← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉపక్రమోపసంహారములు upakramōpasaṃhāramulu

Original — తెలుగు

“ప్రరణ ప్రతిపాద్యస్య తదాద్యంతయోః ఉపపాదనం ఉపక్రమోప సంహారౌ - యథాఛాందోగ్యే షష్టాధ్యాయే ప్రకరణ ప్రతిపాదస్య అద్వితీయ వస్తునః” ఏకమేవ అద్వితీయం“ఇత్యాదౌ,” ఐతదాత్మ్యమిదం సర్వం“ఇత్యంతేచ ప్రతిపాదనం”

(చెప్పదలచిన విషయముగుఱించి మొదట చెప్పినది ఉపక్రమము. ఆ విషయమే మధ్య మధ్య మరల మరల చెప్పి ఆఖరున చెప్పి రూఢిచేయుట - నిశ్చయము చేయుట, సిద్ధాంతము చేయుట ఉపసంహారము. ఈ రెండును కలిసి ఉపక్రమోపసంహారములు - ప్రారంభించుట, ముగించుట షడ్విధలింగములలోనిది ఒకటి).

(ఛాందోగ్యోపనిషత్తులో, షష్టాధ్యాయమున పరబ్రహ్మగుఱించి చెప్పుచూ ప్రారంభములో “సదేవ సోమ్య ! ఇదమగ్ర ఆసీదేక ఏవా ద్వితీయం” (6 - 2 - 1) (అనేక నామరూపములు గలిగి ఇప్పుడు ఈ కనబడుచున్న ప్రపంచమంతయు ఈ ప్రపంచ సృష్టికి పూర్వము సద్రూపముగానే యుండెను, సద్వస్తువుగానే యుండెను. ఆత్మ అనునది సద్రూపముగానే యుండెను. అప్పుడు అది ఒక్కటేయే యుండెను. అదికాక ఇతర వస్తువు మరేదియులేదు - దానిలాంటి సద్వస్తువుగాని, సద్వస్తువుకానటువంటిదికాని మరి యేదియు లేదు). అని ప్రారంభములో చెప్పబడెను. బ్రహ్మ అద్వయమని ప్రారంభములో చెప్పబడెను. ఈ విషయమే మధ్య మధ్య అనేకమారులు అనేకవిధములుగా చెప్పబడెను - “ఐతదాత్మ్యిమిదం సర్వం” - (ఇదంతా - యీ ప్రపంచమంతా, ఈ ప్రపంచములోని వస్తువులన్నీ - ఆత్మకు సంబంధించినవే - ఇదంతా ఆత్మయే, ఈ రీతిగా మారిన ఆత్మయే) అనిన్నీ;

“యథా సౌమ్య ! ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్”

(ఒక మట్టి ముద్దను బట్టి మట్టితో చేయబడినవస్తువులన్నియు తెలియబడునట్లే ఇదంతయు - ఆత్మ మయమే యగుటవలన ఆత్మను తెలుసుకొనిన ఈ ప్రపంచమంతయు తెలియనగును) అని మొదట చెప్పిన విషయమే ఆఖరునచెప్పి నిశ్చయము చేయుట, దృఢపరచుట).

Transliteration

“praraṇa pratipādyasya tadādyaṃtayōḥ upapādanaṃ upakramōpa saṃhārau - yathāchāṃdōgyē ṣaṣṭādhyāyē prakaraṇa pratipādasya advitīya vastunaḥ” ēkamēva advitīyaṃ”ityādau,” aitadātmyamidaṃ sarvaṃ”ityaṃtēca pratipādanaṃ”

(ceppadalacina viṣayamuguṟiṃci modaṭa ceppinadi upakramamu. ā viṣayamē madhya madhya marala marala ceppi ākharuna ceppi rūḍhicēyuṭa - niścayamu cēyuṭa, siddhāṃtamu cēyuṭa upasaṃhāramu. ī reṃḍunu kalisi upakramōpasaṃhāramulu - prāraṃbhiṃcuṭa, mugiṃcuṭa ṣaḍvidhaliṃgamulalōnidi okaṭi).

(chāṃdōgyōpaniṣattulō, ṣaṣṭādhyāyamuna parabrahmaguṟiṃci ceppucū prāraṃbhamulō “sadēva sōmya ! idamagra āsīdēka ēvā dvitīyaṃ” (6 - 2 - 1) (anēka nāmarūpamulu galigi ippuḍu ī kanabaḍucunna prapaṃcamaṃtayu ī prapaṃca sṛṣṭiki pūrvamu sadrūpamugānē yuṃḍenu, sadvastuvugānē yuṃḍenu. ātma anunadi sadrūpamugānē yuṃḍenu. appuḍu adi okkaṭēyē yuṃḍenu. adikāka itara vastuvu marēdiyulēdu - dānilāṃṭi sadvastuvugāni, sadvastuvukānaṭuvaṃṭidikāni mari yēdiyu lēdu). ani prāraṃbhamulō ceppabaḍenu. brahma advayamani prāraṃbhamulō ceppabaḍenu. ī viṣayamē madhya madhya anēkamārulu anēkavidhamulugā ceppabaḍenu - “aitadātmyimidaṃ sarvaṃ” - (idaṃtā - yī prapaṃcamaṃtā, ī prapaṃcamulōni vastuvulannī - ātmaku saṃbaṃdhiṃcinavē - idaṃtā ātmayē, ī rītigā mārina ātmayē) aninnī;

“yathā saumya ! ēkēna mṛtpiṃḍēna sarvaṃ mṛṇmayaṃ vijñātaṃ syāt”

(oka maṭṭi muddanu baṭṭi maṭṭitō cēyabaḍinavastuvulanniyu teliyabaḍunaṭlē idaṃtayu - ātma mayamē yaguṭavalana ātmanu telusukonina ī prapaṃcamaṃtayu teliyanagunu) ani modaṭa ceppina viṣayamē ākharunaceppi niścayamu cēyuṭa, dṛḍhaparacuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.