← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దేహధారి dēhadhāri

Original — తెలుగు
  1. ” దేహధారి స్వతంత్రుడుగాడు, జంత్రగానిచేత జంత్రపు బొమ్మకైవడి నీశ్వరతంత్ర పరాధీనుండై సుఖదుఃఖంబులందు నర్తనంబులు సలుపు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 -పూ.భా.- )

  2. “వ. - - - జీవుండవిద్యామహిమంజేసి కర్మానుగతంబయిన మిధ్యారూప దేహ సంబంధుండు - - -”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 9 - 224)

  1. దేహమును ధరించినవాడు - జీవుడు - జీవాత్మ.

  2. “సీ. భూపాలకోత్తమ ! భూతహితుండు సుజ్ఞాన స్వరూపకుడైన యట్టి

ప్రాణికి దేహసంబంధమెట్లగునన్నమహినొప్పు నీశ్వరమాయలేక

కలుగదు; నిద్రలో గలలోన దోచిన దేహసంబంధంబుల తెఱగువలెను

హరిమాయా మహత్వంబునం బాంచ భౌతిక దేహసంబంధుడగుచు

తే. నట్టి మాయాగుణంబుల నాత్మయోలి

బాల్య కౌమార యౌవన భావములను

నరసు సర్వాది మూర్తుల బొరసి యేను

నాయ దిదియను సంసారమాయదగిలి

వ. వర్తించు - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 9 - 223)

Transliteration
  1. ” dēhadhāri svataṃtruḍugāḍu, jaṃtragānicēta jaṃtrapu bommakaivaḍi nīśvarataṃtra parādhīnuṃḍai sukhaduḥkhaṃbulaṃdu nartanaṃbulu salupu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 -pū.bhā.- )

  2. “va. - - - jīvuṃḍavidyāmahimaṃjēsi karmānugataṃbayina midhyārūpa dēha saṃbaṃdhuṃḍu - - -”

(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 9 - 224)

  1. dēhamunu dhariṃcinavāḍu - jīvuḍu - jīvātma.

  2. “sī. bhūpālakōttama ! bhūtahituṃḍu sujñāna svarūpakuḍaina yaṭṭi

prāṇiki dēhasaṃbaṃdhameṭlagunannamahinoppu nīśvaramāyalēka

kalugadu; nidralō galalōna dōcina dēhasaṃbaṃdhaṃbula teṟaguvalenu

harimāyā mahatvaṃbunaṃ bāṃca bhautika dēhasaṃbaṃdhuḍagucu

tē. naṭṭi māyāguṇaṃbula nātmayōli

bālya kaumāra yauvana bhāvamulanu

narasu sarvādi mūrtula borasi yēnu

nāya didiyanu saṃsāramāyadagili

va. vartiṃcu - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 9 - 223)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.