← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉపనిషత్ upaniṣat

Original — తెలుగు
  1. పరమేశ్వరస్య పదం ఉపగమయతీ త్యుపనిషత్.

(పరమేశ్వరుని పదమును - పరమపదమును, మోక్షమును పొందించునది, దగ్గరకు తీసుకొని వెళ్ళునది).

  1. బ్రహణి ఉపనిషణ్ణితి ఉపనిషత్.

(పరబ్రహ్మ యందు పొందించునది కనుక ఉపనిషత్).

  1. “ఉపసమీపే నిషీదతి యోగచిత్తే”

(యోగులకు మనసులో దగ్గరగా నుండునది ఆత్మ - అందుచేత ఉపనిషత్తు అనగా ఆత్మయని అర్థము - ఆత్మ గుఱించి బోధించు శ్రుతులు కూడ ఉపనిషత్తులే).

  1. ఉపనిషణ్ణం పరం త్రేయో అస్యాం ఇత్యుపనిషత్.

(దీనియందు పరమశ్రేయస్సు అయిన పరబ్రహ్మ సమీపముగనే - దగ్గరగనే - ఉన్నాడు. అందుచేత ఇది ఉపనిషత్ అని చెప్పబడినది.దీనిలోని విషయము పరమాత్మ - ఇది పరమాత్మగుఱించి చెప్పునది).

  1. ఉపనిషత్ శబ్దేన బ్రహ్మ విద్యా ఉచ్యతే.

(ఉపనిషత్ అనగా బ్రహ్మవిద్య - ఆత్మ తత్వమును తెలియచేయు జ్ఞానము - అని చెప్పబడినది).

  1. “ఉపనీయతమాత్మానం అపాస్త ద్వయం యతః |

నిహంత్య విద్యాంతజ్జంచ తస్మాదుపనిషద్భవేత్ ||“.

(ద్వయబుద్ధిని పోగొట్టి - అనగా, బ్రహ్మవేరు - ప్రపంచము వేరు అను బుద్ధిని పోగొట్టి - అవిద్యను, దానివలనకలుగు వాటిని- అనర్థములను - తొలగించి పరమాత్మ దగ్గఱకు చేర్చునది కనుక ఉపనిషత్).

  1. “యథాయ ఇమాం బ్రహ్మ విద్యా ముపయంత్యాత్మ భావేన శ్రద్ధాభక్తి పురస్సరాః సంతస్తేషాం గర్భ జన్మ జరారోగాద్యనర్థపూగం నిశాతయతిపరం వా బ్రహ్మ గమయతి అ విద్యాది సంసారకారణం చాత్యంత మవసాదయతి వినాశయ తీత్యుపనిషత్” (శ్రీ శంకరః)

(సత్పురుషులు శ్రద్ధాభక్తులుగలవారై ఈ ఉపనిషత్తులు బోధించు బ్రహ్మవిద్యను అభ్యసించెదరు - అది వారి గర్భ, జన్మ, జరా, రోగములు కలుగచేయు సంసారము వలన కలుగు అనర్థములను నాశముచేయును, పరబ్రహ్మను పొందించును, మోక్షమునిచ్చును - అందుచేత ఉపనిషత్తు అని చెప్పబడినది).

  1. స్వనిష్ఠానాం సంసారబీజం అవసాదయతి, పరమాత్మానం నిగమయతి అవబోధయతి, గర్భ జన్మ దీంశ్చ శాతయతీత్యాత్మవిద్యా ఉపనిషత్.

(బ్రహ్మజ్ఞాన నిష్ఠయందుండువారికి జననమరణ రూపమైన సంసారమునకు కారణమైనదానిని నాశము చేయునది, పరమాత్మను వివరముగా తెలియచేయునది, తల్లి గర్భములో ప్రవేశించుట, జన్మించుట, మొదలగువాటిని లేకుండ చేయునది అయిన ఆత్మవిద్య - ఆత్మ తత్వమును బోధించు విద్య - ఉపనిషత్).

“యే ముముక్షవః దృష్టానిస్రావిక విషయ వితృష్ణాః సంతః ఉపనషచ్ఛబ్దిత విద్యాం తన్నిష్ఠత యా నిశ్చయేనశీలయంతి, తేషాం అవిద్యాదేః సంసార బీజస్య విశరణాత్ - వినాశాత్, పరబ్రహ్మ గమయతృత్వాత్, గర్భజన్మ జరామరణాద్యుపద్రవావసాయితృత్వాత్ ఉపనిషత్సమాఖ్య యాప్యన్య కృతాత్పరం శ్రేయ ఇతి బ్రహ్మ విద్యోపనిషదుచ్యతే”.

