← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దానం dānaṃ

Original — తెలుగు
  1. ” దానం నామ న్యాయార్జిత ధనధాన్యాదేః శ్రద్ధయా అర్ధిభ్యః ప్రథానం“. (శాండిల్యోపనిషత్)

(దానమనగా న్యాయమార్గమున ఆర్జించిన ధనము ధాన్యము మొదలగువాటిని అర్థులకు (కోరినవారికి) శ్రద్ధతో ఇచ్చుట).

  1. ” న్యాయార్జిత ధనస్య పాత్రే ప్రతిపాదనం” (శ్రీమాన్ రామానుజః)

(న్యాయమార్గమున ఆర్జించిన ధనమును తగిన వారికిచ్చుట).

  1. ” యధాశక్తి సం విభాగః అన్నాదనాం” (శ్రీశంకరః)

(అన్నము మొదలగువాటిని శక్తి కొలది పంచిపెట్టుట).

  1. ద్రవ్యేషు ముక్త హస్తతా” (శ్రీశంకరః)

(ద్రవ్యమును మూట కట్టక - పిడికిటిలో పట్టియుంచక విరివిగా జారవిడుచుట).

  1. “న్యాయార్జితం ధనం శ్రాంతే శ్రద్ధయా వైదికే జసే |

అన్యద్వాయ త్ప్రదీయంతే తద్దానం ప్రోచ్యతే మయా ||” (దర్శనోపనిషత్)

(శ్రాంతుడు, వైదికమార్గవర్తియగు వానికి న్యాయమార్గమున ఆర్జించిన ధనమును శ్రద్ధగా ఇచ్చుట).

  1. ” కృతయుగే ఫలసిద్ధి రి భిహితా; త్రేతాయాం తు జ్ఞానేన ఫలసిద్ధి రుక్తా ; ద్వాపరే యజ్ఞాదినా ఫలసిద్ధిర్నిశ్చితా భవతి ; కలౌతు సర్వేషా మపి మనుజానాం దానే నైవ ఫలసిద్ధిర్భవతి“.

(కృతయుగమందు తపస్సువలన ఫలము సిద్ధించును, త్రేతాయుగములో జ్ఞానమువలన ఫలముసిద్ధించును,ద్వాపరయుగమందు యజ్ఞముమొదలగువాటివలన ఫలము సిద్ధించును. సమస్తమైన మానవులకు కలియుగమందు దానముచేతనే ఆ ఫలము సిద్ధించును).

  1. “యతీనాం ప్రణవో ధర్మో నిరాహారో వనౌకసాం |

దానమేవ గృహస్థానాం శుశ్రూషా బ్రహ్మచారిణాం || (శతపథశ్రుతి)

(యతులకు ధర్మము ప్రణవోచ్చారణ, వానప్రస్థులకు నిరాహారము, గృహస్థులకు దానము ధర్మము, బ్రహ్మచారులకు గురు శుశ్రూష ధర్మము చేయవలసిన పని).

  1. “దానమేవ పరో ధర్మో దానమేవ పరం తపః |

నదానాత్పరతర మిహలోకే పరత్రచ |

దానేన భోగానాప్నోతి దానేనా యశ్చ విందతి |

నరస్వర్గాపవేర్గచ దానే నైవ సమశ్నుతే ||“.

(దానమే పరమధర్మము, దానమే గొప్ప తపస్సు, ఈ లోకములో గాని పరలోకములో గాని దానముకన్న ఉత్కృష్టమైనది లేదు - దానము వలన భోగములు కలుగును ; దానము వలన ఆయుర్దాయము వృద్ధిపొందును. దానము వలననే స్వర్గాపవర్గములు కలుగును).

  1. “దానేన భూతాని వశీ భవంతి, దానేన వైరాణ్యుపయాంతి నాశం |

పరోపి భందుత్వ ముపైతి దానాద్దానం హి సర్వ వ్యసనాని హంతి ||“. (మహాభారత)

(దానముచేత భూతములు వశమగుచున్నవి. దానముద్వారా శత్రువులు బంధువులగుచున్నారు - దానము అన్ని వ్యసనములను నశింపచేయును).

  1. “అత ఏవ సమమ బ్రాహ్మణే దానం ద్విగుణం బ్రాహ్మణభ్రువే |

శ్రోత్రియే శతసాహస్రం పాత్రేత్వనం తమశ్నుతే ||“.

