← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉపపత్తి upapatti

Original — తెలుగు
  1. పుట్టుట; కారణము.

  2. ప్రకరణ ప్రతిపాద్యర్థసాధనే తత్ర తత్ర శ్రూయ మాణాయుక్తిః ఉపపత్తిః.

(ఏదేని ఒక విషయమును ప్రతిపాదించునపుడు దాని యర్థ,మును సాధించుటకు అక్కడక్కడ ఉపయోగింపబడు యుక్తి - ఛాందోగ్యోపనిషత్తులో

“యథా సౌమ్య ! ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్వాత్ కాచారంభణం వికారో నామధేయం - మృత్తికేవసత్యం”

(ఒక మట్టిముద్దను చూచి దానితో చేయబడిన కుండ, కూజా, మూకుడు మొదలగువాటిని తెలియనగును - ఇవి నామరూపములు మాత్రమే - వీటిలో నున్నది మట్టియే. ఈ మట్టియే శాశ్వతమైనది - కుండ, మూకుడు మొదలగునవి బ్రద్దలయిపోయినప్పుడు మిగిలినది, చెడిపోనిది మట్టియే - అని తెలుసుకొనుచున్నాము. ఇట్లే బ్రహ్మగుఱించి చెప్పునపుడు బ్రహ్మను తెలుసుకొనిన బ్రహ్మలోనుండి పుట్టిన ప్రపంచము - ప్రపంచములోని వస్తువులన్నియు, నామరూపములు గలిగియుండుట చేత బ్రహ్మకంటె వేరుగా కనబడుచున్నను - నశించునదియే. అందులోనున్న పరబ్రహ్మ నిత్యుడు, అని చెప్పుటకు ఈ యుక్తి - ఉపపత్తి ఉపయోగపడుచున్నది).

Transliteration
  1. puṭṭuṭa; kāraṇamu.

  2. prakaraṇa pratipādyarthasādhanē tatra tatra śrūya māṇāyuktiḥ upapattiḥ.

(ēdēni oka viṣayamunu pratipādiṃcunapuḍu dāni yartha,munu sādhiṃcuṭaku akkaḍakkaḍa upayōgiṃpabaḍu yukti - chāṃdōgyōpaniṣattulō

“yathā saumya ! ēkēna mṛtpiṃḍēna sarvaṃ mṛṇmayaṃ vijñātaṃ svāt kācāraṃbhaṇaṃ vikārō nāmadhēyaṃ - mṛttikēvasatyaṃ”

(oka maṭṭimuddanu cūci dānitō cēyabaḍina kuṃḍa, kūjā, mūkuḍu modalaguvāṭini teliyanagunu - ivi nāmarūpamulu mātramē - vīṭilō nunnadi maṭṭiyē. ī maṭṭiyē śāśvatamainadi - kuṃḍa, mūkuḍu modalagunavi braddalayipōyinappuḍu migilinadi, ceḍipōnidi maṭṭiyē - ani telusukonucunnāmu. iṭlē brahmaguṟiṃci ceppunapuḍu brahmanu telusukonina brahmalōnuṃḍi puṭṭina prapaṃcamu - prapaṃcamulōni vastuvulanniyu, nāmarūpamulu galigiyuṃḍuṭa cēta brahmakaṃṭe vērugā kanabaḍucunnanu - naśiṃcunadiyē. aṃdulōnunna parabrahma nityuḍu, ani ceppuṭaku ī yukti - upapatti upayōgapaḍucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.