← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉపాధి upādhi

Original — తెలుగు
  1. “యద్వస్తు స్వ సమీపస్థం వస్త్వం తరం వ్యావర్తయతి, అపితు, స్వయం తేన న సంబధ్యతే స ఉపాధిః ఇత్యుచ్యతే”.

(ఏది తన సమీపమందున్న ఇతర వస్తువును కప్పిపుచ్చునో, కాని దానితో సంబంధములేకయున్నదో అది ఉపాది).

(ఆర్మను తనలో ఉండుటకు అవకాశమిచ్చునది ఉపాధి).

  1. ఆశ్రయః -

(ఈ సృష్టిలోని ప్రతివస్తువులోను భగవంతుడు సూక్ష్మరూపములో నున్నాడు. అట్టి ప్రతివస్తువు అతను ఉండుటకు ఆశ్రయమై యున్నది. అట్టి ఆశ్రయమే ఉపాధి).

  1. “యధాహ్యయం జ్యోతిరాత్మా వివస్వాన్ ఆపో భిన్నా బహు ధైకో(అ)ను గచ్ఛన్ ఉపాధినా క్రియతే భేదరూపో దేవః క్షేత్రే తమజో (అ) యమాత్మా”

(సూర్యుని ప్రతిబింబము నీటిలో కనబడును - ఆ నీరు కుండలో చిన్నదిగాను, సరస్సులో పెద్దదిగాను, సముద్రములో యింకా పెద్దదిగానున్నను సూర్యబింబమువాటివలెచిన్నదిగాను, పెద్దదిగాను ఉన్నను ఆ హెచ్చుతగ్గులు సూర్యునికి లేవు. నీరు అలలవలన చలించిన అందులోని సూర్యబింబము చలించినట్లు కనబడినను, సూర్యుడు చలించలేదు. ఆ ప్రకారముగానే దేహము మొదలగు ఉపాధులలో ఉన్న పరమాత్మకు ఆ దేహము యొక్క హెచ్చుతగ్గులు ఉపాధిని బట్టి ఉండునుకాని నిజముగ ఉండవు).

  1. యధాన్యాయమతే కర్ణగోళకాంతరతః ఆకాశః శ్రోత్రేంద్రియ మిత్యుచ్యతే, తత్ర కర్ణ గోళకం శ్రోత్రిస్యోపాధిః, ఏవం అంతఃకరణమపి స్వోపహితం చైతన్యం సాక్షిత్వేన బోధయిత్వా స్వయంతేన అసంబద్ధం వర్తతే.తస్మాత్ అంతఃకరణం సాక్షిణః ఉపాధిః - ఇత్యుచ్యతే. అంతఃకరణ చైతన్య మాత్రం సాక్షీ.

(న్యాయమతములో కర్ణగోళములో చెవిరంధ్రములోనున్న ఆకాశము శ్రోత్రేంద్రియమని చెప్పబడు చున్నది. ఆకాశముయొక్క గుణము శబ్దము - శబ్దమును గ్రహించునది చెవి. ఈ ప్రకారముగ చెప్పినపుడు శ్రోత్రముయొక్క - సూక్ష్మ సూత్రేంద్రియముయొక్క - ఉపాధిని - అనగా కర్ణగోళము అను ఉపాధిని ఆశ్రయించి ఆకాశము తనగుణమైన శబ్దమును గ్రహించును - ఈ ప్రకారముగానే అంతఃకరణమును ఆశ్రయించియున్న చైతన్యము అంతఃకరణవృత్తులను చేయించుచున్నను సాక్షిమాత్రముగా నుండును, అంతఃకరణవృత్తులతో సంబంధములేకుండా ఉండును. అందుచేత అంతఃకరణము సాక్షికి ఉపాధి యని చెప్పబడుచున్నది. అంతఃకరణములోని చైతన్యమే సాక్షి).

(అంతఃకరణం సాక్షిణః ఉపాధిః).