(గ్రహణసమయమందు అబ్రాహ్మణునకు చేసిన దానముకంటె బ్రాహ్మణ బ్రవునకు (భ్రష్టునకు) చేసిన దానము రెట్టింపుఫలమునిచ్చును - శ్రోత్రియునకు ఇచ్చినది వేయిరెట్లు ఫలమునిచ్చును).

  1. క. “ధాత్రిని హలికునకును సు

క్షేత్రము, బీజములు నొక్కట జేకుఱు భంగిం

జిత్రముగ దాతకీవియు

చాత్రము సమకూరునట్టి భాగ్యముగలదే“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 20 - 589)

ఆ. “కమలనాభు నెఱిగి కాలంబు దేశంబు

నెఱిగి, శుక్రుమాటలెఱిగి, నాశ

మెఱిగి, పాత్ర యనుచు నిచ్చెదానము బలి

మహివదాన్యుడొరుడు మఱియు గలడే” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 20 - 613)

  1. సీ. - - -

ఏ దానమున నాశమేతెంచు నదుయును దానంబుగాదండ్రు తత్వవిదులు

దానంబు యజ్ఞంబు, దపము గర్మంబును దా విత్తవంతుడై తలపవలయు

దన యింటిగల సర్వధనమును నైదు భాగములుగ విభజించి కామమునకు

ఆ. నర్థమునకు ధర్మయశముల కాశ్రిత

బృందములకు సమత బెట్టునట్టి

పురు షుండిందునందు బూర్ణుడై మోదించి

దన్ను మాని చేత దగవుగాదు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 19 - 580)

(ఇది శుక్రనీతి - హరిశ్చంద్రుడు, బలిచక్రవర్తి, దధీచి, శిబి చక్రవర్తి ఈ నీతిని పాటించలేదు).

  1. తే. “సర్వభూతదయా పరస్వాంతులకును

బుణ్యవర్తనులగు మిమ్ము బోటివారి

కమిత సత్కీర్తికాముల కలఘ మతుల

కియ్యరాని పదార్థంబు లెవ్వి గలవు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 10 - 355)

దానఫలము: -

  1. ” నాన్నోదక సమం దానం” (ఆకలిగొన్నవానికి అన్నము, నోరెండిపోయినవానికి నీరు దానము చేయుట కంటె గొప్ప దానములేదు).” అన్నదానాత్పరం దానం న భూతం నభవిష్యతి| నాత్రిపాత పరీక్షాస్యాత్ నకాల నియమః క్వచిత్ || (దేవీభాగవతము)

(అన్నదానము కంటె గొప్ప దానము - ఉత్కృష్టమైనదానము లేదు - ముందు ఉండదు - ఈ దానము చేసినపుడు వీడు తగినవాడా కాడా, ఇప్పుడివ్వవచ్చునా లేదా అను పరీక్ష అవసరము లేదు).

  1. క. “క్షితిదానమిచ్చు నతడును

నతికాంక్ష బరిగ్రహించు నతడును దురిత

త్యుచులై శతవత్సరములు

శతముఖ లోకమున గ్రీడసలుపుదురెలమిన్” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 20 - 616)

  1. మూర్ఖో నదదాత్యర్థం నరో దారిద్ర్య శంకయా |

ప్రాజ్ఞుడు స్తు వితరత్యర్థం నరో దారిద్ర్య శంకయా ||“. (భోజరాజ చరిత్రము)

(దానము చేసినయెడల తన ధనము తరిగిపోయి దరిద్రము ఈ జన్మలోనే వచ్చునని శంకించి మూర్ఖుడు దానము చేయడు. ప్రాజ్ణుడు ఈ జన్మలో దానము చేయని యడల ముందు జన్మలో దరిద్రమువచ్చునని శంకతో తనకున్న ధనమును దానము చేయును).

  1. “అదత్త దోషేణ భవే ద్దరిద్రః, దరిద్ర దోషేణ కరోతిపాపం |

పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్రీ పునరేవపాపి ||”

(దానము చేయకపోవుటచేత (ముందు జన్మలో) దరిద్రుడగును (పెట్టి పుట్టాలి). దరిద్రుడగుటచేతను పాపము చేయును. పాపము చేయుటవలన తప్పక నరకమును పొందును, మరల దరిద్రుడగును, మరల పాపము చేయును - ఈ రీతిగా మరల మరల జరుగుచుండును).

