← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దానపాత్రత dānapātrata

Original — తెలుగు
  1. శ్రోత్రియాయ దరిద్రాయ చార్థినేచ విశేషతః |

యద్దానం దీయతే తస్మై తద్దానం శుభాకారణం || (మత్స్యపురాణం)

(శ్రోత్రియుడైన బ్రహ్మణునకుగాని, దరిద్రునకుగాని, విశేషించి యడిగిన వానికి గాని (యాచకునకుగాని) ఇచ్చిన దానము శుభఫలమును కలుగచేయును).

  1. “క్షాంతిః, స్పృహాదయా సత్యం దానశీలం తపశ్శృతం |

ఏ తదష్టాంగ ముద్దిష్టం పరమం పాత్ర లక్షణం ||“. (భవిష్యోత్తరపురాణం)

(దానమునకు తగినవాని (పాత్రుని) లక్షణములు ఎనిమిది - క్షాంతి, స్పృహ, దయ, సత్యము, దానశీలము, తపస్సు, శ్రుతము).

  1. “నవిద్యయా కేవలయా తపసా వాపి పాత్రతా |

యత్ర వృత్తం భవేత్ శ్రేష్టం తద్ధి పాత్రం ప్రకీర్తితం ||“. (భవిష్యోత్తరపరాణము)

(కేవలము విద్య వలనగాని తపస్సు వలనగాని దానమునకు పాత్రుడుకాడు - తగినవాడుకాడు. ఎవనియందు ఇవి హెచ్చుగానుండునో - శ్రేష్టముగానుండునో - అట్టివాడే దానమునకు పాత్రుడు).

  1. “సమమ బ్రాహ్మణే దానం ద్విగుణం బ్రాహ్మణబ్రువే |

శ్రోత్రియే శతసాహస్రం అనంతం వేద పారిగే |

శ్రోత్రియే చైవ సాహస్రం ఆచార్యే ద్విగుణం తతః |

ఆత్మజ్ఞే శతసాహస్రం అనంతం చాగ్ని హోత్రిణే ||“.

(బ్రాహ్మణుడు కానివానికి చేసినదానము సమము, బ్రాహ్మణబ్రువునకు - బ్రాహ్మణజాతిలో పుట్టినవానికి చేయుదాన ఫలము దానికంటె రెండురెట్లు అధికము - శ్రోత్రియుడైన బ్రాహ్మణునకు చేసిన దానఫలము శతసహస్రాధికము. వేదమును తుదిముట్టనెఱిగిన వానికి చేసినదానఫలము దానికన్న వేయిరెట్లధికము - గురువునకు చేయుదానము దానికన్న రెండురెట్లధికము - బ్రహ్మజ్ఞానము కలిగిన వానికి చేయు దానము యొక్కఫలము నూరువేలరెట్లు అధికము - నిత్యాగ్నిహోత్రికి చేయు దానఫలము ఇంత అని చెప్పుటకు అలవికానిది).

  1. “ఏకం వేదాంతగం విప్రం భోజయేత్ శ్రద్ధయాన్వితః |

తసూ భుక్త్యా భవత్ కోటిర్విప్రాణం నాత్రసంశయః ||“.

(వేదాంతపారగుడైన - వేదాంతమును మొదటినుండి చివరవరకు చదివినవానికి - ఒక్కనికైనను శ్రద్దతో భోజనము పెట్టినయెడల కోటిబ్రాహ్మణులకు భోజనము పెట్టినంత ఫలము కలుగును. దీనిని గుఱించి సంశయములేదు).

  1. “గోరక్షకాన్, వాణిజాన్ తథా దుశ్శీలినశ్చఠాన్ |

ప్రేప్యాన్ వాగ్దుషికాం శ్చైవ విప్రాన్ శూద్రవదాచరేత్ |

భస్మనీవ హుతం హవ్యం తథాభవతి నిష్ఫలం |

జపేన రహితే విప్రే తథావానం నిరర్థకం |

నష్టం దేవకే దత్తం ప్రణష్టం చైవ వార్దుషి |

యచ్చవాణి జకే దత్తం నచతత్ప్రేత్యనో ఇహ |

నా బ్రాహ్మణాయ దాతవ్యం న దేయం బ్రాహ్మణ బ్రువే |

నబ్రాహ్మణక్రియే చైవ న చ దుర్బ్రాహ్మణే ధనం ||“.