(అంతఃకరణములో సాక్షి అయిన భగవంతుడు ఉండును కనుక అంతఃకరణము సాక్షికి ఉపాధి).

  1. “ఏతే పరాపరే ప్రోక్తే క్షేత్ర క్షేత్రజ్ఞ లక్షణే |

ప్రకృతీ యోని రస్త్యేషాం ఏతద్యోనీని తానివై |

చరాచరాణి సర్వాణి భూతానీత్యుపధారయ |

ఏవంబోపాధి భూతేమే క్షేత్ర క్షేత్రజ్ఞ లక్షణే జగతః

ప్రకృతీ యస్మాత్తద్ద్వారాహం తతో హరిః |

సర్వజ్ఞో (అ) నంతశక్తి మాయో పాది, రధీశ్వరః |

సర్వస్యకార్య వర్గస్య జగతో జన్మ కారణం |

వినాశకారణం తద్వత్ స్థిరజంగమరూపిణః ||“. (గీతాభావప్రకాశము - 7 - 37 to 40)

(క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అను రెండు లక్షణములుగల ఈ ప్రకృతి పరాప్రకృతి, అపరాపరకృతి అని రెండుగానుండి ఈ చరాచరరూపమైన సమస్త భూతములకు యోని - జన్మకు కారణము, పుట్టుచోటు. - ఈ భూతములన్నియు దీనిలోనుండి పుట్టినవి. అనంతశక్తి కలిగి సర్వజ్ఞుడనైన నేను వీటిద్వారా కార్యమైన ఈ జగత్తు అంతటికీ జన్మకారణము, వినాశకారణమున్నూ అయి యున్నాను ఈ ప్రకృతియే మాయ. ఈ మాయను ఉపాధిగా చేసుకొని నేను ఈ పనిని చేయుచున్నాను - అనగా, దీనిలో నేను ఉండి దానిచేత నాపనులు చేయించుచున్నాను - అందుచేత ఈ ప్రపంచమునకు నేను ఉపాదానకారణము - అవినాకు ఉపాధి. ఈ ప్రకారముగానే జీవాత్మకు పాంచ భౌతికమైన శరీరము - మాయచే కల్పించబడినది - ఉపాధి).

  1. కార్యోపాధి రయం జీవః కారణోపాధిరీశ్వరః |

కార్యకారణతాంగిత్వా పూర్నభోధో విశిష్యతే ||“.

(కుండ, కూజా మొదలగువాటికి ఉపాదానకారణమైన మట్టివలె ప్రపంచమునకు ఉపాదానకారణమైన ప్రకృతి ఈశ్వరునకు - పరబ్రహ్మకు - ఉపాధి. అట్టి ప్రకృతిలోనుండి పుట్టి వేరు వేరు వస్తువులుగా ఉన్న కార్యరూపములు జీవునకు - జీవాత్మకు - ఉపాధి - ఈ ఉపాధులలో భగవంతుడు - పరమాత్మ, జీవాత్మ - ఉండి తాను లోన ఉన్నట్లు తెలియబడకుండ వాటిచేత వాటి పనులు చేయించుచున్నాడు - ఈ రెండు ఉపాధులలోను ప్రవేశించకముందు ఉన్నవాడు - కేవలుడైన భగవంతుడు - ఈ ఉపాధులు తెలుసుకొని వాటిని వదలి వాటిలోనున్న కేవల పరబ్రహ్మను తెలుసుకొనుటయే పూర్ణజ్ఞానము - పూర్తిగా ప్రపంచమంతటా వ్యాపించియుండు భగవంతుని తెలుసుకొనుటయే పూర్ణజ్ఞానము - బ్రహ్మజ్ఞానము). ఇట్టి కేవల పరబ్రహ్మ సృష్టికి పూర్వముండువాడు - సృష్టి ప్రారంభించిన తర్వాత సృష్టిలోని ప్రతివస్తువులోను ప్రవేశించియుండుటచేత అవి తనకు ఉపాధులగుచున్నవి. ఇందువలన సృష్టిలోని ప్రతివస్తువులోను - ప్రతికార్యవస్తువులోను, ఎంత చిన్నవస్తువులోనైనను భగవంతుడు ఉన్నాడు –

