దేవుడు, పరమాత్మ, దైవతము.
అదృష్టము, పూర్వ జన్మములందు చేసిన పుణ్య పాపముల ఫలము, ప్రారబ్దకర్మ.
దేవో భగవాన్, తత్సంబంధి సంకల్పో దైవః.
(దైవమనగా భగవంతుడు - భగవంతునికి సంబంధించిన సంకల్పము - దైవము).
డై తనర్చిన పుండరీకాక్షుడొక
కాక గణుతింప దైవమొక్క ఱుడు వేఱ
కలడెయను బుద్ధి విజ్ఞానకలితులగుచు- - -“. (శ్రీమదాంధ్రమహాభాగవతము -10 - ఉ.భా. - 1279)
వేదశాస్త్రాత్పరం నాస్తి న దైవం కేశవాత్పరం ||“.
(భుజమెత్తి ముమ్మారు ఈ సత్యమును చాటుచున్నాను - వేదముకన్న ఉత్కృష్టమైన శాస్త్రము లేదు, కేశవుడు (శ్రీమహావిష్ణువు) కంటె వేరు - ఉత్కృష్టమైన - దేవుడు లేడు).
భరతాగ్రజ ఏవ దైవతం నో భగవాన్ రాఘవ ఏవ దైవతం నః ||“. (శ్రీరామ కర్ణామృతం - 1 - 71)
(మాకు రఘునందనుడైన శ్రీరాంచంద్రుడే దైవతము. రఘువంశమందు పుట్టినవాడు, భరతునుకి అగ్రజుడు - అన్న - అయినవాడు, భగవంతుడు అయిన రాఘవుడే - శ్రీరామచంద్రుడే దైవతము).
భోగి సంతతి కన్న బోధినిష్టులు, బోధిమాన్యులకన్నను సిద్ధ విబుధ గంధర్వులు, వారికన్నను సురల్, వారికన్న
నింద్రాదిదేవతలిందఱి కన్నను దక్షాది సన్మునుల్ దలప నెక్కు
డంతకన్నను భర్గుడా య భవుకన్న
గమలభవుడెక్కు డాతని కంటె విష్ణు
డధికుడాతడు విప్రులనాదరించు
గాన విప్రుండు దైవంబు మానవులకు ”
“క. భూసురులకు సరిదైవం
బీ స చరాచరమునందు నెఱుగన్; నాకున్
భూసురులు గుడుచునప్పటి
యా సంతోషంబు దోప దగ్నులయందున్“.
వరదుడయిన హరికి ధరణిసురులు
దైవతముగాన ధారుణీ దివుజుల
కంటె దైవమొకడు గలడె భువుని“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ,భా. - 1032)
తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవతా ||“.
(ఈ జగత్తునకు సృష్టి స్తితి లయములు చేయువాడు (శ్రీమన్నారయణమూర్తి) దైవము. అందుచేత జగత్తు అతని ఆధీనములో నున్నది. అట్టి దైవము విధిప్రకారము ఉచ్చారణ చేసిన మంత్రముయొక్క ఆధీనములోనున్నది. ఆ మంత్రము సద్బ్రాహ్మణుని ఆధీనములో నున్నది. (అట్టి మంత్రములను వేదవిదులైన బ్రహ్మజ్ఞానులు తెలుసుకొనిరి). అందుచేత (అట్టి) బ్రాహ్మణుడు నాకు (భగవంతునికి) దైవము).
“ఆ. అఖిలలోకములకు హరి దైవతము సూడ
హరికి దైవతము, ధరాధినాధ
పదపరాగ లేశపంక్తిచే
త్రిలోక్యపావనంబు సేయు బ్రాహ్మణుండు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - - )
(తన కడుపులో నెలలకొలది మోసి, తాని తినిన ఆహారము ఆ గర్భస్థ శిశువునకు పంచియిచ్చి, పుట్టినతర్వాత తన పాలిచ్చి కంటికి రెప్పవలె కాచి, పెద్దచేసి, ఎప్పటికప్పుడు యోగక్షేమము నరయుచు దైవమువలె కాపాడుచుండు తల్లి కన్న దైవము వేరు లేదు - అందరిలోను దైవమున్నాడు, అందఱూ దైవరూపములే.అయినను తల్లివలె పిల్లలను పాలించుదైవము తల్లియే). -(తల్లిరూపములోనున్న దైవమే ప్రత్యక్షదైవము).