(గోరక్షకులను, వణిజులను, దుష్టస్వభావముగలవారిని, శఠులను, కఠోరమైన మాటలు గలవారలను దానము విషయములో శూద్రులవలె పరిగ్రహించవలెను. జపము చేయని బ్రాహ్మణునికి అగ్నిలో వేచినదానివలె ఫలించదు - బ్రాహ్మణుడుకానివానికి, జన్మ మాత్రముచేత బ్రాహ్మణుడైనవానికి, దుర్మార్గుడైన బ్రాహ్మణునికి ధనము దానము చేయరాదు).

  1. ఆమపాత్రే రణే యద్వన్ నశ్యతే సహ భాజనం |

అపాత్రే తథా దత్తం సహ పాత్రేణ నశ్యతి |

గురోశ్చా ప్రీతిజనకే కృతఘ్నే గ్రామయాచకే |

వేద విక్రయికే చైవ యస్య బోపవతిర్గృహే |

స్త్రీ భిర్జుతేషు యద్దత్తం వ్యాళగ్రాహే తధైవచ |

బ్రహ్మబంధే చ యద్దత్తం యద్దత్తం వృషలీవతే |

కింకరేషు యద్దత్తం వృధా దానాని షోడశ |

బీజంచ తుష్పదే పక్వం వాసితం నిష్ఫలం భవేత్ |

దానం తద్వద పాత్రేషు విన్యస్తం నిష్ఫలం భవేత్ ||”

పాత్రుడు కానివానికి (దానమునకు తగనివానికి) చేసినదానము పాత్రునితో సహా నశించును - పతితుడు, బ్రాహ్మణుడుకానివాడు, దొంగ, గురువునకు కోపము తెప్పించినవాడు. కృతఘ్నుడు, గ్రామయాచకుడు, వేదమును విక్రయించువాడును - ధనము పుచ్చుకొని వేదము చెప్పువాడు - స్త్రీలచే జయింపబడినవాడు - స్త్రీలకు లొంగియుండువాడు - బ్రహ్మ బంధువు, కింకరుడు, వృషలీపతి - ఇట్టి వారికి ఇచ్చినదానము నిష్ఫలము - వీరు అపాత్రులు గనుక).

  1. “వ. చరాచరంబైన విశ్వమంతయు విష్ణుమయంబగుటం జేసి పాత్ర నిర్ణయ నిపుణులైన విద్వాంసులు నారాయణుండుముఖ్యపాత్రంబని పలుకుదురు. అనేక జంతు సంఘాత సంకీర్ణంబైన బ్రహ్మాండపాదప్నంబునకు నారాయణుండు మూలంబు. తన్నిమిత్తంబు నారాయణ సంతర్పణంబు సకల జంతు సంతర్పణంబని యెఱుంగుము - ఋషి, నర, తిర్యగమర శరీరంబులు పురంబులు. వానియందు తారతమ్యంబులతోడ జీవరూపంబున భగవతుండైన హరివర్తించుటం జేసి పురుషుండప్రసిద్ధుండయ్యె. అందు తర్యగాదులకంటె నధికత్వంబు పురుషునియందు విలసిల్లుటంజేసి పురుషుడు పాత్రంబు. పురుషులలోన హరి తనువైన వేదంబును ధరించుచు సంతోషవిద్యాతపో గరిష్టుండైన బ్రాహ్మణుండు పాత్రంబు. బ్రాహ్మణులలోన ఆత్మ జ్ఞానపరిపూర్ణుండైన యోగి ముఖ్యపాత్రంబని పలుకుదురు. పరస్పరపాత్రంబులకు సహింపని మనుష్యులకు బూజనార్ధంబు ద్రేతాయుగంబునందు హరిప్రతిమలు గల్పింపబడియె. కొందఱు ప్రతిమార్చనంబు సేయుదురు - - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 14 - 453)
Transliteration
  1. śrōtriyāya daridrāya cārthinēca viśēṣataḥ |

yaddānaṃ dīyatē tasmai taddānaṃ śubhākāraṇaṃ || (matsyapurāṇaṃ)

