← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉత్తమయోగి uttamayōgi

Original — తెలుగు
  1. “యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా |

శ్రద్ధవాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః ||“. (శ్రీమద్భగవద్గీత - 6 - 47)

“భగవాన్ శ్రీమద్భగవద్గీతాయాం సర్వవిధేషు యోగిషు ఏ తైరుపర్యుక్తైః లక్షణైః యుక్తం యోగినమేవ సర్వోత్తమమ కధయత్. తపస్విభ్యః, శాస్త్రజ్ఞానిభ్యః సకామకర్మభ్యశ్చ యోగీ శ్రేష్టో అస్తి. పరంతు, సంపూర్ణ యోగిష్టపిసభక్తియోగీ మమమతే పరమః శ్రేష్టోస్తి, యో మయి శ్రద్ధావానస్తి. తథా మద్గతేనాంతరాత్మనా నిరంతరం మాం భజతి”.

(శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు యోగులందఱిలోను ఉత్తమ యోగి ఎవరో చెప్పియున్నారు - తాపసులకన్న, జ్ఞానులకన్న (జ్ఞానయోగులకన్న) సకామకర్మయోగులకంటె యోగి యగువాడు శ్రేష్టుడు. అట్టియోగులలోను నా యందు శ్రద్ధకలిగి, ఎల్లపుడూ నన్నే - భగవంతునే - మనస్సులో ధ్యానించు భక్తియోగి శ్రేష్టుడు - ఉత్తమయోగి).

“యోగికాం వసురుద్రాది భక్తానాం భేదచేతసాం |

సర్వేషామపి మధ్యేయో వాసుదేవో మ యీశ్వరే |

పుణ్యపుంజోదయాత్ప్రేమ్ణా నివేష్టేనాంతరాత్మనా |

ప్రాగ్భవార్జిత సంస్కార పాటివాత్సాదు సంగమాత్ |

శ్రద్ధదానః సదా భూత్వా చింత యత్వాదరాచ్చమాం |

సగుణం నిర్గుణం వాపి నారాయణ మధీశ్వరం |

అనన్య భక్త్యా పరయా సమద్భక్తో హ్యనన్యధీః |

సర్వేభ్యో యుక్త చిత్తేభ్యోః శ్రేష్టో నిత్య సమాహితః |

సర్వజ్ఞస్య మమాత్యంత నిశ్చితో నాత్ర సంశయః |

యోగాభ్యాసశ్రమే తుల్యే సమానే భజనశ్రమే |

మద్భక్తస్యైవ ముఖ్యత్వం మత్పరా ఙ్నుముఖ యోగినః ||“. (గీతాభావప్రకాశము - 6 - 246 to 252)

(వేరు వేరు మనస్తత్వములుగల వసువు, రుద్రుడు మొదలగు భగవద్బక్తులైన యోగులందఱిలోను వాసుదేవుడనైన నాయందు పూర్వ జన్మలలో చేసిన పుణ్యములవలన కలిగిన భక్తితోనిండిన మనసుతో, పూర్వజన్మలలో సంపాదించిన సంస్కార బలమువలన, సాధుసంగమువలన శ్రద్ధావంతుడై ఎల్లపుడు గొప్ప అనన్య భక్తితో, అధీశ్వరుడు, నారాయణుడు అయిన సగుణుడనికాని, నిర్గుణుడనికాని నన్ను అనన్య మనసుతో ధ్యానించువాడు, నిత్యము మనసును సమాహితము చేసుకొనినవాడు సమస్తమైన యోగులకన్న శ్రేష్టుడు - యోగి అయినను భగవంతుడనిన ఇష్టములేనివాడు. యోగాభ్యాసములో నాభక్తులతో సమానమైనవాడయినప్పటికీ నాభక్తి విషయములో అనన్య భక్తుడైన యోగి ముఖ్యుడు - యోగులందఱిలోను నాయందు అనన్య భక్తిగల యోగి శ్రేష్టుడు - ఉత్తమమైనవాడు).

