీర్థ)
అతిరహస్యంబగు సాంఖ్యయోగప్రకారంబు ఖలునకు, నవినీతునకు, జడునకు, దురాచారునకు, డాంబికునకు, నింద్రియలోలునకు, బుత్రదారాగారాద్యత్యంతా సక్త చిత్తునకు, భగవద్భక్తి హీనునకు, విషుదాసులయందు ద్వేషపడువానికి నుపదేశింపవలదు. శ్రద్ధాసంపన్నుండును, భక్తుండును, వినీతుండును, నసూయారహితుండును, సర్వభూతమిత్రుండును, శుశ్రూషాభిరతుండును, బాహ్యార్థజాత విరక్తుండును, శాంత చిత్తుండును, నిర్మత్సరుండును, శుద్ధాత్ముండును, మద్భక్తులయందు బ్రేమగలవాడును, నవ్యకాంతా విముఖుండును నగు నధికారికి నుపదేశింప నర్హంబగు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 32 - 1024)
upadiśyatē anēna ityupadēśaḥ. (upadēśiṃpabaḍinavi; bōdha; maṃtrādulanupadēśiṃcuṭa, vidhivākyamu).
pitrādi hitaiṣi vacanaṃ. (taṃḍri modalaguvāru hitamunukōri ceppu vākyamu).
“caṃdra sūrya grahē, tīrthē, siddhakṣētra śivālayē |
maṃtramātra prakathanamupadēśaḥ sa ucyatē ||“.
(caṃdragrahaṇa samayamuna, sūryagrahaṇa samayamuna, tīrthapradēśamunaṃdu, kṣētramaṃdu, śivālayamunaṃdu, maṃtramu ceppuṭa - bōdhiṃcuṭa - upadēśamani ceppabaḍucunnadi).
(ā parabrahma nīvē, nīvē ā parabrahma anunadi upadēśamu - ‘tatvamasi’ ani mahā vākyamu yokka arthamunu bōdhiṃcu upadēśamu - “tvamēvāhaṃ, tvamēvāhaṃ na saṃśayaḥ” - nīvē nēnu, nīvē nēnu, saṃśayamulēdu).
“upa pannuṃḍaina śiṣyuni adhikāraṃbu parīkṣiṃci, kṛpākaṭākṣa vīkṣaṇamula vīkṣiṃci bhayapaḍavaladani yabhayakaraṃbu śiraṃbunaṃ gīliṃci, yanaṃtaraṃbuna natani dēhādyānatma buddhula ‘nēti, nēti’ vākyaṃbulacē dolagiṃci, ‘nīvē parabrahmaṃbu’ anē tatvaṃbu deliya nupadēśiṃcuṭa śrīguruvula yupadēśaṃbanaṃ baḍu”. (vēdāṃta ciṃtāmaṇi - paramānaṃdatīrtha)
atirahasyaṃbagu sāṃkhyayōgaprakāraṃbu khalunaku, navinītunaku, jaḍunaku, durācārunaku, ḍāṃbikunaku, niṃdriyalōlunaku, butradārāgārādyatyaṃtā sakta cittunaku, bhagavadbhakti hīnunaku, viṣudāsulayaṃdu dvēṣapaḍuvāniki nupadēśiṃpavaladu. śraddhāsaṃpannuṃḍunu, bhaktuṃḍunu, vinītuṃḍunu, nasūyārahituṃḍunu, sarvabhūtamitruṃḍunu, śuśrūṣābhiratuṃḍunu, bāhyārthajāta viraktuṃḍunu, śāṃta cittuṃḍunu, nirmatsaruṃḍunu, śuddhātmuṃḍunu, madbhaktulayaṃdu brēmagalavāḍunu, navyakāṃtā vimukhuṃḍunu nagu nadhikāriki nupadēśiṃpa narhaṃbagu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 32 - 1024)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.