← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దక్షిణాయనము dakṣiṇāyanamu

Original — తెలుగు
  1. కర్కాటక సంక్రాంతి మొదలు ఆరు నెలలకాలము - ఆషాఢమాసము మొదలుకొని ఆరునెలలు ఉత్తరమునుండి దక్షిణమునకు పోవు సూర్యుని గతి.

“యత్రకాలే త్వనావృత్తిమావృత్తిన్ చైవ యోగినః |

ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ |

- - ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం |

తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగీప్రాప్య నివర్తతే |

శుక్లే కృష్ణే గతీ హ్యేతే జగతః శాస్వతేమతే |

ఏకయా యాత్యనావృత్తిం మన్య యావర్తతే పునః ||” (శ్రీమద్భగవద్గీత - 8 - 23; 25, 26)

(చూడుము :- ’ ధూమాదిమార్గము’).

  1. దక్షిణం పంథానం పితృయానశబ్దితం. ఏష పితృ యానః రయిః అన్న ప్రథానః వైషయిక భోగాత్మకః ఇతి యావతీ. యద్యపి ధూమోరాత్రః తథా కృష్ణో ” ఇత్యాది ప్రమాణ ప్రతిపన్నః పురాణేషు దల్షిణమార్గ నిర్దిష్టః దూమాదిః చంద్రాంతః పితృయానః”

(దక్షిణమార్గము అనగా పితృమార్గము. ధూమము, రాత్రి ఇవి మొదలు చంద్రునివరకు పురాణములలో చెప్పబడినవి పితృయానము - ఇదే ధూమాదిమార్గము, ధూమము మొదలగునవి గల మార్గము, ఇదే దక్షిణాయనము - చీకటిమార్గము - బ్రహ్మజ్ఞానము లేనందున జీవుడు శరీరమువిడిచిన తర్వాత చీకటి లేక అంధకారము అను అజ్ఞానమార్గమున చరించి, తిరిగి భూమిమీదకు వచ్చి జన్మను పొందును).

Transliteration
  1. karkāṭaka saṃkrāṃti modalu āru nelalakālamu - āṣāḍhamāsamu modalukoni ārunelalu uttaramunuṃḍi dakṣiṇamunaku pōvu sūryuni gati.

“yatrakālē tvanāvṛttimāvṛttin caiva yōginaḥ |

prayātā yāṃti taṃ kālaṃ vakṣyāmi bharatarṣabha |

- - dhūmō rātristathā kṛṣṇaḥ ṣaṇmāsā dakṣiṇāyanaṃ |

tatra cāṃdramasaṃ jyōtiryōgīprāpya nivartatē |

śuklē kṛṣṇē gatī hyētē jagataḥ śāsvatēmatē |

ēkayā yātyanāvṛttiṃ manya yāvartatē punaḥ ||” (śrīmadbhagavadgīta - 8 - 23; 25, 26)

(cūḍumu :- ’ dhūmādimārgamu’).

  1. dakṣiṇaṃ paṃthānaṃ pitṛyānaśabditaṃ. ēṣa pitṛ yānaḥ rayiḥ anna prathānaḥ vaiṣayika bhōgātmakaḥ iti yāvatī. yadyapi dhūmōrātraḥ tathā kṛṣṇō ” ityādi pramāṇa pratipannaḥ purāṇēṣu dalṣiṇamārga nirdiṣṭaḥ dūmādiḥ caṃdrāṃtaḥ pitṛyānaḥ”

(dakṣiṇamārgamu anagā pitṛmārgamu. dhūmamu, rātri ivi modalu caṃdrunivaraku purāṇamulalō ceppabaḍinavi pitṛyānamu - idē dhūmādimārgamu, dhūmamu modalagunavi gala mārgamu, idē dakṣiṇāyanamu - cīkaṭimārgamu - brahmajñānamu lēnaṃduna jīvuḍu śarīramuviḍicina tarvāta cīkaṭi lēka aṃdhakāramu anu ajñānamārgamuna cariṃci, tirigi bhūmimīdaku vacci janmanu poṃdunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.