(సాలెపురుగు తనదేహమునుండి పట్టు కట్టుకొనుటకు దారములను పుట్టించును, మరల తనలోనికి తీసుకొనును).
(బొడ్డునందు దారములుకలది - సాలెపురుగు. దారములను ఎల్లపుడు తయారుచేయు ఒకవిధమైన పురుగు).
ఊర్ణుతే తంతుభిః ఆత్మానం ఆచ్ఛాద యతి - (దారములచేత తనను కప్పుకొనునది).
తంతు వాయకీటః - యథా ఊర్ణనాభిః ఊర్ణుతే, తంతుజాలైః పటాకారం సృజతి, స్థాపయతి, ఉపసంహరతిచ, ఏవం అమోఘ సంకల్పస్సన్ భగవాన్ ఊర్ణనాభివత్ క్రీడతి.
(సాలెపురుగు - దారములు తనలోనుండి పుట్టించి, వాటితో బట్టవలె (గూడు) తయారుచేయును, అవసరములేనపుడు వాటిని తనలోనికి తీసుకొనును - ఆ ప్రకారమే అమోఘ సంకల్పముగల - అడ్డులేని, వ్యర్థముకాని సంకల్పముగల భగవంతుడు సృష్టి విషయములో క్రీడించును - అనగా - తనలోనుండియే లోకములను, లోకములోని వస్తువులన్నింటిని తనలోనుండి పైకి సృష్టించి, వాటిని కొంతకాలము - స్థితికాలము - లో పోషించి మరల ప్రలయకాలమందు వాటి నన్నింటినీ తనలోనికి తీసుకొనును. సాలెపురుగు తన గూడు కట్టుకొనుటకు తీయు దారము, తనలోనుండి తీసినదే కనుక ఉపాదానకారణము - మట్టితో చేయబడిన కుండకు మట్టి ఉపాదానకారణము. కుండను చేయు కుమ్మరి నిమిత్తకారణము - ఇట్లు కుండకు ఉపాదానకారణము వేరు, నిమిత్తకారణము వేరు - కాని తనలోనుండే దారములు తీసుకొని తానే గూడు అల్లుకుంటున్న సాలెపురుగు తనగూడుకు తానే ఉపాదానకారణము, నిమిత్తకారణము కూడ - అట్లే భగవంతుడు తనలోనుండి సమస్త శరీరములకు కావలసిన వస్తువును రూపింపచేయు ప్రకృతిని తనలోనుండి సృష్టించుటచేత వాటి అన్నింటికి -ప్రపంచమునకు - తాను ఉపాదానకరణము అయి ఉన్నాడు. ఆ వస్తువులకు రూపకల్పనకు తాను ఆ ప్రకృతిలో ప్రవేశించి దానికి తన చైతన్యశక్తిని, చిచ్ఛక్తినిచ్చి దానిచేత తన పని చేయించుకొనుచున్నాడు - అందుచేత భగవంతుడు ప్రపంచమునకు నిమిత్తకారణము కూడ).
(ఉత్తములు, మధ్యములు, అధమములు - ఇది గొప్పది, ఇది చిన్నది, అని అనేక భేదములు కలిగి, వేరు వేరు రూపములు, వేరు వేరు నామములు కలిగి, సత్వరజస్తమోగుణములవలన కలిగిన ఈ చేతనా చేతనములుగల ఈ సమస్త ప్రపంచము, దానిలోనున్న సమస్తవస్తువులలో భగవంతుని రూపము కాని దేదియును లేదు. సాలెపురుగు శరీరములోనుండి వచ్చిన దారములవలె ఇదంతయు - ఇవన్నియు - భగవంతుని శరీరములో నుండి పుట్టినవే).
(sālepurugu tanadēhamunuṃḍi paṭṭu kaṭṭukonuṭaku dāramulanu puṭṭiṃcunu, marala tanalōniki tīsukonunu).
(boḍḍunaṃdu dāramulukaladi - sālepurugu. dāramulanu ellapuḍu tayārucēyu okavidhamaina purugu).
ūrṇutē taṃtubhiḥ ātmānaṃ ācchāda yati - (dāramulacēta tananu kappukonunadi).
taṃtu vāyakīṭaḥ - yathā ūrṇanābhiḥ ūrṇutē, taṃtujālaiḥ paṭākāraṃ sṛjati, sthāpayati, upasaṃharatica, ēvaṃ amōgha saṃkalpassan bhagavān ūrṇanābhivat krīḍati.
(sālepurugu - dāramulu tanalōnuṃḍi puṭṭiṃci, vāṭitō baṭṭavale (gūḍu) tayārucēyunu, avasaramulēnapuḍu vāṭini tanalōniki tīsukonunu - ā prakāramē amōgha saṃkalpamugala - aḍḍulēni, vyarthamukāni saṃkalpamugala bhagavaṃtuḍu sṛṣṭi viṣayamulō krīḍiṃcunu - anagā - tanalōnuṃḍiyē lōkamulanu, lōkamulōni vastuvulanniṃṭini tanalōnuṃḍi paiki sṛṣṭiṃci, vāṭini koṃtakālamu - sthitikālamu - lō pōṣiṃci marala pralayakālamaṃdu vāṭi nanniṃṭinī tanalōniki tīsukonunu. sālepurugu tana gūḍu kaṭṭukonuṭaku tīyu dāramu, tanalōnuṃḍi tīsinadē kanuka upādānakāraṇamu - maṭṭitō cēyabaḍina kuṃḍaku maṭṭi upādānakāraṇamu. kuṃḍanu cēyu kummari nimittakāraṇamu - iṭlu kuṃḍaku upādānakāraṇamu vēru, nimittakāraṇamu vēru - kāni tanalōnuṃḍē dāramulu tīsukoni tānē gūḍu allukuṃṭunna sālepurugu tanagūḍuku tānē upādānakāraṇamu, nimittakāraṇamu kūḍa - aṭlē bhagavaṃtuḍu tanalōnuṃḍi samasta śarīramulaku kāvalasina vastuvunu rūpiṃpacēyu prakṛtini tanalōnuṃḍi sṛṣṭiṃcuṭacēta vāṭi anniṃṭiki -prapaṃcamunaku - tānu upādānakaraṇamu ayi unnāḍu. ā vastuvulaku rūpakalpanaku tānu ā prakṛtilō pravēśiṃci dāniki tana caitanyaśaktini, cicchaktinicci dānicēta tana pani cēyiṃcukonucunnāḍu - aṃducēta bhagavaṃtuḍu prapaṃcamunaku nimittakāraṇamu kūḍa).
(uttamulu, madhyamulu, adhamamulu - idi goppadi, idi cinnadi, ani anēka bhēdamulu kaligi, vēru vēru rūpamulu, vēru vēru nāmamulu kaligi, satvarajastamōguṇamulavalana kaligina ī cētanā cētanamulugala ī samasta prapaṃcamu, dānilōnunna samastavastuvulalō bhagavaṃtuni rūpamu kāni dēdiyunu lēdu. sālepurugu śarīramulōnuṃḍi vaccina dāramulavale idaṃtayu - ivanniyu - bhagavaṃtuni śarīramulō nuṃḍi puṭṭinavē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.