(కంటికి కనబడునవి, చెవికి వినబడునవి యైన విషయముల యడల ఆశలేని సత్పురుషులను ఈఉపనిషత్తులను పేరుపొందిన బ్రహ్మవిద్యయందే నిష్ఠ గలవారు జననమరణరూపమగు సంసారమునకు కారణమైన అవిద్యను - అజ్ఞానమును - నాశము చేయుటవలనను పరబ్రహ్మను పొందించుటచేతను, ఉపనిషత్ అను పేరుతో ఇతరులు చేసినదానికంటె అత్యంత శ్రేయస్కరమైనది యగు బ్రహ్మ విద్యయే ఉపనిషత్ అని చెప్పబడినది).

  1. పరతత్వ ప్రధానాః మంత్ర బ్రాహ్మణభాగాః ఉపనిషదః.

(పరతత్వము గుఱించి, ఆత్మతత్వమును గుఱించి, బ్రహ్మతత్వమును గుఱించియే ముఖ్యముగా చెప్పునది, మంత్రములు, బ్రాహ్మణములు అను భాగములు గలవి ఉపనిషత్తులు).

  1. రహస్యోపదేశః.

(వేదములోని నిగూడార్థమును - రహస్యముగా ఉన్న అర్థమును ఉపదేశించునది).

  1. జ్ఞేయబ్రహ్మ బోధకత్వాత్, వేదస్య అంత్యభాగత్వాత్ వేదసారార్థ బోధకత్వాత్ చ వేదాంతాః, జ్ఞానకాండా ఉపనిషదః ఇతి చ ఉచ్యతే.

(జ్ఞేయ బ్రహ్మను - జ్ఞానయోగముద్వారా తెలియదగు, నిర్విశేష, నిరాకార పరబ్రహ్మను - బోధించునదగుటచేతను, వేదమునకు చివరభాగము అగుటహేతను, వేదముయొక్క అర్థమును బోధించునదగుటచేతను ఇది జ్ఞానకాండయని, వేదాంతమని, ఉపనిషత్తు అనియు చెప్పబడుచున్నది).

  1. “సామీప్యేనాహం బ్రహ్మాస్మీతి గమ యిత్వా నితరాం అహం మామాది గ్రంధిం శిధిలీకృత్య అవిద్యాం సకార్య సంస్కారాం సాధయతి, వినాశయతి ఇత్యుపనిషత్ - తద్దేతుః ప్రణవో ప్యుపనిషత్”.

(దగ్గరగా ఉండుటచేత “నేనే బ్రహ్మను” అని బోధించి, “నేను, నాది” యను గ్రంధిని - జ్ఞానమునకు అడ్డుగానుండు ముడివలెనుండుదానిని - నశింపచేసి, అవిద్యను - అజ్ఞానమును, దాని కార్యముతో కూడ నశింపచేయునదిగనుక ఉపనిషత్తు. దీనికి కారణమైన ప్రణవము - ఓం కారము - కూడా ఉపనిషత్తే).

  1. ఉపసమీపే నిషద్య ఉపనిశ్య శిష్యేణా చార్యాత్ గృహ్యమాణత్వాత్ ఉపనిషత్. ఉపనిషత్ ఇతి కేచిత్.

(గురువు సమీపమందు కూర్చుని అతనినుండి శిష్యుడు గ్రహించునది కనుక ఉపనిషత్తు అని కొందఱి అభిప్రయము).

  1. వేదములు చివరను ఉండి బ్రహ్మ తత్వమును నిర్ణయించుచు ప్రామాణ్యముకనుక ఉపనిషత్తులు వేద శిరస్సులని కూడ చెప్పబడుచున్నవి. జ్ఞానకాండయనియు చెప్పబడుచున్నవి.

  2. అష్టోత్తరశతోపనిషత్సు - ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండ, మాందూక్య, తిత్తిరిః |

ఐతరేయశ్చ ఛాందోగ్యం బృహదారణ్యకం దశ ||

ఇతి దశోపనిషదో ముఖ్యాః తత్ర ఐతరేయోపనిషత్ ఋగ్వేదగతాః; ఈశ బృహదారణ్యకే, శుక్ల యజుర్వేదగతాః, కఠవల్లీ యైత్తరీయే కృష్ణ యజుర్వేదగతౌ, కేన ఛాందోగ్యో సామవేదగతౌ; ప్రశ్న, ముండక, మాండూక్యోపనిషదో అధర్వ వేదగతాః - ఇతి విభాగః.

(ఉపనిషత్తులు 108 లోను పది ముఖ్యమైనవి - ఈశావాశ్యోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్, ఐతరేయోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్, బృహదారణ్యకోపనిషత్తు,. వీటిలో ఐతిరేయోపనిషత్తు ఋగ్వేదమునకు సంబంధించినది. ఈశావాశ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, ఈ రెండును శుక్ల యజుర్వేదమునకు చెందినవి. కఠోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్, కృష్ణ యజుర్వేదమునకు సంబంధించినవి. కేనోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు సామవేదమునకు చెందినవి. ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు అధర్వవేదమునకు సంబంధించినవి.