“ఆ. హరిమయముకాని ద్రవ్యము

పరమాణువు లేదు వంశపావన వింటే“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 1 - 17)

(Every particle of matter contains Energy - there is not even the smallest particle of matter which does not contain Energy). ఇట్లు ప్రతి వస్తువులోను ఉపాధిగా చేసుకొనియున్న భగవంతుని ఆ ఉపాధినుండి వేరు చేయుట శక్యముకాదు - (Matter cannot be separated from Energy nor Energy from matter, however small or big it is) - (compare - అర్థనారీశ్వరరూపము).

  1. పరమాత్మ అన్నింటియందు వ్యాపించియున్నవాడే అయినను అవిద్యా తారతమ్యమునుబట్టి - అనగా, ప్రకృతి, దాని కార్యములు - ఈ రెండింటియొక్క తారతమ్యములు - హెచ్చు తగ్గులు, ఉచ్ఛనీచములుబట్టి - పరమాత్మ ఉన్న ఉపాధివస్తువులు అనేక విధములుగా కనబడుచుండును - స్థావరములైన కొండలు, చెట్లు మొదలగువాటియందున్నపుడు తాను వాటిలో లేనివాడుగనే ఉండును - పశువులు మొదలగువాటియందుండి నీచుడుగనే లెక్కింపబడును - మనుష్యులందున్నపుడు తెలివి తేటలు కలిగియుండుటచేత కొంచెము ఉత్తముడగును, దేవతలు మొదలగువారియందు ఇంకను కొంచెము ఉత్తముడగును, లెక్కింపబడును - ఈ తేడాకు కారణము తానున్న ఉపాధియేకాని, భగవంతుడు దేనిలోనున్నను ఒకేమాదిరిగనుండును).

  2. “ఉపాధి విలయే జాతే కేవలమాత్మా విశిష్యతే”

(ఉపాధియనునది ప్రకృతిచేత భగవంతునికి కలిగినది. అది నశించు స్వభావముకలది. అది నశించినను దానిలోనుండు పరమాత్మ నశింపడు. ప్రకృతి, ప్రకృతి చేసిన ప్రపంచము నశించినను మిగిలియుండునది పరమాత్మ - “శేష సంజ్ఞ పాలుపొందు దీవు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము -)

  1. యథా అగ్నిః స్వతః తారతమ్య హీనోపి తృణకాష్టాద్యనుసారేణ తథా ప్రకాశతే, తద్వత్ - తథా - స్వేనకృతాసు - నిర్మతాసు, విచిత్రయోనిషు - దేవమనుష్యాది చిత్రకృత శరీరకేషు జీవేషు - అంతరాత్మతయా ప్రవిశన్ - దేవాది శరీరేషు ఇవ ఉపాసుకానుగ్రహేణ ఉపాసనార్థం విశన్ తిష్టన్, న్యూనాధిక భావేన స్వకృతాయోనీరను కరోతి - అవభాసతే.

(అగ్ని స్వతః మంచిది, చెడ్డది, చిన్నది పెద్దది అను తారతమ్యము లేనిదైనను కట్టెలు ఎటువంటివైనను,పెద్దవైనను, చిన్నవైనను, వంకరగానున్నవైనను, తిన్నగానున్నవైనను, వాటిలోపలనుండి వాటివలెనే ప్రకాశించును - కనబడును. ఆ ప్రకారముగానే తనచేత సృష్టింపబడిన దేవతులు, మనుష్యులు మొదలగు చిత్ర విచిత్రమైన శరీరములందు పరమాత్మ అంతరాత్మగా ప్రవేశించి - భక్తులు ఉపాసించుటకు వీలుగా నుండుచు హెచ్చుతగ్గులుగల యోనులందు శరీరములందుండి వాటివలె ప్రవర్తించును - ఈ విధముగా ఉపాధులలో భేదమున్నను వాటిలోనున్న భగవంతుడు ఒక్కడే అయి వాటిచేత వాటి వాటి పనులు చేయించుచుండును).