(śrōtriyuḍaina brahmaṇunakugāni, daridrunakugāni, viśēṣiṃci yaḍigina vāniki gāni (yācakunakugāni) iccina dānamu śubhaphalamunu kalugacēyunu).

  1. “kṣāṃtiḥ, spṛhādayā satyaṃ dānaśīlaṃ tapaśśṛtaṃ |

ē tadaṣṭāṃga muddiṣṭaṃ paramaṃ pātra lakṣaṇaṃ ||“. (bhaviṣyōttarapurāṇaṃ)

(dānamunaku taginavāni (pātruni) lakṣaṇamulu enimidi - kṣāṃti, spṛha, daya, satyamu, dānaśīlamu, tapassu, śrutamu).

  1. “navidyayā kēvalayā tapasā vāpi pātratā |

yatra vṛttaṃ bhavēt śrēṣṭaṃ taddhi pātraṃ prakīrtitaṃ ||“. (bhaviṣyōttaraparāṇamu)

(kēvalamu vidya valanagāni tapassu valanagāni dānamunaku pātruḍukāḍu - taginavāḍukāḍu. evaniyaṃdu ivi heccugānuṃḍunō - śrēṣṭamugānuṃḍunō - aṭṭivāḍē dānamunaku pātruḍu).

  1. “samama brāhmaṇē dānaṃ dviguṇaṃ brāhmaṇabruvē |

śrōtriyē śatasāhasraṃ anaṃtaṃ vēda pārigē |

śrōtriyē caiva sāhasraṃ ācāryē dviguṇaṃ tataḥ |

ātmajñē śatasāhasraṃ anaṃtaṃ cāgni hōtriṇē ||“.

(brāhmaṇuḍu kānivāniki cēsinadānamu samamu, brāhmaṇabruvunaku - brāhmaṇajātilō puṭṭinavāniki cēyudāna phalamu dānikaṃṭe reṃḍureṭlu adhikamu - śrōtriyuḍaina brāhmaṇunaku cēsina dānaphalamu śatasahasrādhikamu. vēdamunu tudimuṭṭaneṟigina vāniki cēsinadānaphalamu dānikanna vēyireṭladhikamu - guruvunaku cēyudānamu dānikanna reṃḍureṭladhikamu - brahmajñānamu kaligina vāniki cēyu dānamu yokkaphalamu nūruvēlareṭlu adhikamu - nityāgnihōtriki cēyu dānaphalamu iṃta ani ceppuṭaku alavikānidi).

  1. “ēkaṃ vēdāṃtagaṃ vipraṃ bhōjayēt śraddhayānvitaḥ |

tasū bhuktyā bhavat kōṭirviprāṇaṃ nātrasaṃśayaḥ ||“.

(vēdāṃtapāraguḍaina - vēdāṃtamunu modaṭinuṃḍi civaravaraku cadivinavāniki - okkanikainanu śraddatō bhōjanamu peṭṭinayeḍala kōṭibrāhmaṇulaku bhōjanamu peṭṭinaṃta phalamu kalugunu. dīnini guṟiṃci saṃśayamulēdu).

  1. “gōrakṣakān, vāṇijān tathā duśśīlinaścaṭhān |

prēpyān vāgduṣikāṃ ścaiva viprān śūdravadācarēt |

bhasmanīva hutaṃ havyaṃ tathābhavati niṣphalaṃ |

japēna rahitē viprē tathāvānaṃ nirarthakaṃ |

naṣṭaṃ dēvakē dattaṃ praṇaṣṭaṃ caiva vārduṣi |

yaccavāṇi jakē dattaṃ nacatatprētyanō iha |

nā brāhmaṇāya dātavyaṃ na dēyaṃ brāhmaṇa bruvē |

nabrāhmaṇakriyē caiva na ca durbrāhmaṇē dhanaṃ ||“.