  1. “ఆత్మాపమ్యేన సర్వత్ర సమంపశ్యతి యో(అ)ర్జున |

సుఖం దాయం వా దుఃఖం సయోగీ పరమో మతః ||“. (శ్రీమద్భ్గవద్గీత - 6 - 29 to 32)

“స్వదృష్టాంతేన సర్వత్ర ప్రాణిజాతే చతుర్విధే |

సుఖం వా యదివా దుఃఖం తుల్యం యః పరిపశ్యతి |

యధా మమసుఖం నిత్యమిష్టమేవం హి దేహినాం |

సర్వేషామనుకూలస్యా దితిపశ్యతి సన్మతిః |

ప్రతికూలం యధా దుఃఖం మమైవం సర్వదేహినాం |

ప్రతికూలం తథా చాయం సర్వ భూతహితేరతః |

కస్య చిన్మనసా వాచా పీడాం నాచరతీహయః |

కర్మణావా స యోగీతు సర్వోత్కృష్టతయా మతః ||“. (గీతాభావప్రకాశము - 6 - 162 to 164)

(అండజములు మొదలగు నాలుగు విధములైన ప్రాణులకు కలిగెడి సుఖముకాని, దుఃఖముకాని, తనకు కలిగెడి సుఖదుఃఖములతో సమానముగా తనకుకలిగినట్లే అని భావించు యోగి పరమయోగి, ఉత్తమయోగి - ఎల్లపుడు నాకు సుఖముకలుగుట ఇష్టము - ఈ ప్రకారముగానే అన్ని ప్రాణులకు అనికూలము అగునట్లు - ఇష్టమగునట్లు అగుగాక అనిన్నీ, నాకు ప్రతికూలమైనది నాకు ఇష్టములేనట్లుగానే ప్రాణులకు ఇష్టములేనిది అని భావించుచూ, సమస్త భూతముల హితమునే కోరుతూ తదనుకూలముగా ప్రవర్తించువాడు, ఎవనికైనను మనసులోగాని, వాక్కులోగాని, పనిలోగాని, అపకారమును చేయని యోగి పరమయోగి - ఉత్తమయోగి - అని నా అభిప్రాయము).

Transliteration
  1. “yōgināmapi sarvēṣāṃ madgatēnāṃtarātmanā |

śraddhavān bhajatē yō māṃ samē yuktatamō mataḥ ||“. (śrīmadbhagavadgīta - 6 - 47)

“bhagavān śrīmadbhagavadgītāyāṃ sarvavidhēṣu yōgiṣu ē tairuparyuktaiḥ lakṣaṇaiḥ yuktaṃ yōginamēva sarvōttamama kadhayat. tapasvibhyaḥ, śāstrajñānibhyaḥ sakāmakarmabhyaśca yōgī śrēṣṭō asti. paraṃtu, saṃpūrṇa yōgiṣṭapisabhaktiyōgī mamamatē paramaḥ śrēṣṭōsti, yō mayi śraddhāvānasti. tathā madgatēnāṃtarātmanā niraṃtaraṃ māṃ bhajati”.

(śrīmadbhagavadgītalō śrīkṛṣṇabhagavānuḍu yōgulaṃdaṟilōnu uttama yōgi evarō ceppiyunnāru - tāpasulakanna, jñānulakanna (jñānayōgulakanna) sakāmakarmayōgulakaṃṭe yōgi yaguvāḍu śrēṣṭuḍu. aṭṭiyōgulalōnu nā yaṃdu śraddhakaligi, ellapuḍū nannē - bhagavaṃtunē - manassulō dhyāniṃcu bhaktiyōgi śrēṣṭuḍu - uttamayōgi).

