గ్లానిరహితః పురుషః గుదస్థానం ఆపీడ్య (సమ్యక్ నిపీడ్య (యథావాయుః అధోనయాతి తథా నిపీడ్య) తతః తస్మాత్ గుదస్థానాత్ అనిలం వాయుం షట్సు నాభి హృదయో రస్తాలు మూల భ్రూమధ్య మూర్థ్న స్వరూపేషు షట్సు స్థానేషు ఉన్నమయేత్ (ఊర్ధ్వం సంచార యేత్ సార్ష్ణినా గుదస్యా పీడనేన నాభ్యాం స్థితం వాయుం హృదయ ప్రదేశే అధిరోప్య, తస్మాత్ హృదయ ప్రదేశాత్ ఉదానగత్యా కంఠస్థాన వ్యాపిన్యా గత్యా వక్షసితం వాయుం ప్రాపయేత్ తతః తస్మాత్ ఉరిః ప్రదేశాత్ యోగపరిపక్వయా ధియా అనుసంధాయతం వాయుం శనకైః తాలు మూలం న యేత్. తస్మాత్ తాలు మూలాత్ భృవోరంతరం ఉన్నయేత్.
(నిరుద్ధ సప్త శీర్షణ్య రంధ్రః ఉన్నయేత్. ఏవం ఉత్క్రమణ క్రమేణ వాయుం నిరుంధానః మూర్ధ్నానం నిర్భిద్య, తతః పరం అర్చిరాది మార్గ గతస్సన్ తాదృశ మూర్ధ స్థాన మపి విశ్రుజేత్“. (గ్లాని లేనివాడు - ఏ విధమైనజాడ్యము లేనివాడు వాయువు. గుదస్థానమునుండి క్రిందకు దిగకుండ అరికట్టి ఆ గుదస్థానమునుండి వాయువును నాభి, హృదయము, ఉరస్థలము, తుటిమూలము, భ్రూమధ్యము, శిరస్సు అను ఆరు స్థానములకు (మీదికి) ప్రసరింపచేయవలెను. కాలిమణమలచేత గుదమును నొక్కిపెట్టి, నాభిలోని వాయువును హృదయము వరకు మీదకు లాగి, హృదయమునుండి ఉదానవాయువు సంచారస్థలమైన కంఠస్థానమందుంచి, ఆ వాయువును వక్షస్థలమున చేర్చవలెను. తర్వాత వక్షస్థలమునుండి, యోగాభ్యాసములో పరిపక్వము చెందిన మనస్సుతో, తాలు మూలమును చేర్చవలెను. తాలుమూలమునుండి కనుబొమల మధ్యకు తీసులొనిరావలెను, ఈ ప్రకారముగా వాయువును మీద మీదకు తీసుకొనివచ్చి మూర్ధము భేధించుకొని అర్చిరాదిమార్గముద్వారా వెళ్ళుచూ ఆ మూర్ధస్థానమును కూడ వదలివేయవలెను).
“సీ. ఆసన్న మరణార్ధి యైన యతీశుండు గాల దేశములను గాచి కొనడు
తనువు విసర్జించు తలపు జనించిన భద్రాసనస్థుడై ప్రాణపవను
మనసుచేత జయించి, మానస వేగంబు బుద్ధిచే బంధించి, బుద్ధి దెచ్చి
క్షేత్రజ్ఞుతోగూర్చి క్షేత్రజ్ఞునాత్మలోపల జేర్చి, యాత్మను బ్రహ్మమందు
తే. గలిపి యొక్కట గావించి, గౌరవమున
శాంతితోడ నిరూఢుడై సకలకార్య
నివహమెల్లను దిగనాడి నిత్యసిఖము
వలయునని చూచు - -”
వ. ఇవ్విధంబున విజ్ఞాన దృద్వీర్యజ్వలనంబున నిర్దగ్ధ వాసనుండై క్రమంబున నిరపేక్షత్వంబున -
సీ. అంఘ్రిమూలమున మూలాధార చక్రంబు బీడించి, ప్రాణంబు బిగియబట్టి
నాభి తలము జేర్చి నయముతో మెల్లన హృత్సరోజము మీదికెగయబట్టి
యటమీద నురమందు హత్తించి క్రమ్మర దాలు మూలమునకు దఱిమినిలిపి
నుతముతో భ్యూయుగ్మ మధ్యంబు సేర్చి దృక్కర్ణ నాసాస్య మార్గములుమూసి
ఆ. యిచ్ఛలేని యోగి యెలమి ముహూర్తార్థ
మ్రింద్రియానుషంగమింతలేక
ప్రాణములను వంచి, బ్రహ్మరంధ్రము చించి
బ్రహ్మమందు గలయు బౌరవేంద్ర”.