(gōrakṣakulanu, vaṇijulanu, duṣṭasvabhāvamugalavārini, śaṭhulanu, kaṭhōramaina māṭalu galavāralanu dānamu viṣayamulō śūdrulavale parigrahiṃcavalenu. japamu cēyani brāhmaṇuniki agnilō vēcinadānivale phaliṃcadu - brāhmaṇuḍukānivāniki, janma mātramucēta brāhmaṇuḍainavāniki, durmārguḍaina brāhmaṇuniki dhanamu dānamu cēyarādu).

  1. āmapātrē raṇē yadvan naśyatē saha bhājanaṃ |

apātrē tathā dattaṃ saha pātrēṇa naśyati |

gurōścā prītijanakē kṛtaghnē grāmayācakē |

vēda vikrayikē caiva yasya bōpavatirgṛhē |

strī bhirjutēṣu yaddattaṃ vyāḷagrāhē tadhaivaca |

brahmabaṃdhē ca yaddattaṃ yaddattaṃ vṛṣalīvatē |

kiṃkarēṣu yaddattaṃ vṛdhā dānāni ṣōḍaśa |

bījaṃca tuṣpadē pakvaṃ vāsitaṃ niṣphalaṃ bhavēt |

dānaṃ tadvada pātrēṣu vinyastaṃ niṣphalaṃ bhavēt ||”

pātruḍu kānivāniki (dānamunaku taganivāniki) cēsinadānamu pātrunitō sahā naśiṃcunu - patituḍu, brāhmaṇuḍukānivāḍu, doṃga, guruvunaku kōpamu teppiṃcinavāḍu. kṛtaghnuḍu, grāmayācakuḍu, vēdamunu vikrayiṃcuvāḍunu - dhanamu puccukoni vēdamu ceppuvāḍu - strīlacē jayiṃpabaḍinavāḍu - strīlaku loṃgiyuṃḍuvāḍu - brahma baṃdhuvu, kiṃkaruḍu, vṛṣalīpati - iṭṭi vāriki iccinadānamu niṣphalamu - vīru apātrulu ganuka).

  1. “va. carācaraṃbaina viśvamaṃtayu viṣṇumayaṃbaguṭaṃ jēsi pātra nirṇaya nipuṇulaina vidvāṃsulu nārāyaṇuṃḍumukhyapātraṃbani palukuduru. anēka jaṃtu saṃghāta saṃkīrṇaṃbaina brahmāṃḍapādapnaṃbunaku nārāyaṇuṃḍu mūlaṃbu. tannimittaṃbu nārāyaṇa saṃtarpaṇaṃbu sakala jaṃtu saṃtarpaṇaṃbani yeṟuṃgumu - ṛṣi, nara, tiryagamara śarīraṃbulu puraṃbulu. vāniyaṃdu tāratamyaṃbulatōḍa jīvarūpaṃbuna bhagavatuṃḍaina harivartiṃcuṭaṃ jēsi puruṣuṃḍaprasiddhuṃḍayye. aṃdu taryagādulakaṃṭe nadhikatvaṃbu puruṣuniyaṃdu vilasilluṭaṃjēsi puruṣuḍu pātraṃbu. puruṣulalōna hari tanuvaina vēdaṃbunu dhariṃcucu saṃtōṣavidyātapō gariṣṭuṃḍaina brāhmaṇuṃḍu pātraṃbu. brāhmaṇulalōna ātma jñānaparipūrṇuṃḍaina yōgi mukhyapātraṃbani palukuduru. parasparapātraṃbulaku sahiṃpani manuṣyulaku būjanārdhaṃbu drētāyugaṃbunaṃdu haripratimalu galpiṃpabaḍiye. koṃdaṟu pratimārcanaṃbu sēyuduru - - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 14 - 453)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.