  1. “దానం భోగో నాశస్తి శ్రోగత యో భవంతి విత్తస్య |

యోనద దాతి, న భుంక్తే తస్య తృతీయో గతిః ||“. (భర్తృహరి)

(ధనమునకు మూడు గతులు - ధనము మూడు విధములుగ తరుగును - దానము (ఒకరికి ఇచ్చుట), భోగము (తాను అనుభవించుట), నాశించుట (దొంగతనము లేక రాజుల స్వాధీనము). దానము చేయక, తాను అనిభవించక నిలవ చేసిన ధనము నశించును -దొంగలపాలగును).

  1. “అక్షరద్వయ మభ్యస్తం నాస్తి నాస్తీతి యత్పుర |

తదిదం ” దేహి దేహేతి” విపరీత ముపస్థితం ||” (బ్రహ్మపురాణే)

(పూర్వజన్మలో ’ లేదు, లేదు’ అని ఎవరికిని ఏమియు నియ్యకపోవుట చేతనే యీ జన్మలో “దేహీ దేహీ” (ఇవ్వండి ఇవ్వండి) అని ఒకరిని యాచించుట (దరిద్రము) కలుగుచున్నది).

  1. “అదాతుః పాపవృద్ధి స్స్వాత్పాపవృద్ధే ర్దరిద్ర్రతా |

దారిద్యాత్ కురుతే పాపం పాపాత్తస్మా దధో గతిః |

గతిహీనః పునర్భూమే జాయతే రోగ సం యుతః |

భూమే జాతస్య మర్త్యస్య ధర్మహీనస్య పాపినః |

దేహాత్కష్టతరం నాస్తితస్మాత్ దోషం న కారయేత్ |

యేతైర్యుక్తో యథా దేహీ కర్మ బంధ స్వనేశ్మవత్ |

మృత్వా మత్వా పునభూమావంతో నాస్తీహ జన్మనాం |

తస్మాత్ సర్వ ప్రయత్నేన సర్వ బంధ విముక్తయే |

సర్వ దోష వినాశాయ సర్వరోగో పశాంతయే |

సర్వేషాం శ్రేయసాం కార్తాద్దాన మనుత్తమం ||” (స్కాందపురాణం)

(దానము చేయకపోవుటవలన పాపము పెరుగును, దాని వలన దరిద్రము కలుగును. దరిద్రమువలన పాపము చేయును. పాపము వలన అధోగతి చెందును (నీచ జన్మలను పొందును). అధోగతి పొందినవాడు మరల భూమిమీద రోగియై పుట్టును. ధర్మహీనుడై నీచజన్మ ఎత్తినకంటె కష్టమైనది ఉండదు. అందుచేత దోషము చేయకూడదు - అటువంటివాడు చనిపోయి తిరిగి జన్మించి, మరల చనిపోయి మరల జన్మించుచుండును - అతని జన్మలకు అంతముండదు. అందుచేత అన్నివిధములైన బంధములనుండి విడిపోవుటకు సమస్త దోషములు పోవుటకు అందఱూ ఉత్తమమైన దానము చేయవలయును).

  1. “దాతవ్యమితి యద్దానం దీయతే(అ)నుపకారిణే |

దేశేకాలేచ పాత్రేచ తద్దానం సాత్వికం స్మృతం |

యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్యవా పునః |

దీయతేచ పరిక్లిష్టం యద్దానం రాజసం స్మృతం |

అ దేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ దీయతే |

అసత్కృత మవజ్ఞాతం తత్తాను సముదా హృతం ||” (శ్రీమద్భగవద్గీత - 20; 21; 22)

(పుణ్యక్షేత్రములందు, గ్రహణసమయమందు, ఇటువంటి పుణ్యదినములందు వేదముతెలిసిన సత్పురుషులకు దానము చేయవలసినది. ఆ దినములందు, ఆ క్షేత్రములందు, అట్టి పాత్రలకు (తగినవారికి) చేసిన దానము సాత్వికదానము - తిరిగి ఉపకారము పొందవచ్చునని ఆశతో ఆ ఫలమునుకోరి (ఇష్టము లేకపోయినను) చేసిన దానము రాజసదానము, పవిత్రముకాని స్థలములందు దానమునకు తగని వారికి, విధిప్రకారముగకాక, అవమానించి చేయుదానము తామసము).

  1. అశ్రద్ధయా హుతం, దత్తం తసస్తప్తం కృతం చయత్ |

అన అనదిత్యుచేపార్ధ న చ తత్ప్రేత్యనో ఇహ ||”

(శ్రద్ధలేక చేయుదానము అనద్దానమని చెప్పబడును. అట్టిదానము ఫలముండదు).

