← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉత్తమ యోగం uttama yōgaṃ

Original — తెలుగు

“శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్, జ్ఞానాత్ ద్థ్హ్యానం విశిష్యతే |

ధ్యానాత్కర్మ ఫలత్యాగః త్యాగా చ్ఛాంతి రనంతరం ||“. (శ్రీమద్భగవద్గీత - 12 - 12)

“ఇదానీం సాధనాస్యాత్ర విధేః పర్యవసానతః |

సర్వకర్మఫలత్యాగమిమం స్తేతిహరిః స్వయం |

జ్ఞానార్థ శ్రవణాభ్యాసాత్ జ్ఞానం శ్రేష్టతరం భవేత్ |

నిష్పన్నే శ్రుతియుక్తిభ్యాం తతో ధ్యానం విశిష్యతే |

నిధి ధ్యాసన సంజ్ఞః యత్త త్త్వజ్ఞానైక కారణం |

తతో ప్యజ్ఞకృతం కర్మఫలత్యాగో విశిష్యతే |

ఇత్యేవం స్తూయతే తస్మాత్సహేతోస్సం శృతేః క్షయః |

తక్షణే శాంతి సొద్ధిర్నకాలాంతరమపేక్షతే |

యదా సర్వే ప్రముచ్యంతే కామాః యస్య హృదిస్థితాః |

అధమర్త్యో(అ)మృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే |

ప్రజహాతి యదా కామాన్ నిత్యా దౌ చశ్రుతౌ స్మృతే |

సర్వకామపరిత్యాగో మోక్షహేతితయా మతః |

సర్వకర్మఫలత్యాగః కామాత్యా గత్వ సామ్యతః |

స్తూయతే కేవలం యస్మాత్ ద్రోచనార్థత్వ యం స్తుతిః. || (గీతాభావప్రకాశము - 12 - 87 to 93)

(సాధనవిధిని చెప్పుట సమాప్తి చేయుచు సాధనములలో సర్వకర్మఫలత్యాగమును శ్రీకృష్ణభగవానుడు ఇచ్చటపొగుడుచున్నాడు - బ్రహ్మజ్ఞానము సంపాదించుటకు చేయు అభ్యాసయోగముకన్న ధ్యానయోగము గొప్పది. అదియే తత్వజ్ఞానమునకు కారణమైనది - నిధిధ్యాసన యనబడునది. అట్టిధ్యానముకన్న జ్ఞానములేనివాడు చేయు కర్మఫలత్యాగము - ఫలమును ఆసింపక కర్మచేయుట - నిష్కామకర్మయోగము - శ్రేష్టము - ఈ నిష్కామకర్మయోగమువలన జననమరణరూపమైన సంసారము, దాని కారణముతో కూడ నశించిపోవును - వెంటనే శాంతి సిద్ధించును - అనగా, శాంతిని పొందుటకు, మోక్షమును పొందుటకు కొంతకాలము గడవనవసరములేదు - మర్త్యశీలుడగువాడు మృత్యువులేని వాడగును. ఎందుచేతననగా అటువంటి వాని హృదయములో నున్న కామములు - కోరికలు - అన్నీ పోవుచున్నవని శ్రుతి చెప్పుచున్నది. కనుక, సమస్తమైన కోరికలు వదలివేయుట మోక్షమునకు కారణము. అందుచేత సమస్త కర్మఫలమును వదలివేయుట అన్ని కోరికలను వదలివేయుటతో సమానమే అక్షరపరబ్రహ్మ నుపాసించువారు - జ్ఞానయోగులు - భగవంతునికి ప్రియులు –

“ప్రియోహి జ్ఞానికోత్యర్థమహం”

(జ్ఞానికి నేనుమిక్కిలి ఇష్టమైనవాడను -),

“జ్ఞానీత్వాత్మైవ మేతం”

(నా అభిప్రాయ,ములో జ్ఞాని అనగా నేనే - జ్ఞాని అయినవాడు నేనే - బ్రహ్మమే).