Transliteration
  1. “yadvastu sva samīpasthaṃ vastvaṃ taraṃ vyāvartayati, apitu, svayaṃ tēna na saṃbadhyatē sa upādhiḥ ityucyatē”.

(ēdi tana samīpamaṃdunna itara vastuvunu kappipuccunō, kāni dānitō saṃbaṃdhamulēkayunnadō adi upādi).

(ārmanu tanalō uṃḍuṭaku avakāśamiccunadi upādhi).

  1. āśrayaḥ -

(ī sṛṣṭilōni prativastuvulōnu bhagavaṃtuḍu sūkṣmarūpamulō nunnāḍu. aṭṭi prativastuvu atanu uṃḍuṭaku āśrayamai yunnadi. aṭṭi āśrayamē upādhi).

  1. “yadhāhyayaṃ jyōtirātmā vivasvān āpō bhinnā bahu dhaikō(a)nu gacchan upādhinā kriyatē bhēdarūpō dēvaḥ kṣētrē tamajō (a) yamātmā”

(sūryuni pratibiṃbamu nīṭilō kanabaḍunu - ā nīru kuṃḍalō cinnadigānu, sarassulō peddadigānu, samudramulō yiṃkā peddadigānunnanu sūryabiṃbamuvāṭivalecinnadigānu, peddadigānu unnanu ā heccutaggulu sūryuniki lēvu. nīru alalavalana caliṃcina aṃdulōni sūryabiṃbamu caliṃcinaṭlu kanabaḍinanu, sūryuḍu caliṃcalēdu. ā prakāramugānē dēhamu modalagu upādhulalō unna paramātmaku ā dēhamu yokka heccutaggulu upādhini baṭṭi uṃḍunukāni nijamuga uṃḍavu).

  1. yadhānyāyamatē karṇagōḷakāṃtarataḥ ākāśaḥ śrōtrēṃdriya mityucyatē, tatra karṇa gōḷakaṃ śrōtrisyōpādhiḥ, ēvaṃ aṃtaḥkaraṇamapi svōpahitaṃ caitanyaṃ sākṣitvēna bōdhayitvā svayaṃtēna asaṃbaddhaṃ vartatē.tasmāt aṃtaḥkaraṇaṃ sākṣiṇaḥ upādhiḥ - ityucyatē. aṃtaḥkaraṇa caitanya mātraṃ sākṣī.

(nyāyamatamulō karṇagōḷamulō ceviraṃdhramulōnunna ākāśamu śrōtrēṃdriyamani ceppabaḍu cunnadi. ākāśamuyokka guṇamu śabdamu - śabdamunu grahiṃcunadi cevi. ī prakāramuga ceppinapuḍu śrōtramuyokka - sūkṣma sūtrēṃdriyamuyokka - upādhini - anagā karṇagōḷamu anu upādhini āśrayiṃci ākāśamu tanaguṇamaina śabdamunu grahiṃcunu - ī prakāramugānē aṃtaḥkaraṇamunu āśrayiṃciyunna caitanyamu aṃtaḥkaraṇavṛttulanu cēyiṃcucunnanu sākṣimātramugā nuṃḍunu, aṃtaḥkaraṇavṛttulatō saṃbaṃdhamulēkuṃḍā uṃḍunu. aṃducēta aṃtaḥkaraṇamu sākṣiki upādhi yani ceppabaḍucunnadi. aṃtaḥkaraṇamulōni caitanyamē sākṣi).

(aṃtaḥkaraṇaṃ sākṣiṇaḥ upādhiḥ).

