← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉపలక్షణము upalakṣaṇamu

Original — తెలుగు
  1. స్వపతిపాఫ్దకత్వే సతి స్వేతర ప్రతిపాదకత్వం.

(ఒకదానిని గుఱించి చెప్పినపుడు, దాని లక్షణములు గలవాటన్నింటినీ చెప్పినట్లే యగుట).

(ఉపలక్షిత వస్తువుయొక్క స్వరూపజ్ఞానము కలుగుటయే ఉపలక్షణముయొక్క ప్రయోజనము - “కాక వద్దేవదత్త గృహం”(కాకి ఉన్న ఇల్లు దేవదత్తుని గృహము) అని చెప్పినపుడు దేవదత్తుని గృహమునకు కాకి ఉపలక్షణము - కాకి దేవదత్తుని గృహము చూపించును. అంతేగాని దానికి ఇంకొక ప్రయోజనములేదు - పరబ్రహ్మకు మూర్తి ఆకారము - లేదు. పరబ్రహ్మను గుఱించి చెప్పునపుడు చతుర్ముఖబ్రహ్మగుఱించి చెప్పి ఇది పరబ్రహ్మ అని పరబ్రహ్మయొక్క సగుణరూపము చెప్పబడును - అట్లు చెప్పునపుడు పరబ్రహ్మకు కూడ సగుణ బ్రహ్మకు ఉన్న చతుర్భుజములు ఉండుననికాదు.- మూర్తి ఒకటే తీసుకొనవలయును - చతుర్భుజములు వదలివేయవలెను - అప్పుడు చతుర్భుజములు ఉపలక్షణము. సగుణబ్రహ్మమూర్తి - ఆకారము ఉపాసన కొరకే).

  1. ఉపలక్షణం నామ చంద్రస్య శాఖేన తటస్థం క్ఞాపకం -.

(చంద్రుని చూచునపుడు చెట్టుకొమ్మని చూపి దానిమీద కనబడు చంద్రుడు అని చెప్పునపుడుచెట్టుకొమ్మ ఉపలక్షణము. చంద్రుని చూపుటకే చెట్టుకొమ్మ ప్రయోజనము).

Transliteration
  1. svapatipāphdakatvē sati svētara pratipādakatvaṃ.

(okadānini guṟiṃci ceppinapuḍu, dāni lakṣaṇamulu galavāṭanniṃṭinī ceppinaṭlē yaguṭa).

(upalakṣita vastuvuyokka svarūpajñānamu kaluguṭayē upalakṣaṇamuyokka prayōjanamu - “kāka vaddēvadatta gṛhaṃ”(kāki unna illu dēvadattuni gṛhamu) ani ceppinapuḍu dēvadattuni gṛhamunaku kāki upalakṣaṇamu - kāki dēvadattuni gṛhamu cūpiṃcunu. aṃtēgāni dāniki iṃkoka prayōjanamulēdu - parabrahmaku mūrti ākāramu - lēdu. parabrahmanu guṟiṃci ceppunapuḍu caturmukhabrahmaguṟiṃci ceppi idi parabrahma ani parabrahmayokka saguṇarūpamu ceppabaḍunu - aṭlu ceppunapuḍu parabrahmaku kūḍa saguṇa brahmaku unna caturbhujamulu uṃḍunanikādu.- mūrti okaṭē tīsukonavalayunu - caturbhujamulu vadalivēyavalenu - appuḍu caturbhujamulu upalakṣaṇamu. saguṇabrahmamūrti - ākāramu upāsana korakē).

  1. upalakṣaṇaṃ nāma caṃdrasya śākhēna taṭasthaṃ kñāpakaṃ -.

(caṃdruni cūcunapuḍu ceṭṭukommani cūpi dānimīda kanabaḍu caṃdruḍu ani ceppunapuḍuceṭṭukomma upalakṣaṇamu. caṃdruni cūpuṭakē ceṭṭukomma prayōjanamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.