Transliteration
  1. paramēśvarasya padaṃ upagamayatī tyupaniṣat.

(paramēśvaruni padamunu - paramapadamunu, mōkṣamunu poṃdiṃcunadi, daggaraku tīsukoni veḷḷunadi).

  1. brahaṇi upaniṣaṇṇiti upaniṣat.

(parabrahma yaṃdu poṃdiṃcunadi kanuka upaniṣat).

  1. “upasamīpē niṣīdati yōgacittē”

(yōgulaku manasulō daggaragā nuṃḍunadi ātma - aṃducēta upaniṣattu anagā ātmayani arthamu - ātma guṟiṃci bōdhiṃcu śrutulu kūḍa upaniṣattulē).

  1. upaniṣaṇṇaṃ paraṃ trēyō asyāṃ ityupaniṣat.

(dīniyaṃdu paramaśrēyassu ayina parabrahma samīpamuganē - daggaraganē - unnāḍu. aṃducēta idi upaniṣat ani ceppabaḍinadi.dīnilōni viṣayamu paramātma - idi paramātmaguṟiṃci ceppunadi).

  1. upaniṣat śabdēna brahma vidyā ucyatē.

(upaniṣat anagā brahmavidya - ātma tatvamunu teliyacēyu jñānamu - ani ceppabaḍinadi).

  1. “upanīyatamātmānaṃ apāsta dvayaṃ yataḥ |

nihaṃtya vidyāṃtajjaṃca tasmādupaniṣadbhavēt ||“.

(dvayabuddhini pōgoṭṭi - anagā, brahmavēru - prapaṃcamu vēru anu buddhini pōgoṭṭi - avidyanu, dānivalanakalugu vāṭini- anarthamulanu - tolagiṃci paramātma daggaṟaku cērcunadi kanuka upaniṣat).

  1. “yathāya imāṃ brahma vidyā mupayaṃtyātma bhāvēna śraddhābhakti purassarāḥ saṃtastēṣāṃ garbha janma jarārōgādyanarthapūgaṃ niśātayatiparaṃ vā brahma gamayati a vidyādi saṃsārakāraṇaṃ cātyaṃta mavasādayati vināśaya tītyupaniṣat” (śrī śaṃkaraḥ)

(satpuruṣulu śraddhābhaktulugalavārai ī upaniṣattulu bōdhiṃcu brahmavidyanu abhyasiṃcedaru - adi vāri garbha, janma, jarā, rōgamulu kalugacēyu saṃsāramu valana kalugu anarthamulanu nāśamucēyunu, parabrahmanu poṃdiṃcunu, mōkṣamuniccunu - aṃducēta upaniṣattu ani ceppabaḍinadi).

  1. svaniṣṭhānāṃ saṃsārabījaṃ avasādayati, paramātmānaṃ nigamayati avabōdhayati, garbha janma dīṃśca śātayatītyātmavidyā upaniṣat.

(brahmajñāna niṣṭhayaṃduṃḍuvāriki jananamaraṇa rūpamaina saṃsāramunaku kāraṇamainadānini nāśamu cēyunadi, paramātmanu vivaramugā teliyacēyunadi, talli garbhamulō pravēśiṃcuṭa, janmiṃcuṭa, modalaguvāṭini lēkuṃḍa cēyunadi ayina ātmavidya - ātma tatvamunu bōdhiṃcu vidya - upaniṣat).

“yē mumukṣavaḥ dṛṣṭānisrāvika viṣaya vitṛṣṇāḥ saṃtaḥ upanaṣacchabdita vidyāṃ tanniṣṭhata yā niścayēnaśīlayaṃti, tēṣāṃ avidyādēḥ saṃsāra bījasya viśaraṇāt - vināśāt, parabrahma gamayatṛtvāt, garbhajanma jarāmaraṇādyupadravāvasāyitṛtvāt upaniṣatsamākhya yāpyanya kṛtātparaṃ śrēya iti brahma vidyōpaniṣaducyatē”.

(kaṃṭiki kanabaḍunavi, ceviki vinabaḍunavi yaina viṣayamula yaḍala āśalēni satpuruṣulanu īupaniṣattulanu pērupoṃdina brahmavidyayaṃdē niṣṭha galavāru jananamaraṇarūpamagu saṃsāramunaku kāraṇamaina avidyanu - ajñānamunu - nāśamu cēyuṭavalananu parabrahmanu poṃdiṃcuṭacētanu, upaniṣat anu pērutō itarulu cēsinadānikaṃṭe atyaṃta śrēyaskaramainadi yagu brahma vidyayē upaniṣat ani ceppabaḍinadi).

