← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉత్తరమీమాంస uttaramīmāṃsa

Original — తెలుగు

వ్యాస మహర్షి వ్రాసినది - దీనిని శారీరిక సూత్రములు, లేక, బ్రహ్మ సూత్రములు అని అందురు. వేదములలోను, వేదాంతములలోను నిర్గుణ పరబ్రహ్మ గుఱించి చెప్పబడిన విషయములు పరస్పర విరోధములుగనున్న వాటి యర్థము దీనిలో స్పష్టము చేయబడినది. పరబ్రహ్మ గుఱించి సూత్రప్రాయముగ చెప్పినదగుటచేత బ్రహ్మ సూత్రములన్నియు, శరీరముగలవాడు శరీరి - జీవాత్మ, పరమాత్మ - గుఱించి చెప్పినదగుటచేత శారీరికశాస్త్రము అనికూడ చెప్పబడినది. వేదములు, ఉపనిషత్తులు సామాన్య మానవులకు అర్థమగుట కష్టమని వ్యాస మహర్షి యీ గ్రంధమును వ్రాసెను - ఈ గ్రంధముకూడ బోధపడుట కష్టముగుటచేత, దీనికి వ్యాఖ్యానములు వ్రాసిరి. అట్లు వ్రాసినవాటిలో శ్రీశంకరాచార్యులవారు, శ్రీమాన్ రామానుజాచార్యులవారు, శ్రీమధ్వాచార్యులవారు వ్రాసినవి ప్రసిద్ధము - ఈ వ్యాఖ్యానములకు కూడా వ్యాఖ్యానములున్నవి. ఇది వేదములోనున్న ‘జ్ఞానకాండ’ గుఱించి చెప్పును - వేదములోని ‘కర్మకాండ’ గుఱించి చెప్పునది పూర్వమీమాంస.

Transliteration

vyāsa maharṣi vrāsinadi - dīnini śārīrika sūtramulu, lēka, brahma sūtramulu ani aṃduru. vēdamulalōnu, vēdāṃtamulalōnu nirguṇa parabrahma guṟiṃci ceppabaḍina viṣayamulu paraspara virōdhamuluganunna vāṭi yarthamu dīnilō spaṣṭamu cēyabaḍinadi. parabrahma guṟiṃci sūtraprāyamuga ceppinadaguṭacēta brahma sūtramulanniyu, śarīramugalavāḍu śarīri - jīvātma, paramātma - guṟiṃci ceppinadaguṭacēta śārīrikaśāstramu anikūḍa ceppabaḍinadi. vēdamulu, upaniṣattulu sāmānya mānavulaku arthamaguṭa kaṣṭamani vyāsa maharṣi yī graṃdhamunu vrāsenu - ī graṃdhamukūḍa bōdhapaḍuṭa kaṣṭamuguṭacēta, dīniki vyākhyānamulu vrāsiri. aṭlu vrāsinavāṭilō śrīśaṃkarācāryulavāru, śrīmān rāmānujācāryulavāru, śrīmadhvācāryulavāru vrāsinavi prasiddhamu - ī vyākhyānamulaku kūḍā vyākhyānamulunnavi. idi vēdamulōnunna ‘jñānakāṃḍa’ guṟiṃci ceppunu - vēdamulōni ‘karmakāṃḍa’ guṟiṃci ceppunadi pūrvamīmāṃsa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.