  1. “ఆ. అన్నమైన దక్రమైన దోయంబైన

శాకమైన దనకు జరుగుకొలది

నతిధి జనుల కడ్డమాడక యిడరేని

లేమ ! వారు కలిగి లేనివారు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 16 - 464)

Transliteration
  1. ” dānaṃ nāma nyāyārjita dhanadhānyādēḥ śraddhayā ardhibhyaḥ prathānaṃ”. (śāṃḍilyōpaniṣat)

(dānamanagā nyāyamārgamuna ārjiṃcina dhanamu dhānyamu modalaguvāṭini arthulaku (kōrinavāriki) śraddhatō iccuṭa).

  1. ” nyāyārjita dhanasya pātrē pratipādanaṃ” (śrīmān rāmānujaḥ)

(nyāyamārgamuna ārjiṃcina dhanamunu tagina vārikiccuṭa).

  1. ” yadhāśakti saṃ vibhāgaḥ annādanāṃ” (śrīśaṃkaraḥ)

(annamu modalaguvāṭini śakti koladi paṃcipeṭṭuṭa).

  1. dravyēṣu mukta hastatā” (śrīśaṃkaraḥ)

(dravyamunu mūṭa kaṭṭaka - piḍikiṭilō paṭṭiyuṃcaka virivigā jāraviḍucuṭa).

  1. “nyāyārjitaṃ dhanaṃ śrāṃtē śraddhayā vaidikē jasē |

anyadvāya tpradīyaṃtē taddānaṃ prōcyatē mayā ||” (darśanōpaniṣat)

(śrāṃtuḍu, vaidikamārgavartiyagu vāniki nyāyamārgamuna ārjiṃcina dhanamunu śraddhagā iccuṭa).

  1. ” kṛtayugē phalasiddhi ri bhihitā; trētāyāṃ tu jñānēna phalasiddhi ruktā ; dvāparē yajñādinā phalasiddhirniścitā bhavati ; kalautu sarvēṣā mapi manujānāṃ dānē naiva phalasiddhirbhavati”.

(kṛtayugamaṃdu tapassuvalana phalamu siddhiṃcunu, trētāyugamulō jñānamuvalana phalamusiddhiṃcunu,dvāparayugamaṃdu yajñamumodalaguvāṭivalana phalamu siddhiṃcunu. samastamaina mānavulaku kaliyugamaṃdu dānamucētanē ā phalamu siddhiṃcunu).

  1. “yatīnāṃ praṇavō dharmō nirāhārō vanaukasāṃ |

dānamēva gṛhasthānāṃ śuśrūṣā brahmacāriṇāṃ || (śatapathaśruti)

(yatulaku dharmamu praṇavōccāraṇa, vānaprasthulaku nirāhāramu, gṛhasthulaku dānamu dharmamu, brahmacārulaku guru śuśrūṣa dharmamu cēyavalasina pani).

  1. “dānamēva parō dharmō dānamēva paraṃ tapaḥ |

nadānātparatara mihalōkē paratraca |

dānēna bhōgānāpnōti dānēnā yaśca viṃdati |

narasvargāpavērgaca dānē naiva samaśnutē ||“.

(dānamē paramadharmamu, dānamē goppa tapassu, ī lōkamulō gāni paralōkamulō gāni dānamukanna utkṛṣṭamainadi lēdu - dānamu valana bhōgamulu kalugunu ; dānamu valana āyurdāyamu vṛddhipoṃdunu. dānamu valananē svargāpavargamulu kalugunu).

  1. “dānēna bhūtāni vaśī bhavaṃti, dānēna vairāṇyupayāṃti nāśaṃ |

parōpi bhaṃdutva mupaiti dānāddānaṃ hi sarva vyasanāni haṃti ||“. (mahābhārata)

(dānamucēta bhūtamulu vaśamagucunnavi. dānamudvārā śatruvulu baṃdhuvulagucunnāru - dānamu anni vyasanamulanu naśiṃpacēyunu).

  1. “ata ēva samama brāhmaṇē dānaṃ dviguṇaṃ brāhmaṇabhruvē |

śrōtriyē śatasāhasraṃ pātrētvanaṃ tamaśnutē ||“.