  1. paratatva pradhānāḥ maṃtra brāhmaṇabhāgāḥ upaniṣadaḥ.

(paratatvamu guṟiṃci, ātmatatvamunu guṟiṃci, brahmatatvamunu guṟiṃciyē mukhyamugā ceppunadi, maṃtramulu, brāhmaṇamulu anu bhāgamulu galavi upaniṣattulu).

  1. rahasyōpadēśaḥ.

(vēdamulōni nigūḍārthamunu - rahasyamugā unna arthamunu upadēśiṃcunadi).

  1. jñēyabrahma bōdhakatvāt, vēdasya aṃtyabhāgatvāt vēdasārārtha bōdhakatvāt ca vēdāṃtāḥ, jñānakāṃḍā upaniṣadaḥ iti ca ucyatē.

(jñēya brahmanu - jñānayōgamudvārā teliyadagu, nirviśēṣa, nirākāra parabrahmanu - bōdhiṃcunadaguṭacētanu, vēdamunaku civarabhāgamu aguṭahētanu, vēdamuyokka arthamunu bōdhiṃcunadaguṭacētanu idi jñānakāṃḍayani, vēdāṃtamani, upaniṣattu aniyu ceppabaḍucunnadi).

  1. “sāmīpyēnāhaṃ brahmāsmīti gama yitvā nitarāṃ ahaṃ māmādi graṃdhiṃ śidhilīkṛtya avidyāṃ sakārya saṃskārāṃ sādhayati, vināśayati ityupaniṣat - taddētuḥ praṇavō pyupaniṣat”.

(daggaragā uṃḍuṭacēta “nēnē brahmanu” ani bōdhiṃci, “nēnu, nādi” yanu graṃdhini - jñānamunaku aḍḍugānuṃḍu muḍivalenuṃḍudānini - naśiṃpacēsi, avidyanu - ajñānamunu, dāni kāryamutō kūḍa naśiṃpacēyunadiganuka upaniṣattu. dīniki kāraṇamaina praṇavamu - ōṃ kāramu - kūḍā upaniṣattē).

  1. upasamīpē niṣadya upaniśya śiṣyēṇā cāryāt gṛhyamāṇatvāt upaniṣat. upaniṣat iti kēcit.

(guruvu samīpamaṃdu kūrcuni ataninuṃḍi śiṣyuḍu grahiṃcunadi kanuka upaniṣattu ani koṃdaṟi abhiprayamu).

  1. vēdamulu civaranu uṃḍi brahma tatvamunu nirṇayiṃcucu prāmāṇyamukanuka upaniṣattulu vēda śirassulani kūḍa ceppabaḍucunnavi. jñānakāṃḍayaniyu ceppabaḍucunnavi.

  2. aṣṭōttaraśatōpaniṣatsu - īśa, kēna, kaṭha, praśna, muṃḍa, māṃdūkya, tittiriḥ |

aitarēyaśca chāṃdōgyaṃ bṛhadāraṇyakaṃ daśa ||

iti daśōpaniṣadō mukhyāḥ tatra aitarēyōpaniṣat ṛgvēdagatāḥ; īśa bṛhadāraṇyakē, śukla yajurvēdagatāḥ, kaṭhavallī yaittarīyē kṛṣṇa yajurvēdagatau, kēna chāṃdōgyō sāmavēdagatau; praśna, muṃḍaka, māṃḍūkyōpaniṣadō adharva vēdagatāḥ - iti vibhāgaḥ.

(upaniṣattulu 108 lōnu padi mukhyamainavi - īśāvāśyōpaniṣattu, kēnōpaniṣattu, kaṭhōpaniṣattu, praśnōpaniṣattu, muṃḍakōpaniṣattu, māṃḍūkyōpaniṣattu, taittirīyōpaniṣat, aitarēyōpaniṣattu, chāṃdōgyōpaniṣat, bṛhadāraṇyakōpaniṣattu,. vīṭilō aitirēyōpaniṣattu ṛgvēdamunaku saṃbaṃdhiṃcinadi. īśāvāśyōpaniṣattu, bṛhadāraṇyakōpaniṣattu, ī reṃḍunu śukla yajurvēdamunaku ceṃdinavi. kaṭhōpaniṣattu, taittirīyōpaniṣat, kṛṣṇa yajurvēdamunaku saṃbaṃdhiṃcinavi. kēnōpaniṣattu, chāṃdōgyōpaniṣattu sāmavēdamunaku ceṃdinavi. praśnōpaniṣattu, muṃḍakōpaniṣattu, māṃḍūkyōpaniṣattu adharvavēdamunaku saṃbaṃdhiṃcinavi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.