(ఉపాసకుడు మొదట స్నాన సంధ్యాది నిత్యకృత్యములు చేసి శ్రీదేవి యొక్క ప్రతీక ముందు కూర్చుని భూశుద్ధియును, భూతశుద్ధియును, అంతర్మాతృకా, బహిర్మాతృకాదులను ఆచరించి, దైవతము మంత్రమునకు ఆఘీనమైనవాడు అని చెప్పబడియున్నది కనుక, తను అనుష్ఠించుచున్న మంత్రము చేతనే,తన దేహేంద్రియాంతఃకరణ కర్తయగు జీవాత్మయగు తనను 82 న్యాసములచే సాక్షాత్సపరదేవీ స్వరూపముగా భావించి ఆ దేవీ శక్తిని ఆ శ్రీచక్రాది ప్రతీకములందు ప్రాణప్రతిష్టాసనాది విధానమున నావహింపచేసి, కళాన్యాసాదులు చేసి, మరల తాను ఉపాసక జీవభావుడనని భావించి 64 ఉపచారముల విధానమున శ్రీదేవిని పూజించి, పూజానంతరమందు ఆ శ్రీదేవిని తన జీవాత్మయందాత్మారోపణము గావించుకొని నేనా పరబ్రహ్మశక్తి స్వరూపమునే యగుదునని భావింపవలెను - ఇట్లు రోజు రోజుకు అభివృద్ధి చెందుటచే, భ్రమరకీటన్యాయమున ఉపాసకుడు సహితము శ్రీదేవీ స్వరూపుడగును - తర్వాత ఆ దేవీ స్వరూపము బ్రహ్మమే కావున నేనును ఆ పరబ్రహ్మమే అను త్రికరణశుద్ధిభావనచే సాక్షాజ్జీవ బ్రహ్మైక రూప సాయుజ్య మోక్షము శాక్తేయోపాసకుడు చెందగలడు).
(ఈ ప్రకారము మిగతా దేవతోపాసనలు కూడా చేయవలెను).
(ఉపాసన మూడు విధములు - ఇతర వస్తువులమీద ధ్యానములేక ఉపాస్యదేవతయందే లగ్నమయిన మనస్సు కలిగియుండుట, తర్వాత మనసులో కీర్తనచేయుట, అటు తర్వాత తెలియ తగిన ఉపాసన చేయుచున్న దేవతయొక్క దర్శనము లభించుట).
(upāsakuḍu modaṭa snāna saṃdhyādi nityakṛtyamulu cēsi śrīdēvi yokka pratīka muṃdu kūrcuni bhūśuddhiyunu, bhūtaśuddhiyunu, aṃtarmātṛkā, bahirmātṛkādulanu ācariṃci, daivatamu maṃtramunaku āghīnamainavāḍu ani ceppabaḍiyunnadi kanuka, tanu anuṣṭhiṃcucunna maṃtramu cētanē,tana dēhēṃdriyāṃtaḥkaraṇa kartayagu jīvātmayagu tananu 82 nyāsamulacē sākṣātsaparadēvī svarūpamugā bhāviṃci ā dēvī śaktini ā śrīcakrādi pratīkamulaṃdu prāṇapratiṣṭāsanādi vidhānamuna nāvahiṃpacēsi, kaḷānyāsādulu cēsi, marala tānu upāsaka jīvabhāvuḍanani bhāviṃci 64 upacāramula vidhānamuna śrīdēvini pūjiṃci, pūjānaṃtaramaṃdu ā śrīdēvini tana jīvātmayaṃdātmārōpaṇamu gāviṃcukoni nēnā parabrahmaśakti svarūpamunē yagudunani bhāviṃpavalenu - iṭlu rōju rōjuku abhivṛddhi ceṃduṭacē, bhramarakīṭanyāyamuna upāsakuḍu sahitamu śrīdēvī svarūpuḍagunu - tarvāta ā dēvī svarūpamu brahmamē kāvuna nēnunu ā parabrahmamē anu trikaraṇaśuddhibhāvanacē sākṣājjīva brahmaika rūpa sāyujya mōkṣamu śāktēyōpāsakuḍu ceṃdagalaḍu).
(ī prakāramu migatā dēvatōpāsanalu kūḍā cēyavalenu).
(upāsana mūḍu vidhamulu - itara vastuvulamīda dhyānamulēka upāsyadēvatayaṃdē lagnamayina manassu kaligiyuṃḍuṭa, tarvāta manasulō kīrtanacēyuṭa, aṭu tarvāta teliya tagina upāsana cēyucunna dēvatayokka darśanamu labhiṃcuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.