అని చెప్పుటవలన జ్ఞాని గొప్పవాడైనను మందాధికారులను అనుగ్రహించుటకు వారు సగునబ్రహ్మోపాసన చేయువారైనను బ్రహ్మసాక్షాత్కారమును పొందెదరు - అని శ్రీకృష్ణభగవానుని నిర్దేశము).

Transliteration

“śrēyō hi jñānamabhyāsāt, jñānāt dthhyānaṃ viśiṣyatē |

dhyānātkarma phalatyāgaḥ tyāgā cchāṃti ranaṃtaraṃ ||“. (śrīmadbhagavadgīta - 12 - 12)

“idānīṃ sādhanāsyātra vidhēḥ paryavasānataḥ |

sarvakarmaphalatyāgamimaṃ stētihariḥ svayaṃ |

jñānārtha śravaṇābhyāsāt jñānaṃ śrēṣṭataraṃ bhavēt |

niṣpannē śrutiyuktibhyāṃ tatō dhyānaṃ viśiṣyatē |

nidhi dhyāsana saṃjñaḥ yatta ttvajñānaika kāraṇaṃ |

tatō pyajñakṛtaṃ karmaphalatyāgō viśiṣyatē |

ityēvaṃ stūyatē tasmātsahētōssaṃ śṛtēḥ kṣayaḥ |

takṣaṇē śāṃti soddhirnakālāṃtaramapēkṣatē |

yadā sarvē pramucyaṃtē kāmāḥ yasya hṛdisthitāḥ |

adhamartyō(a)mṛtō bhavatyatra brahma samaśnutē |

prajahāti yadā kāmān nityā dau caśrutau smṛtē |

sarvakāmaparityāgō mōkṣahētitayā mataḥ |

sarvakarmaphalatyāgaḥ kāmātyā gatva sāmyataḥ |

stūyatē kēvalaṃ yasmāt drōcanārthatva yaṃ stutiḥ. || (gītābhāvaprakāśamu - 12 - 87 to 93)

(sādhanavidhini ceppuṭa samāpti cēyucu sādhanamulalō sarvakarmaphalatyāgamunu śrīkṛṣṇabhagavānuḍu iccaṭapoguḍucunnāḍu - brahmajñānamu saṃpādiṃcuṭaku cēyu abhyāsayōgamukanna dhyānayōgamu goppadi. adiyē tatvajñānamunaku kāraṇamainadi - nidhidhyāsana yanabaḍunadi. aṭṭidhyānamukanna jñānamulēnivāḍu cēyu karmaphalatyāgamu - phalamunu āsiṃpaka karmacēyuṭa - niṣkāmakarmayōgamu - śrēṣṭamu - ī niṣkāmakarmayōgamuvalana jananamaraṇarūpamaina saṃsāramu, dāni kāraṇamutō kūḍa naśiṃcipōvunu - veṃṭanē śāṃti siddhiṃcunu - anagā, śāṃtini poṃduṭaku, mōkṣamunu poṃduṭaku koṃtakālamu gaḍavanavasaramulēdu - martyaśīluḍaguvāḍu mṛtyuvulēni vāḍagunu. eṃducētananagā aṭuvaṃṭi vāni hṛdayamulō nunna kāmamulu - kōrikalu - annī pōvucunnavani śruti ceppucunnadi. kanuka, samastamaina kōrikalu vadalivēyuṭa mōkṣamunaku kāraṇamu. aṃducēta samasta karmaphalamunu vadalivēyuṭa anni kōrikalanu vadalivēyuṭatō samānamē akṣaraparabrahma nupāsiṃcuvāru - jñānayōgulu - bhagavaṃtuniki priyulu –

“priyōhi jñānikōtyarthamahaṃ”

(jñāniki nēnumikkili iṣṭamainavāḍanu -),

“jñānītvātmaiva mētaṃ”

(nā abhiprāya,mulō jñāni anagā nēnē - jñāni ayinavāḍu nēnē - brahmamē).

ani ceppuṭavalana jñāni goppavāḍainanu maṃdādhikārulanu anugrahiṃcuṭaku vāru sagunabrahmōpāsana cēyuvārainanu brahmasākṣātkāramunu poṃdedaru - ani śrīkṛṣṇabhagavānuni nirdēśamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.