విష్ణుభక్తః స్మృతో దైవః ఆసురస్త ద్విర్యయః ||“. (ఫద్మ పురాణము)
(అస్మిన్ జగతి ద్వివిధాః జీవాః సం తి, ఏకో దైవః, అన్యశ్చాసురః. యే భగవతః భక్తాః సంతి తే దైవపదవాచ్యాః, యే భక్తాః న సంతి తే ఏవా సురాః“).
(ఈ జగత్తులో జీవులు రెండు విధములు - దైవమని, అసురులని. విష్ణు భక్తులు దైవమని చెప్పబడుచున్నారు. విష్ణుభక్తులు కానివారు అసురులని చెప్పబడుచున్నారు).
ఇతి పౌరుషుమే వాస్తి దైవమస్తు తదేవచ ||” (యోగవాశిష్టము - 6 - 1 - 2)
(పురుషుడు చేయు ప్రయత్నమును బట్టియే దాని ఫలము - అదియే పౌరుషము - పురుష ప్రయత్నము. అందుచేత పురుష ప్రయత్నమే దైవము).
ఉక్తం దైవాభిధానేన స్వర్లోక కర్మణః ఫలం ||“. (యోగవాశిష్టము - 7 - 22)
(దైవమనునది దృష్టికి గోచరము కానిది - గోచరము కాదు. ఇతర లోకములో లేదు - ఉండదు - స్వర్లోకమందు చేసిన కర్మఫలమే దైవమని చెప్పబడినది).
గరస్తా దైవనామ్నైతాః ప్రసిద్ధం సముపాగతాః ||“. (యోగవాశిష్టము - 8 - 2)
(చేసిన కర్మకు ఫలము లభించిన ఈ కర్మకీ ఫలము లభించినది అని చెప్పుట యే దైవమని ప్రసిద్ధి).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. 430)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 1120)
dēvuḍu, paramātma, daivatamu.
adṛṣṭamu, pūrva janmamulaṃdu cēsina puṇya pāpamula phalamu, prārabdakarma.
dēvō bhagavān, tatsaṃbaṃdhi saṃkalpō daivaḥ.
(daivamanagā bhagavaṃtuḍu - bhagavaṃtuniki saṃbaṃdhiṃcina saṃkalpamu - daivamu).
ḍai tanarcina puṃḍarīkākṣuḍoka
kāka gaṇutiṃpa daivamokka ṟuḍu vēṟa
kalaḍeyanu buddhi vijñānakalitulagucu- - -“. (śrīmadāṃdhramahābhāgavatamu -10 - u.bhā. - 1279)
vēdaśāstrātparaṃ nāsti na daivaṃ kēśavātparaṃ ||“.
(bhujametti mummāru ī satyamunu cāṭucunnānu - vēdamukanna utkṛṣṭamaina śāstramu lēdu, kēśavuḍu (śrīmahāviṣṇuvu) kaṃṭe vēru - utkṛṣṭamaina - dēvuḍu lēḍu).
bharatāgraja ēva daivataṃ nō bhagavān rāghava ēva daivataṃ naḥ ||“. (śrīrāma karṇāmṛtaṃ - 1 - 71)
(māku raghunaṃdanuḍaina śrīrāṃcaṃdruḍē daivatamu. raghuvaṃśamaṃdu puṭṭinavāḍu, bharatunuki agrajuḍu - anna - ayinavāḍu, bhagavaṃtuḍu ayina rāghavuḍē - śrīrāmacaṃdruḍē daivatamu).