“yōgikāṃ vasurudrādi bhaktānāṃ bhēdacētasāṃ |

sarvēṣāmapi madhyēyō vāsudēvō ma yīśvarē |

puṇyapuṃjōdayātprēmṇā nivēṣṭēnāṃtarātmanā |

prāgbhavārjita saṃskāra pāṭivātsādu saṃgamāt |

śraddhadānaḥ sadā bhūtvā ciṃta yatvādarāccamāṃ |

saguṇaṃ nirguṇaṃ vāpi nārāyaṇa madhīśvaraṃ |

ananya bhaktyā parayā samadbhaktō hyananyadhīḥ |

sarvēbhyō yukta cittēbhyōḥ śrēṣṭō nitya samāhitaḥ |

sarvajñasya mamātyaṃta niścitō nātra saṃśayaḥ |

yōgābhyāsaśramē tulyē samānē bhajanaśramē |

madbhaktasyaiva mukhyatvaṃ matparā ṅnumukha yōginaḥ ||“. (gītābhāvaprakāśamu - 6 - 246 to 252)

(vēru vēru manastatvamulugala vasuvu, rudruḍu modalagu bhagavadbaktulaina yōgulaṃdaṟilōnu vāsudēvuḍanaina nāyaṃdu pūrva janmalalō cēsina puṇyamulavalana kaligina bhaktitōniṃḍina manasutō, pūrvajanmalalō saṃpādiṃcina saṃskāra balamuvalana, sādhusaṃgamuvalana śraddhāvaṃtuḍai ellapuḍu goppa ananya bhaktitō, adhīśvaruḍu, nārāyaṇuḍu ayina saguṇuḍanikāni, nirguṇuḍanikāni nannu ananya manasutō dhyāniṃcuvāḍu, nityamu manasunu samāhitamu cēsukoninavāḍu samastamaina yōgulakanna śrēṣṭuḍu - yōgi ayinanu bhagavaṃtuḍanina iṣṭamulēnivāḍu. yōgābhyāsamulō nābhaktulatō samānamainavāḍayinappaṭikī nābhakti viṣayamulō ananya bhaktuḍaina yōgi mukhyuḍu - yōgulaṃdaṟilōnu nāyaṃdu ananya bhaktigala yōgi śrēṣṭuḍu - uttamamainavāḍu).

  1. “ātmāpamyēna sarvatra samaṃpaśyati yō(a)rjuna |

sukhaṃ dāyaṃ vā duḥkhaṃ sayōgī paramō mataḥ ||“. (śrīmadbhgavadgīta - 6 - 29 to 32)

“svadṛṣṭāṃtēna sarvatra prāṇijātē caturvidhē |

sukhaṃ vā yadivā duḥkhaṃ tulyaṃ yaḥ paripaśyati |

yadhā mamasukhaṃ nityamiṣṭamēvaṃ hi dēhināṃ |

sarvēṣāmanukūlasyā ditipaśyati sanmatiḥ |

pratikūlaṃ yadhā duḥkhaṃ mamaivaṃ sarvadēhināṃ |

pratikūlaṃ tathā cāyaṃ sarva bhūtahitērataḥ |

kasya cinmanasā vācā pīḍāṃ nācaratīhayaḥ |

karmaṇāvā sa yōgītu sarvōtkṛṣṭatayā mataḥ ||“. (gītābhāvaprakāśamu - 6 - 162 to 164)

(aṃḍajamulu modalagu nālugu vidhamulaina prāṇulaku kaligeḍi sukhamukāni, duḥkhamukāni, tanaku kaligeḍi sukhaduḥkhamulatō samānamugā tanakukaliginaṭlē ani bhāviṃcu yōgi paramayōgi, uttamayōgi - ellapuḍu nāku sukhamukaluguṭa iṣṭamu - ī prakāramugānē anni prāṇulaku anikūlamu agunaṭlu - iṣṭamagunaṭlu agugāka aninnī, nāku pratikūlamainadi nāku iṣṭamulēnaṭlugānē prāṇulaku iṣṭamulēnidi ani bhāviṃcucū, samasta bhūtamula hitamunē kōrutū tadanukūlamugā pravartiṃcuvāḍu, evanikainanu manasulōgāni, vākkulōgāni, panilōgāni, apakāramunu cēyani yōgi paramayōgi - uttamayōgi - ani nā abhiprāyamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.