← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దశవిధసర్గలు daśavidhasargalu

Original — తెలుగు

1.మహత్తత్త్వంబు, 2. అహంకారతత్వము 3. పృధివ్యాదిభూతసర్గము, 4. దశవిధేంద్రియములు 5. సాత్వికాహంకారమువలన కలిగిన మనోమయసర్గము 6. తామసాహంకారతత్వము. ఈ ఆరు ప్రాకృతసర్గలు - 7. వనస్పతులు, లతలు, స్థాదరములు, 8. తిర్యక్సర్గము 9. మానుషసర్గము - (7 మొదలు తొమ్మిదివఱకు గలవి వైకృత సర్గంబులు). అని సర్గములు తొమ్మిది విధములు - దేవసర్గముతో కలిసి 10 విధములు.

(ప్రపంచ సృష్టి ఒకే పద్ధతిలో (natural law) నడుచుచున్నది. ఒక తత్వములోనుండి మఱియొక తత్వము, దానిలోనుండి మఱియొక తత్వము పుట్టినది. ఒక విత్తనమువేయగా ఒక చిన్న మొలక లేచును. దానిలోనుండి కొమ్మలు, వాటిలోనుండి ఆకులు, పువ్వులు, పిందెలు, కాయలు, పండ్లు పుట్టుచున్నవి. ఈ ప్రకారము మొలక పెరిగే క్రమము దిన దినమునకు, క్షణ క్షణమునకు ఆగక జరుగుచునే యుండును. ప్రతిరోజు చూచువారికి ఆ క్రమము అంత స్పష్టముగా కనబడదు. కొంతకాలము గడిచినకొలది ఈ మార్పు కనబడును. ఈ ప్రకారముగానే సృష్టిక్రమములో జరుగుచున్న మార్పులలో ముఖ్యమైనవి, ముఖ్య ఘట్టములు వేరు వేరు సర్గములని చెప్పబడుచున్నవి. ఇవి పది యని శాస్త్రజ్ఞులు పేర్కొనిరి. ఈ సర్గలలో (సృష్టిలలో) సృష్టింపబడినవి అన్నియు ఒకదానిలో నుండి ఒకటి పుట్టినవే - అంతే కాక, అన్నియు మొట్ట మొదట ఉండిన ఆ ఒక్క వస్తువులోనుండియే క్రమేణ మార్పులు చెందుచూ వేఱు వేఱు రూపములను పొంది వేఱు వేఱు సర్గలనిపించుకొనుచున్నవి). (చూడుము : - ‘సర్గము’, ‘సృష్టి’).

Transliteration

1.mahattattvaṃbu, 2. ahaṃkāratatvamu 3. pṛdhivyādibhūtasargamu, 4. daśavidhēṃdriyamulu 5. sātvikāhaṃkāramuvalana kaligina manōmayasargamu 6. tāmasāhaṃkāratatvamu. ī āru prākṛtasargalu - 7. vanaspatulu, latalu, sthādaramulu, 8. tiryaksargamu 9. mānuṣasargamu - (7 modalu tommidivaṟaku galavi vaikṛta sargaṃbulu). ani sargamulu tommidi vidhamulu - dēvasargamutō kalisi 10 vidhamulu.

(prapaṃca sṛṣṭi okē paddhatilō (natural law) naḍucucunnadi. oka tatvamulōnuṃḍi maṟiyoka tatvamu, dānilōnuṃḍi maṟiyoka tatvamu puṭṭinadi. oka vittanamuvēyagā oka cinna molaka lēcunu. dānilōnuṃḍi kommalu, vāṭilōnuṃḍi ākulu, puvvulu, piṃdelu, kāyalu, paṃḍlu puṭṭucunnavi. ī prakāramu molaka perigē kramamu dina dinamunaku, kṣaṇa kṣaṇamunaku āgaka jarugucunē yuṃḍunu. pratirōju cūcuvāriki ā kramamu aṃta spaṣṭamugā kanabaḍadu. koṃtakālamu gaḍicinakoladi ī mārpu kanabaḍunu. ī prakāramugānē sṛṣṭikramamulō jarugucunna mārpulalō mukhyamainavi, mukhya ghaṭṭamulu vēru vēru sargamulani ceppabaḍucunnavi. ivi padi yani śāstrajñulu pērkoniri. ī sargalalō (sṛṣṭilalō) sṛṣṭiṃpabaḍinavi anniyu okadānilō nuṃḍi okaṭi puṭṭinavē - aṃtē kāka, anniyu moṭṭa modaṭa uṃḍina ā okka vastuvulōnuṃḍiyē kramēṇa mārpulu ceṃducū vēṟu vēṟu rūpamulanu poṃdi vēṟu vēṟu sargalanipiṃcukonucunnavi). (cūḍumu : - ‘sargamu’, ‘sṛṣṭi’).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.