bhōgi saṃtati kanna bōdhiniṣṭulu, bōdhimānyulakannanu siddha vibudha gaṃdharvulu, vārikannanu sural, vārikanna
niṃdrādidēvataliṃdaṟi kannanu dakṣādi sanmunul dalapa nekku
ḍaṃtakannanu bharguḍā ya bhavukanna
gamalabhavuḍekku ḍātani kaṃṭe viṣṇu
ḍadhikuḍātaḍu viprulanādariṃcu
gāna vipruṃḍu daivaṃbu mānavulaku ”
“ka. bhūsurulaku saridaivaṃ
bī sa carācaramunaṃdu neṟugan; nākun
bhūsurulu guḍucunappaṭi
yā saṃtōṣaṃbu dōpa dagnulayaṃdun”.
varaduḍayina hariki dharaṇisurulu
daivatamugāna dhāruṇī divujula
kaṃṭe daivamokaḍu galaḍe bhuvuni”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u,bhā. - 1032)
tanmaṃtraṃ brāhmaṇādhīnaṃ brāhmaṇō mama dēvatā ||“.
(ī jagattunaku sṛṣṭi stiti layamulu cēyuvāḍu (śrīmannārayaṇamūrti) daivamu. aṃducēta jagattu atani ādhīnamulō nunnadi. aṭṭi daivamu vidhiprakāramu uccāraṇa cēsina maṃtramuyokka ādhīnamulōnunnadi. ā maṃtramu sadbrāhmaṇuni ādhīnamulō nunnadi. (aṭṭi maṃtramulanu vēdavidulaina brahmajñānulu telusukoniri). aṃducēta (aṭṭi) brāhmaṇuḍu nāku (bhagavaṃtuniki) daivamu).
“ā. akhilalōkamulaku hari daivatamu sūḍa
hariki daivatamu, dharādhinādha
padaparāga lēśapaṃkticē
trilōkyapāvanaṃbu sēyu brāhmaṇuṃḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - - )
(tana kaḍupulō nelalakoladi mōsi, tāni tinina āhāramu ā garbhastha śiśuvunaku paṃciyicci, puṭṭinatarvāta tana pālicci kaṃṭiki reppavale kāci, peddacēsi, eppaṭikappuḍu yōgakṣēmamu narayucu daivamuvale kāpāḍucuṃḍu talli kanna daivamu vēru lēdu - aṃdarilōnu daivamunnāḍu, aṃdaṟū daivarūpamulē.ayinanu tallivale pillalanu pāliṃcudaivamu talliyē). -(tallirūpamulōnunna daivamē pratyakṣadaivamu).
viṣṇubhaktaḥ smṛtō daivaḥ āsurasta dviryayaḥ ||“. (phadma purāṇamu)
(asmin jagati dvividhāḥ jīvāḥ saṃ ti, ēkō daivaḥ, anyaścāsuraḥ. yē bhagavataḥ bhaktāḥ saṃti tē daivapadavācyāḥ, yē bhaktāḥ na saṃti tē ēvā surāḥ”).
(ī jagattulō jīvulu reṃḍu vidhamulu - daivamani, asurulani. viṣṇu bhaktulu daivamani ceppabaḍucunnāru. viṣṇubhaktulu kānivāru asurulani ceppabaḍucunnāru).
iti pauruṣumē vāsti daivamastu tadēvaca ||” (yōgavāśiṣṭamu - 6 - 1 - 2)
(puruṣuḍu cēyu prayatnamunu baṭṭiyē dāni phalamu - adiyē pauruṣamu - puruṣa prayatnamu. aṃducēta puruṣa prayatnamē daivamu).
uktaṃ daivābhidhānēna svarlōka karmaṇaḥ phalaṃ ||“. (yōgavāśiṣṭamu - 7 - 22)
(daivamanunadi dṛṣṭiki gōcaramu kānidi - gōcaramu kādu. itara lōkamulō lēdu - uṃḍadu - svarlōkamaṃdu cēsina karmaphalamē daivamani ceppabaḍinadi).
garastā daivanāmnaitāḥ prasiddhaṃ samupāgatāḥ ||“. (yōgavāśiṣṭamu - 8 - 2)
(cēsina karmaku phalamu labhiṃcina ī karmakī phalamu labhiṃcinadi ani ceppuṭa yē daivamani prasiddhi).
(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. 430)
(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 1120)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.