“శ్లో||. క్రోధా(అ)ధ్బుతశ్చ శృంగారో హాస్యం వీరోదయా తధా |
భయానకశ్చ భీభత్సః శాంతః ప్రేమ భక్తికః ||“.
(రౌద్రరసము, అద్భుతరసము, శృంగారరసము, హాస్యరసము, వీరరసము, దయారసము, భయానకరసము (భీభత్సము), శాంతరసము, ప్రేమరసము, భక్తిరసము అని రసము పదివిధములు).
“శ్లో||. శృంగారం క్షితి నందినీ విహరణే వరం ధనుర్భంజనే |
కారుణ్య బలిభోజనే(అ)ద్భుతరసం సింధౌ గిరిస్థాప పనే |
హాస్యం శూర్పణకాముఖే భయవహే భీభత్స మన్యాముఖే |
రౌద్రం రావణమర్థనే మునిజనే శాంతం వపుః పాతునః ||“. (శ్రీరామ కర్ణామృతం - 1 - 39)
(సీతామహాదేవితో విహరించినపుడు శృంగారరసమును, శివధనస్సును విరిచినపుడు వీరరసమును, అపకారముచేసిన కాకాసురుడు శరణుజొచ్చినపుడు కరుణరసము, సముద్రములో పర్వతములను నిలిపి వారధి కట్టుటలో అద్భుతరసమును, భయమును కలిగించు శూర్పణకముక్కు చెవులు కోసి కురూపిని చేయునపుడు హాస్యరసమును, శత్రువుల యెడల భయానకరసమును, రావణాసురుని చంపునపుడు రౌద్రరసమును, మునీశ్వరుల యడల శాంతరసమును, అను ఈ పది విధముల రసములుగల శ్రీరామావతార మూర్తి మమ్ము రక్షించుగాక).
“ślō||. krōdhā(a)dhbutaśca śṛṃgārō hāsyaṃ vīrōdayā tadhā |
bhayānakaśca bhībhatsaḥ śāṃtaḥ prēma bhaktikaḥ ||“.
(raudrarasamu, adbhutarasamu, śṛṃgārarasamu, hāsyarasamu, vīrarasamu, dayārasamu, bhayānakarasamu (bhībhatsamu), śāṃtarasamu, prēmarasamu, bhaktirasamu ani rasamu padividhamulu).
“ślō||. śṛṃgāraṃ kṣiti naṃdinī viharaṇē varaṃ dhanurbhaṃjanē |
kāruṇya balibhōjanē(a)dbhutarasaṃ siṃdhau giristhāpa panē |
hāsyaṃ śūrpaṇakāmukhē bhayavahē bhībhatsa manyāmukhē |
raudraṃ rāvaṇamarthanē munijanē śāṃtaṃ vapuḥ pātunaḥ ||“. (śrīrāma karṇāmṛtaṃ - 1 - 39)
(sītāmahādēvitō vihariṃcinapuḍu śṛṃgārarasamunu, śivadhanassunu viricinapuḍu vīrarasamunu, apakāramucēsina kākāsuruḍu śaraṇujoccinapuḍu karuṇarasamu, samudramulō parvatamulanu nilipi vāradhi kaṭṭuṭalō adbhutarasamunu, bhayamunu kaligiṃcu śūrpaṇakamukku cevulu kōsi kurūpini cēyunapuḍu hāsyarasamunu, śatruvula yeḍala bhayānakarasamunu, rāvaṇāsuruni caṃpunapuḍu raudrarasamunu, munīśvarula yaḍala śāṃtarasamunu, anu ī padi vidhamula rasamulugala śrīrāmāvatāra mūrti mammu rakṣiṃcugāka).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.