వ. మఱియు దేహత్యాగకాలంబున నింద్రియంబులతోడి సంగమంబు విడువనివాడు వానితోడను గుణ సముదాయ రూపంబగు బ్రహ్మాండంబునందు ఖేచరసిద్ధవిహార యోగ్యంబును, నణిమాది సకలైశ్వర్య సమేతంబునునైన పరమేష్టిపదంబు జేరు”
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 - 27,28,29,30)
glānirahitaḥ puruṣaḥ gudasthānaṃ āpīḍya (samyak nipīḍya (yathāvāyuḥ adhōnayāti tathā nipīḍya) tataḥ tasmāt gudasthānāt anilaṃ vāyuṃ ṣaṭsu nābhi hṛdayō rastālu mūla bhrūmadhya mūrthna svarūpēṣu ṣaṭsu sthānēṣu unnamayēt (ūrdhvaṃ saṃcāra yēt sārṣṇinā gudasyā pīḍanēna nābhyāṃ sthitaṃ vāyuṃ hṛdaya pradēśē adhirōpya, tasmāt hṛdaya pradēśāt udānagatyā kaṃṭhasthāna vyāpinyā gatyā vakṣasitaṃ vāyuṃ prāpayēt tataḥ tasmāt uriḥ pradēśāt yōgaparipakvayā dhiyā anusaṃdhāyataṃ vāyuṃ śanakaiḥ tālu mūlaṃ na yēt. tasmāt tālu mūlāt bhṛvōraṃtaraṃ unnayēt.
(niruddha sapta śīrṣaṇya raṃdhraḥ unnayēt. ēvaṃ utkramaṇa kramēṇa vāyuṃ niruṃdhānaḥ mūrdhnānaṃ nirbhidya, tataḥ paraṃ arcirādi mārga gatassan tādṛśa mūrdha sthāna mapi viśrujēt”. (glāni lēnivāḍu - ē vidhamainajāḍyamu lēnivāḍu vāyuvu. gudasthānamunuṃḍi kriṃdaku digakuṃḍa arikaṭṭi ā gudasthānamunuṃḍi vāyuvunu nābhi, hṛdayamu, urasthalamu, tuṭimūlamu, bhrūmadhyamu, śirassu anu āru sthānamulaku (mīdiki) prasariṃpacēyavalenu. kālimaṇamalacēta gudamunu nokkipeṭṭi, nābhilōni vāyuvunu hṛdayamu varaku mīdaku lāgi, hṛdayamunuṃḍi udānavāyuvu saṃcārasthalamaina kaṃṭhasthānamaṃduṃci, ā vāyuvunu vakṣasthalamuna cērcavalenu. tarvāta vakṣasthalamunuṃḍi, yōgābhyāsamulō paripakvamu ceṃdina manassutō, tālu mūlamunu cērcavalenu. tālumūlamunuṃḍi kanubomala madhyaku tīsulonirāvalenu, ī prakāramugā vāyuvunu mīda mīdaku tīsukonivacci mūrdhamu bhēdhiṃcukoni arcirādimārgamudvārā veḷḷucū ā mūrdhasthānamunu kūḍa vadalivēyavalenu).
“sī. āsanna maraṇārdhi yaina yatīśuṃḍu gāla dēśamulanu gāci konaḍu
tanuvu visarjiṃcu talapu janiṃcina bhadrāsanasthuḍai prāṇapavanu
manasucēta jayiṃci, mānasa vēgaṃbu buddhicē baṃdhiṃci, buddhi decci
kṣētrajñutōgūrci kṣētrajñunātmalōpala jērci, yātmanu brahmamaṃdu
tē. galipi yokkaṭa gāviṃci, gauravamuna
śāṃtitōḍa nirūḍhuḍai sakalakārya
nivahamellanu diganāḍi nityasikhamu
valayunani cūcu - -”
va. ivvidhaṃbuna vijñāna dṛdvīryajvalanaṃbuna nirdagdha vāsanuṃḍai kramaṃbuna nirapēkṣatvaṃbuna -
sī. aṃghrimūlamuna mūlādhāra cakraṃbu bīḍiṃci, prāṇaṃbu bigiyabaṭṭi
nābhi talamu jērci nayamutō mellana hṛtsarōjamu mīdikegayabaṭṭi
yaṭamīda nuramaṃdu hattiṃci krammara dālu mūlamunaku daṟiminilipi
nutamutō bhyūyugma madhyaṃbu sērci dṛkkarṇa nāsāsya mārgamulumūsi
ā. yicchalēni yōgi yelami muhūrtārtha
mriṃdriyānuṣaṃgamiṃtalēka
prāṇamulanu vaṃci, brahmaraṃdhramu ciṃci
brahmamaṃdu galayu bauravēṃdra”.
va. maṟiyu dēhatyāgakālaṃbuna niṃdriyaṃbulatōḍi saṃgamaṃbu viḍuvanivāḍu vānitōḍanu guṇa samudāya rūpaṃbagu brahmāṃḍaṃbunaṃdu khēcarasiddhavihāra yōgyaṃbunu, naṇimādi sakalaiśvarya samētaṃbununaina paramēṣṭipadaṃbu jēru”
(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 2 - 27,28,29,30)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.