← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దానఫలము dānaphalamu

Original — తెలుగు

“వస్తుదానేన వస్తూనాం సమం పుణ్యం దినే దినే |

దినభేదే కోటిగుణం అసంఖ్యం వాధికం తథా |

సమేదేశేచ వస్తూనాం దానే పుణ్యం సమం సుర |

దేశ భేదే కోటిగుణం అసంఖ్యం వా తతోధికం |

యథాఫలంతి నస్యానిన్యూనాన్యపృధి కానిచ |

కర్షకాణాం క్షేత్రభేదే పాత్రభేదే ఫలం తథా |

సామాన్య దివసే విప్రదానం సమఫలం భవేత్ |

అమాయాం రవి సంక్రాంత్యాం ఫలం శతగుణం భవేత్ |

చాతుర్మాస్యాం పౌర్ణమాస్యాం అనంతం ఫలమేవ చ |

గ్రహణే శిశినః కోటిగుణంచ ఫలమేవ చ |

సూర్యగ్రహణేవాపి తతో దశగుణం భవేత్ |

అక్షయాయాం అక్షయం తద సంఖ్యం ఫలముచ్యతే |

ఏవ మన్యత్ర పుణ్యాహ్నే ఫలాదిక్యం చ భవేదితి |

యదా దానే తథా స్నానే, జపే, అన్య పుణ్య కర్మను |

ఏవం సర్వత్ర బోద్ధవ్యం నరాణాం కర్మణాం ఫలం ||“. (దేవీ భాగవతము)

(రోజు రోజు చేయు వస్తుదానమువలన కలుగు పుణ్యము సమముగానుండును. దినములో బేధముండుటచేత ప్రతిదినము చేయు దానఫలముకన్న కొన్ని దినములలో చేయుదానము ఫలము కోటిరెట్లు హెచ్చు - సమమైన దేశమందు చేసిన దానము సమముగానుండును. దేశములలో - స్థలములలో భేదమును బట్టి ఆ దానఫలము కోటిరెట్లు అధికము. పొలములో భేదమువలన పంట అధికముగాను, తక్కువగానుండునో అట్లే దానపాత్రులలో భేదమువలన దానఫలములో భేదముండును. సామాన్య దివసమందు చేయుదానము సమముగానుండు - సామాన్యముగానుండును. అమావాస్యయందు, సూర్యసంక్రమణమునందు చేసిన దానఫలము నూరు రెట్లు అధికముగానుండును, చాతుర్మాసమందు, పున్నమినాడు చేసినదానఫలము అనంతము. చంద్ర గ్రహణమందు చేసిన దానఫలము కోటిరెట్లు హెచ్చు. సూర్యగ్రహణమందు చేసిన దానఫలము దానికన్న పదిరెట్లు హెచ్చు. అక్షయతిధినాడు చేసిన దానఫలము అసంఖ్యము, అక్షయము - ఈ ప్రకారముగానే ఇతరపుణ్యదినములందు చేసిన దానఫలము అధికముగానుండును. ఈ ప్రకారము గానే (దానము విషయములో వలనే) స్నానముచేయుట - జపము చేయుట, ఇతరపుణ్యకర్మలను చేయుట - గుఱించి నరులు చేయు కర్మలఫలము కలుగుచుండును).

Transliteration

“vastudānēna vastūnāṃ samaṃ puṇyaṃ dinē dinē |

dinabhēdē kōṭiguṇaṃ asaṃkhyaṃ vādhikaṃ tathā |

samēdēśēca vastūnāṃ dānē puṇyaṃ samaṃ sura |

dēśa bhēdē kōṭiguṇaṃ asaṃkhyaṃ vā tatōdhikaṃ |

yathāphalaṃti nasyāninyūnānyapṛdhi kānica |

karṣakāṇāṃ kṣētrabhēdē pātrabhēdē phalaṃ tathā |

sāmānya divasē vipradānaṃ samaphalaṃ bhavēt |

amāyāṃ ravi saṃkrāṃtyāṃ phalaṃ śataguṇaṃ bhavēt |

cāturmāsyāṃ paurṇamāsyāṃ anaṃtaṃ phalamēva ca |

grahaṇē śiśinaḥ kōṭiguṇaṃca phalamēva ca |

sūryagrahaṇēvāpi tatō daśaguṇaṃ bhavēt |

akṣayāyāṃ akṣayaṃ tada saṃkhyaṃ phalamucyatē |

ēva manyatra puṇyāhnē phalādikyaṃ ca bhavēditi |

yadā dānē tathā snānē, japē, anya puṇya karmanu |

ēvaṃ sarvatra bōddhavyaṃ narāṇāṃ karmaṇāṃ phalaṃ ||“. (dēvī bhāgavatamu)

(rōju rōju cēyu vastudānamuvalana kalugu puṇyamu samamugānuṃḍunu. dinamulō bēdhamuṃḍuṭacēta pratidinamu cēyu dānaphalamukanna konni dinamulalō cēyudānamu phalamu kōṭireṭlu heccu - samamaina dēśamaṃdu cēsina dānamu samamugānuṃḍunu. dēśamulalō - sthalamulalō bhēdamunu baṭṭi ā dānaphalamu kōṭireṭlu adhikamu. polamulō bhēdamuvalana paṃṭa adhikamugānu, takkuvagānuṃḍunō aṭlē dānapātrulalō bhēdamuvalana dānaphalamulō bhēdamuṃḍunu. sāmānya divasamaṃdu cēyudānamu samamugānuṃḍu - sāmānyamugānuṃḍunu. amāvāsyayaṃdu, sūryasaṃkramaṇamunaṃdu cēsina dānaphalamu nūru reṭlu adhikamugānuṃḍunu, cāturmāsamaṃdu, punnamināḍu cēsinadānaphalamu anaṃtamu. caṃdra grahaṇamaṃdu cēsina dānaphalamu kōṭireṭlu heccu. sūryagrahaṇamaṃdu cēsina dānaphalamu dānikanna padireṭlu heccu. akṣayatidhināḍu cēsina dānaphalamu asaṃkhyamu, akṣayamu - ī prakāramugānē itarapuṇyadinamulaṃdu cēsina dānaphalamu adhikamugānuṃḍunu. ī prakāramu gānē (dānamu viṣayamulō valanē) snānamucēyuṭa - japamu cēyuṭa, itarapuṇyakarmalanu cēyuṭa - guṟiṃci narulu cēyu karmalaphalamu kalugucuṃḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.