← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దైవాధీనం daivādhīnaṃ

Original — తెలుగు
  1. ప్రారబ్దకర్మా ధీనం.

  2. సర్వనియంత, ఈశనశాలి, ఈశ్వరుడు అయిన భగవంతుని ఆధీనంలో ఈ జగత్తు అంతా యున్నది - ప్రపంచములో నున్న వస్తువులు వాటి వాటి పనులు క్రమము తప్పక చేయుటకు కారణము వాటిలోనున్న భగవంతునిశక్తి చేత నవి ప్రేరేపింపబడుటయే. అందుచేత అన్నియు భగవంతుని అధీనములోనివే-

” దైవాధీనం జగత్సర్వం” (ఈ జగత్తు అంతయు దైవాధీనము)

  1. “బుద్ధిర్జ్జ్ఞా నమనమ్మోహః క్షమా సత్యం దమః శమః |

సుఖం దుఃఖం భవో భావో భయం చా భయమేవ చ |

అహింసాసముతో తుష్టి స్తపోదానం యశో (అ)యశః |

భవంతి భావాః భూతానాం మత్త ఏవ వృథిగ్విథాః||“. (శ్రీమద్భగవద్గీత - 10 - 4,5)

(ఈ పైన చెప్పిన బుద్ధి మొదలగు భావములు కార్యములు, కారణము గలవి, నానావిధములు. ఇవన్నియు జీవులకు భగవంతునివలననే కలుగుచున్నవి. ఇవి కలుగుటవలననే జీవులు అనేకకార్యములు చేయుచున్నారు. ఇవన్నియు ఆ జీవుల అంతరాత్మగా భగవంతుడుండి వాటిచే ఆయా పనులు చేయించుచున్నారు. వాటిలో ఆ భగవచ్చక్తి లేనియెడల ఏ వస్తువు ఏ పనియు చేయలేదు. అందుచేత జగత్తు అంతయు - దానిలోని జీవులన్నియు - దైవా ధీనమే).

Transliteration
  1. prārabdakarmā dhīnaṃ.

  2. sarvaniyaṃta, īśanaśāli, īśvaruḍu ayina bhagavaṃtuni ādhīnaṃlō ī jagattu aṃtā yunnadi - prapaṃcamulō nunna vastuvulu vāṭi vāṭi panulu kramamu tappaka cēyuṭaku kāraṇamu vāṭilōnunna bhagavaṃtuniśakti cēta navi prērēpiṃpabaḍuṭayē. aṃducēta anniyu bhagavaṃtuni adhīnamulōnivē-

” daivādhīnaṃ jagatsarvaṃ” (ī jagattu aṃtayu daivādhīnamu)

  1. “buddhirjjñā namanammōhaḥ kṣamā satyaṃ damaḥ śamaḥ |

sukhaṃ duḥkhaṃ bhavō bhāvō bhayaṃ cā bhayamēva ca |

ahiṃsāsamutō tuṣṭi stapōdānaṃ yaśō (a)yaśaḥ |

bhavaṃti bhāvāḥ bhūtānāṃ matta ēva vṛthigvithāḥ||“. (śrīmadbhagavadgīta - 10 - 4,5)

(ī paina ceppina buddhi modalagu bhāvamulu kāryamulu, kāraṇamu galavi, nānāvidhamulu. ivanniyu jīvulaku bhagavaṃtunivalananē kalugucunnavi. ivi kaluguṭavalananē jīvulu anēkakāryamulu cēyucunnāru. ivanniyu ā jīvula aṃtarātmagā bhagavaṃtuḍuṃḍi vāṭicē āyā panulu cēyiṃcucunnāru. vāṭilō ā bhagavaccakti lēniyeḍala ē vastuvu ē paniyu cēyalēdu. aṃducēta jagattu aṃtayu - dānilōni jīvulanniyu - daivā dhīnamē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.