మహత్వాచ్చ ఉచ్యతే ఊర్ధ్వమితి. బ్రహ్మ వ్యక్తమాయా శక్తిమత్ తత్ మూలం అస్య ఇతి సోయం సంసారవృక్షః - ఊర్ధ్వమూలః”
(శ్రీ శంకరః)
(సంసారము ఒక చెట్టుతో పోల్చబడినది. చెట్టుకు మూలము - మొదలు -, లేక, వేరు - భూమిలోనుండును. కాని ఈ సంసారమను వృక్షమునకు మొదలు (వేరు) ఊర్ధ్వమున - మీదను - ఉన్నది. కాలముచేత, సూక్ష్మమగుటచేత, అన్నింటికి కారణమగుటచేత, వినాశములేక ఎప్పుడును ప్రవాహరూపములో నిత్యముగ నుండుట చేతను, అన్నింటికంటె పెద్దది యగుటచేతను, ఊర్ధ్వమున మొదలు - వేరు కలదియని చెప్పబడినది. కంటికి కనపడనివాడు, జ్ఞానమునకు అందని మాయాశక్తిగలవాడు భగవంతుడు - అట్టివాడు ఈ సంసారవృక్షమునకు మొదలు - కారణమైనవాడు కనుక ఈ సంసారవృక్షము ఊర్ధ్వమూలము. భగవంతునిలోనుండి ఈ సంసారరూపమైన ప్రపంచము పుట్టినది కనుక దీనికి మొదలు - వేరు, కారణము భగవంతుడు - మీద భగవంతునినుండి క్రింద ప్రపంచముగా పెరిగినది).
(ఏడు లోకములకు పైన ఉన్న చతుర్ముఖ బ్రహ్మ (అవ్యక్తము) దీనికి కారణము, లేక పుట్టుచోటు అగుటచేత ఈ సంసారవృక్షము మీద వేర్లు కలది, మీదను మొలచి క్రిందకు వ్యాపించినది అని చెప్పబడుచున్నది). (చూడుము - ‘అశ్వత్థము’).
(ఊర్ధ్వము అనగా విష్ణువని, అన్నింటికన్న ఉత్తముడని అర్థము).
mahatvācca ucyatē ūrdhvamiti. brahma vyaktamāyā śaktimat tat mūlaṃ asya iti sōyaṃ saṃsāravṛkṣaḥ - ūrdhvamūlaḥ”
(śrī śaṃkaraḥ)
(saṃsāramu oka ceṭṭutō pōlcabaḍinadi. ceṭṭuku mūlamu - modalu -, lēka, vēru - bhūmilōnuṃḍunu. kāni ī saṃsāramanu vṛkṣamunaku modalu (vēru) ūrdhvamuna - mīdanu - unnadi. kālamucēta, sūkṣmamaguṭacēta, anniṃṭiki kāraṇamaguṭacēta, vināśamulēka eppuḍunu pravāharūpamulō nityamuga nuṃḍuṭa cētanu, anniṃṭikaṃṭe peddadi yaguṭacētanu, ūrdhvamuna modalu - vēru kaladiyani ceppabaḍinadi. kaṃṭiki kanapaḍanivāḍu, jñānamunaku aṃdani māyāśaktigalavāḍu bhagavaṃtuḍu - aṭṭivāḍu ī saṃsāravṛkṣamunaku modalu - kāraṇamainavāḍu kanuka ī saṃsāravṛkṣamu ūrdhvamūlamu. bhagavaṃtunilōnuṃḍi ī saṃsārarūpamaina prapaṃcamu puṭṭinadi kanuka dīniki modalu - vēru, kāraṇamu bhagavaṃtuḍu - mīda bhagavaṃtuninuṃḍi kriṃda prapaṃcamugā periginadi).
(ēḍu lōkamulaku paina unna caturmukha brahma (avyaktamu) dīniki kāraṇamu, lēka puṭṭucōṭu aguṭacēta ī saṃsāravṛkṣamu mīda vērlu kaladi, mīdanu molaci kriṃdaku vyāpiṃcinadi ani ceppabaḍucunnadi). (cūḍumu - ‘aśvatthamu’).
(ūrdhvamu anagā viṣṇuvani, anniṃṭikanna uttamuḍani arthamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.