(aṃtaḥkaraṇamulō sākṣi ayina bhagavaṃtuḍu uṃḍunu kanuka aṃtaḥkaraṇamu sākṣiki upādhi).

  1. “ētē parāparē prōktē kṣētra kṣētrajña lakṣaṇē |

prakṛtī yōni rastyēṣāṃ ētadyōnīni tānivai |

carācarāṇi sarvāṇi bhūtānītyupadhāraya |

ēvaṃbōpādhi bhūtēmē kṣētra kṣētrajña lakṣaṇē jagataḥ

prakṛtī yasmāttaddvārāhaṃ tatō hariḥ |

sarvajñō (a) naṃtaśakti māyō pādi, radhīśvaraḥ |

sarvasyakārya vargasya jagatō janma kāraṇaṃ |

vināśakāraṇaṃ tadvat sthirajaṃgamarūpiṇaḥ ||“. (gītābhāvaprakāśamu - 7 - 37 to 40)

(kṣētramu, kṣētrajñuḍu anu reṃḍu lakṣaṇamulugala ī prakṛti parāprakṛti, aparāparakṛti ani reṃḍugānuṃḍi ī carācararūpamaina samasta bhūtamulaku yōni - janmaku kāraṇamu, puṭṭucōṭu. - ī bhūtamulanniyu dīnilōnuṃḍi puṭṭinavi. anaṃtaśakti kaligi sarvajñuḍanaina nēnu vīṭidvārā kāryamaina ī jagattu aṃtaṭikī janmakāraṇamu, vināśakāraṇamunnū ayi yunnānu ī prakṛtiyē māya. ī māyanu upādhigā cēsukoni nēnu ī panini cēyucunnānu - anagā, dīnilō nēnu uṃḍi dānicēta nāpanulu cēyiṃcucunnānu - aṃducēta ī prapaṃcamunaku nēnu upādānakāraṇamu - avināku upādhi. ī prakāramugānē jīvātmaku pāṃca bhautikamaina śarīramu - māyacē kalpiṃcabaḍinadi - upādhi).

  1. kāryōpādhi rayaṃ jīvaḥ kāraṇōpādhirīśvaraḥ |

kāryakāraṇatāṃgitvā pūrnabhōdhō viśiṣyatē ||“.

(kuṃḍa, kūjā modalaguvāṭiki upādānakāraṇamaina maṭṭivale prapaṃcamunaku upādānakāraṇamaina prakṛti īśvarunaku - parabrahmaku - upādhi. aṭṭi prakṛtilōnuṃḍi puṭṭi vēru vēru vastuvulugā unna kāryarūpamulu jīvunaku - jīvātmaku - upādhi - ī upādhulalō bhagavaṃtuḍu - paramātma, jīvātma - uṃḍi tānu lōna unnaṭlu teliyabaḍakuṃḍa vāṭicēta vāṭi panulu cēyiṃcucunnāḍu - ī reṃḍu upādhulalōnu pravēśiṃcakamuṃdu unnavāḍu - kēvaluḍaina bhagavaṃtuḍu - ī upādhulu telusukoni vāṭini vadali vāṭilōnunna kēvala parabrahmanu telusukonuṭayē pūrṇajñānamu - pūrtigā prapaṃcamaṃtaṭā vyāpiṃciyuṃḍu bhagavaṃtuni telusukonuṭayē pūrṇajñānamu - brahmajñānamu). iṭṭi kēvala parabrahma sṛṣṭiki pūrvamuṃḍuvāḍu - sṛṣṭi prāraṃbhiṃcina tarvāta sṛṣṭilōni prativastuvulōnu pravēśiṃciyuṃḍuṭacēta avi tanaku upādhulagucunnavi. iṃduvalana sṛṣṭilōni prativastuvulōnu - pratikāryavastuvulōnu, eṃta cinnavastuvulōnainanu bhagavaṃtuḍu unnāḍu –

“ā. harimayamukāni dravyamu

paramāṇuvu lēdu vaṃśapāvana viṃṭē”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 1 - 17)

(Every particle of matter contains Energy - there is not even the smallest particle of matter which does not contain Energy). iṭlu prati vastuvulōnu upādhigā cēsukoniyunna bhagavaṃtuni ā upādhinuṃḍi vēru cēyuṭa śakyamukādu - (Matter cannot be separated from Energy nor Energy from matter, however small or big it is) - (compare - arthanārīśvararūpamu).