(grahaṇasamayamaṃdu abrāhmaṇunaku cēsina dānamukaṃṭe brāhmaṇa bravunaku (bhraṣṭunaku) cēsina dānamu reṭṭiṃpuphalamuniccunu - śrōtriyunaku iccinadi vēyireṭlu phalamuniccunu).

  1. ka. “dhātrini halikunakunu su

kṣētramu, bījamulu nokkaṭa jēkuṟu bhaṃgiṃ

jitramuga dātakīviyu

cātramu samakūrunaṭṭi bhāgyamugaladē”. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 20 - 589)

ā. “kamalanābhu neṟigi kālaṃbu dēśaṃbu

neṟigi, śukrumāṭaleṟigi, nāśa

meṟigi, pātra yanucu niccedānamu bali

mahivadānyuḍoruḍu maṟiyu galaḍē” (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 20 - 613)

  1. sī. - - -

ē dānamuna nāśamēteṃcu naduyunu dānaṃbugādaṃḍru tatvavidulu

dānaṃbu yajñaṃbu, dapamu garmaṃbunu dā vittavaṃtuḍai talapavalayu

dana yiṃṭigala sarvadhanamunu naidu bhāgamuluga vibhajiṃci kāmamunaku

ā. narthamunaku dharmayaśamula kāśrita

bṛṃdamulaku samata beṭṭunaṭṭi

puru ṣuṃḍiṃdunaṃdu būrṇuḍai mōdiṃci

dannu māni cēta dagavugādu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 19 - 580)

(idi śukranīti - hariścaṃdruḍu, balicakravarti, dadhīci, śibi cakravarti ī nītini pāṭiṃcalēdu).

  1. tē. “sarvabhūtadayā parasvāṃtulakunu

buṇyavartanulagu mimmu bōṭivāri

kamita satkīrtikāmula kalagha matula

kiyyarāni padārthaṃbu levvi galavu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 10 - 355)

dānaphalamu: -

  1. ” nānnōdaka samaṃ dānaṃ” (ākaligonnavāniki annamu, nōreṃḍipōyinavāniki nīru dānamu cēyuṭa kaṃṭe goppa dānamulēdu).” annadānātparaṃ dānaṃ na bhūtaṃ nabhaviṣyati| nātripāta parīkṣāsyāt nakāla niyamaḥ kvacit || (dēvībhāgavatamu)

(annadānamu kaṃṭe goppa dānamu - utkṛṣṭamainadānamu lēdu - muṃdu uṃḍadu - ī dānamu cēsinapuḍu vīḍu taginavāḍā kāḍā, ippuḍivvavaccunā lēdā anu parīkṣa avasaramu lēdu).

  1. ka. “kṣitidānamiccu nataḍunu

natikāṃkṣa barigrahiṃcu nataḍunu durita

tyuculai śatavatsaramulu

śatamukha lōkamuna grīḍasalupudurelamin” (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 20 - 616)

  1. mūrkhō nadadātyarthaṃ narō dāridrya śaṃkayā |

prājñuḍu stu vitaratyarthaṃ narō dāridrya śaṃkayā ||“. (bhōjarāja caritramu)

(dānamu cēsinayeḍala tana dhanamu tarigipōyi daridramu ī janmalōnē vaccunani śaṃkiṃci mūrkhuḍu dānamu cēyaḍu. prājṇuḍu ī janmalō dānamu cēyani yaḍala muṃdu janmalō daridramuvaccunani śaṃkatō tanakunna dhanamunu dānamu cēyunu).

  1. “adatta dōṣēṇa bhavē ddaridraḥ, daridra dōṣēṇa karōtipāpaṃ |

pāpādavaśyaṃ narakaṃ prayāti punardaridrī punarēvapāpi ||”

(dānamu cēyakapōvuṭacēta (muṃdu janmalō) daridruḍagunu (peṭṭi puṭṭāli). daridruḍaguṭacētanu pāpamu cēyunu. pāpamu cēyuṭavalana tappaka narakamunu poṃdunu, marala daridruḍagunu, marala pāpamu cēyunu - ī rītigā marala marala jarugucuṃḍunu).

  1. “dānaṃ bhōgō nāśasti śrōgata yō bhavaṃti vittasya |

yōnada dāti, na bhuṃktē tasya tṛtīyō gatiḥ ||“. (bhartṛhari)

(dhanamunaku mūḍu gatulu - dhanamu mūḍu vidhamuluga tarugunu - dānamu (okariki iccuṭa), bhōgamu (tānu anubhaviṃcuṭa), nāśiṃcuṭa (doṃgatanamu lēka rājula svādhīnamu). dānamu cēyaka, tānu anibhaviṃcaka nilava cēsina dhanamu naśiṃcunu -doṃgalapālagunu).

