(ఉత్తముడు, పురుషుడు అయినవాడు - ఉత్తమపురుషుడు).
(కంటిలోనుండు పురుషుడు, స్వప్నమందుండు పురుషుడు, సుషుప్తిలోనుండు పురుషుడు - ఈ ముగ్గురు కంటె ఉత్తముడైన పురుషుడు).
క్షరః సర్వాణి భూతాని, కూటస్థో అక్షర ఉచ్యతే |
ఉత్తమః పురుషస్త్వస్యః పరమాత్మే త్యుదాహృతః |
యో లోకత్రయమా విశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః |
యస్మాత్ క్షరమతీతో అహ మక్షరా దపి చోత్తమః |
అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ||. (శ్రీమద్భగవద్గీత - 15 - 16 to 18)
“క్షరాక్షర పురుషా భ్యాం విలక్షణః, క్షరాక్షరోపాధి ద్వయ దోషేణ అస్పృష్టః, నిత్య శుద్ధ బుద్ధ ముక్తస్వభావః ఉత్తమః, ఉత్కృష్ట తమః పురుషః పరమాత్మా ఇతి వేదాంతేషు ఉక్తః యః లోకత్రయం భూర్భువస్వరాఖ్యం స్వకీయయా బలశక్త్యా ప్రవిశ్యభి భర్తి, ధారయతి నారాయణాఖ్యః అవ్యయః ఈశ్వరః |” (శ్రీశంకరః)
(క్షరపురుషునికన్న అక్షరపురుషునికన్న వేరు లక్షణములు కలవాడున్నూ, క్షరపురుషునియొక్క, అక్షరపురుషునియొక్క ఉపాధుల దోషములంటనివాడున్నూ, నిత్యశుద్ధుడు - (ఎల్లపుడు ఉండువాడు, నిర్మలుడు), నిత్యజ్ఞానస్వరూపుడు, నిత్యముక్తస్వరూపుడు అగుటవలన ఉత్తమ పురుషుడు - క్షరపురుషునికంటె, అక్షరపురుషునికంటె ఉత్తముడు ఉత్కృష్టుడు అయిన పురుషుడు - అతనే పరమాత్మయని ఉపనిషత్తులలో చెప్పబడినవాడు భూలోకము, భువర్లోకము, సువర్లోకము అను పేర్లుగల మూడు లోకములను తన బలశక్తితో ప్రవేశించి వాటిని ధరించువాడు, భరించువాడు. అతనే నారాయణుడనుపేరుగల అవ్యయుడైన ఈశ్వరుడు).
“క్షరాక్షర శబ్ద నిర్దిష్ట్యాభ్యాం, బుద్ధముక్త పురుషాభ్యాం అన్యః, అర్థాంతర భూతః, పరమాత్మా ఇత్యుదాహృతః. సర్వాసు శ్రుతిషు పరమాత్మా ఇతి నిర్దేశా దేవహి ఉత్తమ పురుషః బుద్ధముక్త పురుషాభ్యాం అర్థాంతర భూతః ఇత్యవ గమ్యతే. యః లోకత్రయం ఆత్మతయా అవిశ్య బి భర్తి. సః తస్మాత్ న్యాప్యాత్ భర్తవ్యాత్ చ అర్థాంతర భూతః” (శ్రీరామానుజః)
(క్షరపురుషుడు, అక్షరపురుషుడు అను పేర్లతో నిర్దేశింపబడిన బుద్ధ, ముక్త పురుషులకంటె వేరైనవాడు పరమాత్మయని అన్ని శ్రుతులలోను చెప్పబడియుండుతచేత అతనే ఉత్తమపురుషుడని తెలియబడుచున్నాడు - ఎవడు ఈ మూడులోకములను ఆత్మరూపముగా - సర్వాత్మగా, విశ్వాత్మగా, లోకాత్మగా - వ్యాపించి యుండుటవలన వాటిని భరించి - ధరించి - యుండుటవలన పురుషోత్తముడు అని చెప్పబడుచున్నాడు).
(దివ్యమైనవాడున్నూ, రూపములేనివాడున్నూ, ఉత్కృష్టమైన అక్షరుడైనవానికన్న ఉత్కృష్టమైన పురుషుడు అని ముండకోపనిషత్తులో పరమాత్మగుఱించి చెప్పబడినది).
(ఛాందోగ్యోపనిషత్ - 8 - 12 - 3)
(ఈ జీవుడు ఈ శరీరమును వదలి పరంజ్యోతి - అత్యంతోత్కృష్టమైన జ్యోతి స్వరూపమును పొంది తన స్వస్వరూపమును పొందుచున్నాడు. ఆ స్వస్వరూపమే ఉత్తమ పురుషుడు).
పురుషాన్ న పరంకించిత్ సా కాష్తా సా పరాగతిః -“. (కఠోపనిషత్)
(మహత్తత్వము కన్న ఉత్కృష్తమైనది అవ్యక్తము - ప్రకృతి, చతుర్ముఖబ్రహ్మ - నామరూపములులేక కారణావస్థలో వ్యక్తముకాకయుండు సర్వవస్తుసముదాయము - ఉత్కృష్టమైనది - అవ్యక్తముకన్న ఉత్కృష్తమైనది పరమపురుషుడు. ఆ పరమపురుషునికన్న ఉత్కృష్టమైనది లేదు - అదియే కాష్ట - అన్నింటినీ మించినది, పరమగతి, పరమపదము).
