← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దైవాసుర సంపత్తి daivāsura saṃpatti

Original — తెలుగు

“ఇంద్రియ వృత్తయో దేవా అసురాశ్చ శ్రుతౌ శ్రుతాః |

శాస్తానుగాః సురాః ప్రోక్తాః స్వాభావిక్యస్తథా సురాః |

స్వాభావికస్త మో రూపా ఇంద్రియాణాం ప్రవృత్తయః |

ప్రవృత్తాః శాస్త్ర సిద్ధార్ధ ప్రకాశాభి భవా యతాః |

శాస్త్రానుగాః సురాస్తత్ర శాంతి దాంతి పురస్సరాః |

భ్రాంతి సిద్ధ ప్రవృత్తీనామా సురీణాం క్షయావహాః |

అనాదికాలమారభ్య దేవాసుర సమాగమః |

ప్రతిదేహం ప్రవృత్తో (అ)సౌ సర్వ ప్రాణిషు సంగరః |

ఏవ మేవ మునేర్భావో దర్శితోయ మధా ధునా“. (గీతాభావప్రకాశము - 1 - 121 to125)

(వేదములో ఇంద్రియవృత్తులు దేవాసుర పేరుతో చెప్పబడినవి. శాస్త్రమునననుసరించు చేయు వృత్తులు సురులు - దేవతులు. స్వభావముచేత చేయువృత్తులు అసురులు - (రాక్షసులు). స్వాభావకముగ చేయు ఇంద్రియప్రవృత్తులు తమోరూపములు. శాంతి, దాంతి మొదలగునవి శాస్త్రమునునుగమించునవి సరల ప్రవృత్తులు - భ్రాంతిసిద్ధములగు ప్రవృత్తులు ఆసర ప్రవృత్తులు - ఇవి నాశము సంపాదింపగలవు. అనాది కాలమునుండి ఈ సురప్రవృత్తికి, ఆసుర ప్రవృత్తికి సంగమమున్నది - ఇదియే దేవాసుర యుద్ధములని పురాణములలో చిత్రించబడినవి. సమస్త ప్రాణులందును ప్రతి దేహమునందును ఈ దేవాసుర యుద్ధము కలుగుచునేయున్నది).

Transliteration

“iṃdriya vṛttayō dēvā asurāśca śrutau śrutāḥ |

śāstānugāḥ surāḥ prōktāḥ svābhāvikyastathā surāḥ |

svābhāvikasta mō rūpā iṃdriyāṇāṃ pravṛttayaḥ |

pravṛttāḥ śāstra siddhārdha prakāśābhi bhavā yatāḥ |

śāstrānugāḥ surāstatra śāṃti dāṃti purassarāḥ |

bhrāṃti siddha pravṛttīnāmā surīṇāṃ kṣayāvahāḥ |

anādikālamārabhya dēvāsura samāgamaḥ |

pratidēhaṃ pravṛttō (a)sau sarva prāṇiṣu saṃgaraḥ |

ēva mēva munērbhāvō darśitōya madhā dhunā”. (gītābhāvaprakāśamu - 1 - 121 to125)

(vēdamulō iṃdriyavṛttulu dēvāsura pērutō ceppabaḍinavi. śāstramunananusariṃcu cēyu vṛttulu surulu - dēvatulu. svabhāvamucēta cēyuvṛttulu asurulu - (rākṣasulu). svābhāvakamuga cēyu iṃdriyapravṛttulu tamōrūpamulu. śāṃti, dāṃti modalagunavi śāstramununugamiṃcunavi sarala pravṛttulu - bhrāṃtisiddhamulagu pravṛttulu āsara pravṛttulu - ivi nāśamu saṃpādiṃpagalavu. anādi kālamunuṃḍi ī surapravṛttiki, āsura pravṛttiki saṃgamamunnadi - idiyē dēvāsura yuddhamulani purāṇamulalō citriṃcabaḍinavi. samasta prāṇulaṃdunu prati dēhamunaṃdunu ī dēvāsura yuddhamu kalugucunēyunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.