(తల్లి అయిన యశోదచేత త్రాటితో నడుమునకట్టబడినవాడు)
“ఘోష ప్రఘోష శమనాయ మధోగుణేన మిధ్యేబ బంధ జననీ నవనీత చోరం |
తద్బంధనం త్రిజగతా ముదరాశ్రయాణా మాక్రోశ కారణమహాని తరాం బభూవ ||” (శ్రీకృష్ణకర్ణామృతం - 2 - 23)
(గోప వనితలు కృష్ణుని చేష్టలు తల్లికి చెప్పగా, వారిని ఓదార్చుటకు తల్లి అయిన యశోద శ్రీకృష్ణుని కవ్వపు త్రాడుతో నడుముని కట్టివేసెను - కాని, అట్లుకట్టుటవలన అతని కడుపులోనున్న మూడులోకములకు బాధకలుగచేయుటకు కారణమాయెను).
పాలున్ వెన్నయుమృచ్చిలించెనని గోపాలాంగనల్ గుయ్యిడన్
జాలిం జెందుచు దల్లి మట్టు వఱుపం జర్చించి యా బాలకున్
ఱోలం గవ్వపు ద్రాట గట్టెనట; యాక్రోశించె దత్కుక్షిలో
ద్రైలోక్యంబును; దన్మ మహామహిమ ముగ్థల్ గాంచగా నేర్తురే” (శ్రీమదాంధ్రమహాభాగవతము - - - )
(పొందబడు వాడు - తెలుసుకొనబడువాడు).
(దామములు అనగా లోకములు (లోకనామములు) - ఇవి తన కడుపులోనే ఉండుటచేత దామోదరుడు).
(talli ayina yaśōdacēta trāṭitō naḍumunakaṭṭabaḍinavāḍu)
“ghōṣa praghōṣa śamanāya madhōguṇēna midhyēba baṃdha jananī navanīta cōraṃ |
tadbaṃdhanaṃ trijagatā mudarāśrayāṇā mākrōśa kāraṇamahāni tarāṃ babhūva ||” (śrīkṛṣṇakarṇāmṛtaṃ - 2 - 23)
(gōpa vanitalu kṛṣṇuni cēṣṭalu talliki ceppagā, vārini ōdārcuṭaku talli ayina yaśōda śrīkṛṣṇuni kavvapu trāḍutō naḍumuni kaṭṭivēsenu - kāni, aṭlukaṭṭuṭavalana atani kaḍupulōnunna mūḍulōkamulaku bādhakalugacēyuṭaku kāraṇamāyenu).
pālun vennayumṛcciliṃcenani gōpālāṃganal guyyiḍan
jāliṃ jeṃducu dalli maṭṭu vaṟupaṃ jarciṃci yā bālakun
ṟōlaṃ gavvapu drāṭa gaṭṭenaṭa; yākrōśiṃce datkukṣilō
drailōkyaṃbunu; danma mahāmahima mugthal gāṃcagā nērturē” (śrīmadāṃdhramahābhāgavatamu - - - )
(poṃdabaḍu vāḍu - telusukonabaḍuvāḍu).
(dāmamulu anagā lōkamulu (lōkanāmamulu) - ivi tana kaḍupulōnē uṃḍuṭacēta dāmōdaruḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.