(uttamuḍu, puruṣuḍu ayinavāḍu - uttamapuruṣuḍu).
(kaṃṭilōnuṃḍu puruṣuḍu, svapnamaṃduṃḍu puruṣuḍu, suṣuptilōnuṃḍu puruṣuḍu - ī mugguru kaṃṭe uttamuḍaina puruṣuḍu).
kṣaraḥ sarvāṇi bhūtāni, kūṭasthō akṣara ucyatē |
uttamaḥ puruṣastvasyaḥ paramātmē tyudāhṛtaḥ |
yō lōkatrayamā viśya bibhartyavyaya īśvaraḥ |
yasmāt kṣaramatītō aha makṣarā dapi cōttamaḥ |
atōsmi lōkē vēdē ca prathitaḥ puruṣōttamaḥ ||. (śrīmadbhagavadgīta - 15 - 16 to 18)
“kṣarākṣara puruṣā bhyāṃ vilakṣaṇaḥ, kṣarākṣarōpādhi dvaya dōṣēṇa aspṛṣṭaḥ, nitya śuddha buddha muktasvabhāvaḥ uttamaḥ, utkṛṣṭa tamaḥ puruṣaḥ paramātmā iti vēdāṃtēṣu uktaḥ yaḥ lōkatrayaṃ bhūrbhuvasvarākhyaṃ svakīyayā balaśaktyā praviśyabhi bharti, dhārayati nārāyaṇākhyaḥ avyayaḥ īśvaraḥ |” (śrīśaṃkaraḥ)
(kṣarapuruṣunikanna akṣarapuruṣunikanna vēru lakṣaṇamulu kalavāḍunnū, kṣarapuruṣuniyokka, akṣarapuruṣuniyokka upādhula dōṣamulaṃṭanivāḍunnū, nityaśuddhuḍu - (ellapuḍu uṃḍuvāḍu, nirmaluḍu), nityajñānasvarūpuḍu, nityamuktasvarūpuḍu aguṭavalana uttama puruṣuḍu - kṣarapuruṣunikaṃṭe, akṣarapuruṣunikaṃṭe uttamuḍu utkṛṣṭuḍu ayina puruṣuḍu - atanē paramātmayani upaniṣattulalō ceppabaḍinavāḍu bhūlōkamu, bhuvarlōkamu, suvarlōkamu anu pērlugala mūḍu lōkamulanu tana balaśaktitō pravēśiṃci vāṭini dhariṃcuvāḍu, bhariṃcuvāḍu. atanē nārāyaṇuḍanupērugala avyayuḍaina īśvaruḍu).
“kṣarākṣara śabda nirdiṣṭyābhyāṃ, buddhamukta puruṣābhyāṃ anyaḥ, arthāṃtara bhūtaḥ, paramātmā ityudāhṛtaḥ. sarvāsu śrutiṣu paramātmā iti nirdēśā dēvahi uttama puruṣaḥ buddhamukta puruṣābhyāṃ arthāṃtara bhūtaḥ ityava gamyatē. yaḥ lōkatrayaṃ ātmatayā aviśya bi bharti. saḥ tasmāt nyāpyāt bhartavyāt ca arthāṃtara bhūtaḥ” (śrīrāmānujaḥ)
(kṣarapuruṣuḍu, akṣarapuruṣuḍu anu pērlatō nirdēśiṃpabaḍina buddha, mukta puruṣulakaṃṭe vērainavāḍu paramātmayani anni śrutulalōnu ceppabaḍiyuṃḍutacēta atanē uttamapuruṣuḍani teliyabaḍucunnāḍu - evaḍu ī mūḍulōkamulanu ātmarūpamugā - sarvātmagā, viśvātmagā, lōkātmagā - vyāpiṃci yuṃḍuṭavalana vāṭini bhariṃci - dhariṃci - yuṃḍuṭavalana puruṣōttamuḍu ani ceppabaḍucunnāḍu).
(divyamainavāḍunnū, rūpamulēnivāḍunnū, utkṛṣṭamaina akṣaruḍainavānikanna utkṛṣṭamaina puruṣuḍu ani muṃḍakōpaniṣattulō paramātmaguṟiṃci ceppabaḍinadi).
(chāṃdōgyōpaniṣat - 8 - 12 - 3)
(ī jīvuḍu ī śarīramunu vadali paraṃjyōti - atyaṃtōtkṛṣṭamaina jyōti svarūpamunu poṃdi tana svasvarūpamunu poṃducunnāḍu. ā svasvarūpamē uttama puruṣuḍu).
puruṣān na paraṃkiṃcit sā kāṣtā sā parāgatiḥ -“. (kaṭhōpaniṣat)
(mahattatvamu kanna utkṛṣtamainadi avyaktamu - prakṛti, caturmukhabrahma - nāmarūpamululēka kāraṇāvasthalō vyaktamukākayuṃḍu sarvavastusamudāyamu - utkṛṣṭamainadi - avyaktamukanna utkṛṣtamainadi paramapuruṣuḍu. ā paramapuruṣunikanna utkṛṣṭamainadi lēdu - adiyē kāṣṭa - anniṃṭinī miṃcinadi, paramagati, paramapadamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.