- శ్రోత్రాదీని పంచ బుద్ధ్యుత్పాదకత్వాత్ బుద్ధీంద్రియాణి వాక్పాణ్యాదీని పంచ కర్మ నిర్వర్తకత్వాత్
కర్మేంద్రియాణి.
(చెవి మొదలగునవి జ్ఞానమును కలిగించునవి కనుక అయిదున్నూ జ్ఞానేంద్రియములు, వాక్కు,పాణి
మొదలగునవి అయిదున్నూ కర్మలుచేయునగుటవలన కర్మేంద్రియములు).(చూడుము - ‘కర్మేంద్రియములు’,
‘జ్ఞానేంద్రియములు’).
(జ్ఞానము సత్వగుణమగుట చేతనున్నూ, క్రియలు రజోగుణముచే అగుటవలననూ, భూతముల
సత్వగుణాంశము వలన జ్ఞానేంద్రియములును, రజోగుణాంశము వలన కర్మేంద్రియములునూ పుట్టినవి అని
చెప్పబడినవి).
- “తైజసంబైన రాజసాహంకారంబువలన దిగ్దైవతంబైన శ్రవణేంద్రియంబును, వాయు దైవతంబైన
త్వగింద్రియంబును, సూర్యదైవతంబైన నయనేంద్రియంబును, బ్రచేతో దైవతంబైన రసనేంద్రియంబును, నశ్వినీ
దైవతంబైన ఘ్రాణేంద్రియంబును, వహ్ని దైవతంబైన వాగింద్రియంబును, నింద్ర దైవతంబైన హస్తేంద్రియంబును,
నుపేంద్రి దైవతంబైన పాదేంద్రియంబును, మిత్ర దైవతంబైన గుదేంద్రియంబును, బ్రజాపతి దైవతంబైన
గుహ్యేంద్రియంబును, ననియెడి దశేంద్రియంబులు బోధజనకాంతః కరణైక భాగంబయిన బుద్ధియు, గ్రియాజనకాంతః
కరణంబైన ప్రాణంబునుం గలిగె”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 -)
Transliteration
- śrōtrādīni paṃca buddhyutpādakatvāt buddhīṃdriyāṇi vākpāṇyādīni
paṃca karma nirvartakatvāt karmēṃdriyāṇi.
(cevi modalagunavi jñānamunu kaligiṃcunavi kanuka ayidunnū
jñānēṃdriyamulu, vākku,pāṇi modalagunavi ayidunnū
karmalucēyunaguṭavalana karmēṃdriyamulu).(cūḍumu - ‘karmēṃdriyamulu’,
‘jñānēṃdriyamulu’).
(jñānamu satvaguṇamaguṭa cētanunnū, kriyalu rajōguṇamucē
aguṭavalananū, bhūtamula satvaguṇāṃśamu valana jñānēṃdriyamulunu,
rajōguṇāṃśamu valana karmēṃdriyamulunū puṭṭinavi ani ceppabaḍinavi).
- “taijasaṃbaina rājasāhaṃkāraṃbuvalana digdaivataṃbaina
śravaṇēṃdriyaṃbunu, vāyu daivataṃbaina tvagiṃdriyaṃbunu,
sūryadaivataṃbaina nayanēṃdriyaṃbunu, bracētō daivataṃbaina
rasanēṃdriyaṃbunu, naśvinī daivataṃbaina ghrāṇēṃdriyaṃbunu, vahni
daivataṃbaina vāgiṃdriyaṃbunu, niṃdra daivataṃbaina hastēṃdriyaṃbunu,
nupēṃdri daivataṃbaina pādēṃdriyaṃbunu, mitra daivataṃbaina
gudēṃdriyaṃbunu, brajāpati daivataṃbaina guhyēṃdriyaṃbunu, naniyeḍi
daśēṃdriyaṃbulu bōdhajanakāṃtaḥ karaṇaika bhāgaṃbayina buddhiyu,
griyājanakāṃtaḥ karaṇaṃbaina prāṇaṃbunuṃ galige”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 -)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.