హృదయస్థం సూక్ష్మం, అనాహత చక్రస్థం, దహర శబ్ద వాచ్యం హృదయ పుండరీకాంతర్గత ఆకాశరూపం. (హృదయములోనున్నటువంటిన్నీ, సూక్ష్మమైనటువంటిన్నీ, అనాహత చక్రములోనున్నటువంటిన్నీ దహరమనుపేరుగల హృదయమను పద్మము లోపలనున్న ఆకాశరూపము).
అంగుష్టమాత్ర పరిమితత్వాత్ అల్పం. (బొటనవ్రేలంత పరిమాణము గలది - కనుక అల్పము - చిన్నది).
ఉపాశ్యతయా సన్నిహి తస్య పరస్య బ్రహ్మణః పుర భూతస్య ఉపాసక శరీరస్య మధ్యే అవస్థితః దహరం అల్పం.
(ఉపాసనకు వీలుకలుగునట్లు దగ్గరగానున్న పరబ్రహ్మయొక్క పురము అను ఉపాసకుని శరీరమధ్యమందున్న దహరం అను పేరుగల అల్పము (చిన్నది) అయినవాడు - హృదయము చిన్నదికనుక దానిలోనున్నది కూడా అంతకంటె చిన్నవాడు పరబ్రహ్మము -” అణోరణీయాన్“. (పరమాణువు కంటె చిన్నవాడు).
(సూక్ష్మవస్తువు కంటె సూక్ష్మమైనవాడు. హృదయపద్మము చిన్నదగుటవల్ల దానిలోపలనుండువాడు దానికన్న చిన్నవాడే - ఉపాధి చిన్నది కనుక దానిలోనున్నవాడు దానికన్న చిన్నవాడు - స్వతః - యదార్ధముగా - పరమేశ్వరుడు ఆకాశమువలె పరిపూర్ణుడు - అంతటను పూర్తిగా నిండియున్నవాడు).
hṛdayasthaṃ sūkṣmaṃ, anāhata cakrasthaṃ, dahara śabda vācyaṃ hṛdaya puṃḍarīkāṃtargata ākāśarūpaṃ. (hṛdayamulōnunnaṭuvaṃṭinnī, sūkṣmamainaṭuvaṃṭinnī, anāhata cakramulōnunnaṭuvaṃṭinnī daharamanupērugala hṛdayamanu padmamu lōpalanunna ākāśarūpamu).
aṃguṣṭamātra parimitatvāt alpaṃ. (boṭanavrēlaṃta parimāṇamu galadi - kanuka alpamu - cinnadi).
upāśyatayā sannihi tasya parasya brahmaṇaḥ pura bhūtasya upāsaka śarīrasya madhyē avasthitaḥ daharaṃ alpaṃ.
(upāsanaku vīlukalugunaṭlu daggaragānunna parabrahmayokka puramu anu upāsakuni śarīramadhyamaṃdunna daharaṃ anu pērugala alpamu (cinnadi) ayinavāḍu - hṛdayamu cinnadikanuka dānilōnunnadi kūḍā aṃtakaṃṭe cinnavāḍu parabrahmamu -” aṇōraṇīyān”. (paramāṇuvu kaṃṭe cinnavāḍu).
(sūkṣmavastuvu kaṃṭe sūkṣmamainavāḍu. hṛdayapadmamu cinnadaguṭavalla dānilōpalanuṃḍuvāḍu dānikanna cinnavāḍē - upādhi cinnadi kanuka dānilōnunnavāḍu dānikanna cinnavāḍu - svataḥ - yadārdhamugā - paramēśvaruḍu ākāśamuvale paripūrṇuḍu - aṃtaṭanu pūrtigā niṃḍiyunnavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.