← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దేహదోషములు dēhadōṣamulu

Original — తెలుగు

” దేహస్య పంచ దోషాభవంతి - కామక్రోధ నిశ్వాస భయ నిద్రాః. తన్నిరాసస్తు నిస్సంకల్ప క్షమాలబ్ధహారా ప్రమాదతాం తత్వ సేవనం“.

(మండల బ్రాహ్మణోపనిషత్)

“నిస్సంకల్పతః కామాదిని వృత్తిః, క్షమాతః క్రోధనివృత్తిః, లబ్ధ్వాహ రోపలక్షిత ప్రాణాయామతః శ్వాసాస్థిరత్వం సర్వత్ర ద్వైత ధీత్యాగతః భయనివృత్తిః, పరమార్థ తత్వ సేవనతః స్వాజ్ఞాన నిద్రా నివృతిః - ఏవం పంచదోష శాంతితః ముక్తిం భాక్త్వం స్యాదిత్యర్ధః”.

(కామము, క్రోధము, నిశ్వాసము, భయము, నిద్ర - ఈ అయిదు శరీర దోషములు. కామము సంకల్పము లేకపోవుటవలన పోవును. క్రోధము క్షమ వలన పోవును. ప్రాణాయామము వలన నిశ్వాస దోషము పోవును, శ్వాసప్రాణాయామము వలన స్థిరముగా నుండును.- అంతట ద్వైతము - భగవంతుడు వేరు, ప్రపంచము వేరు - అను బుద్ధి విడిచిపెట్టిన భయము పోవును - (అంతటా అద్వైతమే, ఉన్నదంతా భగవంతుడొక్కడే యను బుద్ధి కలిగినపుడు ఎవరికి దేనివలన భయమగును ? పరమాత్మ తత్వము నెఱుంగుటచేత తన స్వస్వరూపమును గుఱించి అయిన అజ్ఞానము నశించును. ఈ విధముగా శరీరము యొక్క అయిదు దోషములు నశించిన ముక్తిని పొందినవాడగును).

Transliteration

” dēhasya paṃca dōṣābhavaṃti - kāmakrōdha niśvāsa bhaya nidrāḥ. tannirāsastu nissaṃkalpa kṣamālabdhahārā pramādatāṃ tatva sēvanaṃ”.

(maṃḍala brāhmaṇōpaniṣat)

“nissaṃkalpataḥ kāmādini vṛttiḥ, kṣamātaḥ krōdhanivṛttiḥ, labdhvāha rōpalakṣita prāṇāyāmataḥ śvāsāsthiratvaṃ sarvatra dvaita dhītyāgataḥ bhayanivṛttiḥ, paramārtha tatva sēvanataḥ svājñāna nidrā nivṛtiḥ - ēvaṃ paṃcadōṣa śāṃtitaḥ muktiṃ bhāktvaṃ syādityardhaḥ”.

(kāmamu, krōdhamu, niśvāsamu, bhayamu, nidra - ī ayidu śarīra dōṣamulu. kāmamu saṃkalpamu lēkapōvuṭavalana pōvunu. krōdhamu kṣama valana pōvunu. prāṇāyāmamu valana niśvāsa dōṣamu pōvunu, śvāsaprāṇāyāmamu valana sthiramugā nuṃḍunu.- aṃtaṭa dvaitamu - bhagavaṃtuḍu vēru, prapaṃcamu vēru - anu buddhi viḍicipeṭṭina bhayamu pōvunu - (aṃtaṭā advaitamē, unnadaṃtā bhagavaṃtuḍokkaḍē yanu buddhi kaliginapuḍu evariki dēnivalana bhayamagunu ? paramātma tatvamu neṟuṃguṭacēta tana svasvarūpamunu guṟiṃci ayina ajñānamu naśiṃcunu. ī vidhamugā śarīramu yokka ayidu dōṣamulu naśiṃcina muktini poṃdinavāḍagunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.