← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దైవయోగము daivayōgamu

Original — తెలుగు
  1. కాకతాళీయ న్యాయేన.

(కాకీ వాలింది, పండూ పండింది - రెండునూ ఒకేమాటు సంభవించుటవలన పండురాలున, పండు పండకుండిన కాకివాలినను రాలదు, పండు పండినను కాకివాలకపోతే పండు పడిపోదు -

  1. దైవవశాత్ - (దేఇవ వశమువలన).

  2. “వజ్రం తృణాయతే, రాజన్! దైవ యోగాన్న సంశయః |

తృణం వజ్రాయతే క్వాపి సమయే దైవ యోగతః ||“. (దేవీపురాణము)

(దైవయోగమువలన వజ్రము తృణప్రాయమగును - ఎందుకును పనికిరానిదగును - విలువలేనిదగును - ఒక్కొక్క సమయమందు తృణము వజ్రమువలె పనిచేయును).

  1. “మ. ఎనయన్ క్షుత్సరి పీడ గుంది శునకం బింటింటికిన్ బోవ

బూనిన దద్దైవికమైన దండహితిగానీ గాక చౌర్యాన్నమై

ననుగానీ తగబొందు చందమున నెన్నన్ దైవయోగంబు పెం

పున నీ జీవుడు దా ప్రియా ప్రియములన్ బొందున్ ద్రిలోకంబులన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - - )

Transliteration
  1. kākatāḷīya nyāyēna.

(kākī vāliṃdi, paṃḍū paṃḍiṃdi - reṃḍunū okēmāṭu saṃbhaviṃcuṭavalana paṃḍurāluna, paṃḍu paṃḍakuṃḍina kākivālinanu rāladu, paṃḍu paṃḍinanu kākivālakapōtē paṃḍu paḍipōdu -

  1. daivavaśāt - (dēiva vaśamuvalana).

  2. “vajraṃ tṛṇāyatē, rājan! daiva yōgānna saṃśayaḥ |

tṛṇaṃ vajrāyatē kvāpi samayē daiva yōgataḥ ||“. (dēvīpurāṇamu)

(daivayōgamuvalana vajramu tṛṇaprāyamagunu - eṃdukunu panikirānidagunu - viluvalēnidagunu - okkokka samayamaṃdu tṛṇamu vajramuvale panicēyunu).

  1. “ma. enayan kṣutsari pīḍa guṃdi śunakaṃ biṃṭiṃṭikin bōva

būnina daddaivikamaina daṃḍahitigānī gāka cauryānnamai

nanugānī tagaboṃdu caṃdamuna nennan daivayōgaṃbu peṃ

puna nī jīvuḍu dā priyā priyamulan boṃdun drilōkaṃbulan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - - )

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.