  1. “akṣaradvaya mabhyastaṃ nāsti nāstīti yatpura |

tadidaṃ ” dēhi dēhēti” viparīta mupasthitaṃ ||” (brahmapurāṇē)

(pūrvajanmalō ’ lēdu, lēdu’ ani evarikini ēmiyu niyyakapōvuṭa cētanē yī janmalō “dēhī dēhī” (ivvaṃḍi ivvaṃḍi) ani okarini yāciṃcuṭa (daridramu) kalugucunnadi).

  1. “adātuḥ pāpavṛddhi ssvātpāpavṛddhē rdaridrratā |

dāridyāt kurutē pāpaṃ pāpāttasmā dadhō gatiḥ |

gatihīnaḥ punarbhūmē jāyatē rōga saṃ yutaḥ |

bhūmē jātasya martyasya dharmahīnasya pāpinaḥ |

dēhātkaṣṭataraṃ nāstitasmāt dōṣaṃ na kārayēt |

yētairyuktō yathā dēhī karma baṃdha svanēśmavat |

mṛtvā matvā punabhūmāvaṃtō nāstīha janmanāṃ |

tasmāt sarva prayatnēna sarva baṃdha vimuktayē |

sarva dōṣa vināśāya sarvarōgō paśāṃtayē |

sarvēṣāṃ śrēyasāṃ kārtāddāna manuttamaṃ ||” (skāṃdapurāṇaṃ)

(dānamu cēyakapōvuṭavalana pāpamu perugunu, dāni valana daridramu kalugunu. daridramuvalana pāpamu cēyunu. pāpamu valana adhōgati ceṃdunu (nīca janmalanu poṃdunu). adhōgati poṃdinavāḍu marala bhūmimīda rōgiyai puṭṭunu. dharmahīnuḍai nīcajanma ettinakaṃṭe kaṣṭamainadi uṃḍadu. aṃducēta dōṣamu cēyakūḍadu - aṭuvaṃṭivāḍu canipōyi tirigi janmiṃci, marala canipōyi marala janmiṃcucuṃḍunu - atani janmalaku aṃtamuṃḍadu. aṃducēta annividhamulaina baṃdhamulanuṃḍi viḍipōvuṭaku samasta dōṣamulu pōvuṭaku aṃdaṟū uttamamaina dānamu cēyavalayunu).

  1. “dātavyamiti yaddānaṃ dīyatē(a)nupakāriṇē |

dēśēkālēca pātrēca taddānaṃ sātvikaṃ smṛtaṃ |

yattu pratyupakārārthaṃ phalamuddiśyavā punaḥ |

dīyatēca parikliṣṭaṃ yaddānaṃ rājasaṃ smṛtaṃ |

a dēśakālē yaddānamapātrēbhyaśca dīyatē |

asatkṛta mavajñātaṃ tattānu samudā hṛtaṃ ||” (śrīmadbhagavadgīta - 20; 21; 22)

(puṇyakṣētramulaṃdu, grahaṇasamayamaṃdu, iṭuvaṃṭi puṇyadinamulaṃdu vēdamutelisina satpuruṣulaku dānamu cēyavalasinadi. ā dinamulaṃdu, ā kṣētramulaṃdu, aṭṭi pātralaku (taginavāriki) cēsina dānamu sātvikadānamu - tirigi upakāramu poṃdavaccunani āśatō ā phalamunukōri (iṣṭamu lēkapōyinanu) cēsina dānamu rājasadānamu, pavitramukāni sthalamulaṃdu dānamunaku tagani vāriki, vidhiprakāramugakāka, avamāniṃci cēyudānamu tāmasamu).

  1. aśraddhayā hutaṃ, dattaṃ tasastaptaṃ kṛtaṃ cayat |

ana anadityucēpārdha na ca tatprētyanō iha ||”

(śraddhalēka cēyudānamu anaddānamani ceppabaḍunu. aṭṭidānamu phalamuṃḍadu).

  1. “ā. annamaina dakramaina dōyaṃbaina

śākamaina danaku jarugukoladi

natidhi janula kaḍḍamāḍaka yiḍarēni

lēma ! vāru kaligi lēnivāru” (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 16 - 464)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.