← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉత్పత్తి utpatti

Original — తెలుగు

పుట్టుట - పుట్టినట్లగుట. ఉత్పత్తికి రెండుకారణములు చెప్పబడినవి - 1. ఆరంభము, 2. పరిణామము.

పదార్థములు ఒకటితోనొకటి కలిసి మఱియొక పదార్థమగుట. ఆరంభము - నూలు పోగులు కలిసి వస్త్రమగుట. పరిణామమనగా కారణపదార్థము ఇతర సహాయముచే కార్యరూపముగా మారుట. పాలు మజ్జిగసహాయమున పెరుగుగామారుట. మట్టి కుమ్మఱి సహాయమున కుండగామారుట, వేదాంతులు వివర్తము మూడవ కారణముగా చెప్పుచున్నారు. ఒకపదార్థము ఇతరసహాయము లేనిదే ఇంకొక పదార్థముగా కనబడుట. భ్రాంతిచే చీకటిలో త్రాడు పాముగాకనబడుట. ప్రపంచమంతయు బ్రహ్మయే అయినను వేరుగా ప్రపంచమువలె కనబడుట.

Transliteration

puṭṭuṭa - puṭṭinaṭlaguṭa. utpattiki reṃḍukāraṇamulu ceppabaḍinavi - 1. āraṃbhamu, 2. pariṇāmamu.

padārthamulu okaṭitōnokaṭi kalisi maṟiyoka padārthamaguṭa. āraṃbhamu - nūlu pōgulu kalisi vastramaguṭa. pariṇāmamanagā kāraṇapadārthamu itara sahāyamucē kāryarūpamugā māruṭa. pālu majjigasahāyamuna perugugāmāruṭa. maṭṭi kummaṟi sahāyamuna kuṃḍagāmāruṭa, vēdāṃtulu vivartamu mūḍava kāraṇamugā ceppucunnāru. okapadārthamu itarasahāyamu lēnidē iṃkoka padārthamugā kanabaḍuṭa. bhrāṃticē cīkaṭilō trāḍu pāmugākanabaḍuṭa. prapaṃcamaṃtayu brahmayē ayinanu vērugā prapaṃcamuvale kanabaḍuṭa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.