  1. paramātma anniṃṭiyaṃdu vyāpiṃciyunnavāḍē ayinanu avidyā tāratamyamunubaṭṭi - anagā, prakṛti, dāni kāryamulu - ī reṃḍiṃṭiyokka tāratamyamulu - heccu taggulu, ucchanīcamulubaṭṭi - paramātma unna upādhivastuvulu anēka vidhamulugā kanabaḍucuṃḍunu - sthāvaramulaina koṃḍalu, ceṭlu modalaguvāṭiyaṃdunnapuḍu tānu vāṭilō lēnivāḍuganē uṃḍunu - paśuvulu modalaguvāṭiyaṃduṃḍi nīcuḍuganē lekkiṃpabaḍunu - manuṣyulaṃdunnapuḍu telivi tēṭalu kaligiyuṃḍuṭacēta koṃcemu uttamuḍagunu, dēvatalu modalaguvāriyaṃdu iṃkanu koṃcemu uttamuḍagunu, lekkiṃpabaḍunu - ī tēḍāku kāraṇamu tānunna upādhiyēkāni, bhagavaṃtuḍu dēnilōnunnanu okēmādiriganuṃḍunu).

  2. “upādhi vilayē jātē kēvalamātmā viśiṣyatē”

(upādhiyanunadi prakṛticēta bhagavaṃtuniki kaliginadi. adi naśiṃcu svabhāvamukaladi. adi naśiṃcinanu dānilōnuṃḍu paramātma naśiṃpaḍu. prakṛti, prakṛti cēsina prapaṃcamu naśiṃcinanu migiliyuṃḍunadi paramātma - “śēṣa saṃjña pālupoṃdu dīvu”.

(śrīmadāṃdhramahābhāgavatamu -)

  1. yathā agniḥ svataḥ tāratamya hīnōpi tṛṇakāṣṭādyanusārēṇa tathā prakāśatē, tadvat - tathā - svēnakṛtāsu - nirmatāsu, vicitrayōniṣu - dēvamanuṣyādi citrakṛta śarīrakēṣu jīvēṣu - aṃtarātmatayā praviśan - dēvādi śarīrēṣu iva upāsukānugrahēṇa upāsanārthaṃ viśan tiṣṭan, nyūnādhika bhāvēna svakṛtāyōnīranu karōti - avabhāsatē.

(agni svataḥ maṃcidi, ceḍḍadi, cinnadi peddadi anu tāratamyamu lēnidainanu kaṭṭelu eṭuvaṃṭivainanu,peddavainanu, cinnavainanu, vaṃkaragānunnavainanu, tinnagānunnavainanu, vāṭilōpalanuṃḍi vāṭivalenē prakāśiṃcunu - kanabaḍunu. ā prakāramugānē tanacēta sṛṣṭiṃpabaḍina dēvatulu, manuṣyulu modalagu citra vicitramaina śarīramulaṃdu paramātma aṃtarātmagā pravēśiṃci - bhaktulu upāsiṃcuṭaku vīlugā nuṃḍucu heccutaggulugala yōnulaṃdu śarīramulaṃduṃḍi vāṭivale pravartiṃcunu - ī vidhamugā upādhulalō bhēdamunnanu vāṭilōnunna bhagavaṃtuḍu okkaḍē ayi vāṭicēta vāṭi vāṭi panulu cēyiṃcucuṃḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.