← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దాత dāta

Original — తెలుగు
  1. దాన శీలః (దానము చేయు స్వభావము గలవాడు).

  2. ” కృపణేన సమోదాతా భువికోపి నవిద్యతే |

అనశ్నక్నేవ విత్తా నియః పరేభ్యః ప్రయచ్ఛతి ||“.

(తాను తినక అయినను ఇతరులకు దానమిచ్చు కృపణునితో సమానమైన దాత భూమిమీద ఎవరును లేరు).

  1. ” ధారుణిలోన వదాన్యుల| కీరాని పదార్ధమొక్కటేని యు గలదే| కోరిన దినమే నెముకలు ధీరుండయి యిచ్చెనని దధీచిని వినమే||”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. 722)

  1. శిబిచక్రవర్తి తన శరీరము కోసి మాంసమును దానము చేసెను - దధీచి వజ్రాయుధము చేయుటకు తన శరీరములోని ఎముకలనిచ్చెను - కాని బలిచక్రవర్తి తనరాజ్యము నిచ్చెను –

“మ. - - - ఈ విని బలిం బోలన్ వదాన్యుండులేడలఘుండై - - -

బలి వేడం బడయంగవచ్చు బహు సంపల్లాభముల్ వామనా” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 18 - 523)

Transliteration
  1. dāna śīlaḥ (dānamu cēyu svabhāvamu galavāḍu).

  2. ” kṛpaṇēna samōdātā bhuvikōpi navidyatē |

anaśnaknēva vittā niyaḥ parēbhyaḥ prayacchati ||“.

(tānu tinaka ayinanu itarulaku dānamiccu kṛpaṇunitō samānamaina dāta bhūmimīda evarunu lēru).

  1. ” dhāruṇilōna vadānyula| kīrāni padārdhamokkaṭēni yu galadē| kōrina dinamē nemukalu dhīruṃḍayi yiccenani dadhīcini vinamē||”

(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. 722)

  1. śibicakravarti tana śarīramu kōsi māṃsamunu dānamu cēsenu - dadhīci vajrāyudhamu cēyuṭaku tana śarīramulōni emukalaniccenu - kāni balicakravarti tanarājyamu niccenu –

“ma. - - - ī vini baliṃ bōlan vadānyuṃḍulēḍalaghuṃḍai - - -

bali vēḍaṃ baḍayaṃgavaccu bahu saṃpallābhamul vāmanā” (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 18 - 523)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.