← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దేహాంతరప్రాప్తి dēhāṃtaraprāpti

Original — తెలుగు
  1. దేహాత్ అన్యో దేహో దేహాంతరం, తత్పాప్తిః. (ఒక దేహమునుండి ఇంకొక దేహమును పొందుట).

  2. “దేహినో (అ)స్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా |

తథా దేహాంతరప్రాప్తిర్ధీరస్తత్ర నముహ్యతి||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 12, 13)

(ఈ దేహమందుండు జీవికి బాల్యము, కౌమారము, ముసలితనము ఎట్లు వచ్చునో అట్లే దేహికి దేహాంతరము (మఱియొక దేహము) ప్రాప్తించును. జీవుడు ఒకదేహము వదలి ఇంకొక దేహములో ప్రవేశించును).

  1. “వాసాం సి జీర్ణాణి యథా విహాయ నవాని గృహ్ణాతి నరో (అ)పరాణి |

తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సం యాతి నవాని దేహా ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 22)

(నరుడు చినిగిపోయిన బట్టలను విడిచిపెట్టి కొత్తవి తీసుకొనునట్లు దేహియగువాడు - దేహము గలవాడు - జీవుడు - ముసలితనమువలన గాని, రోగమువలనగాని, మరియే ఇతర కారణములవలన గాని, ప్రస్తుత శరీరమును విడిచిపెట్టి మఱియొక శరీరమును - కొత్త శరీరమును - పొందును).

  1. ” హంతత ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మా సనాతనం |

యదావా మరణం ప్రాప్య ఆత్మభవతి గౌతమ |

యోనిమన్యే ప్రపద్యం తే శరీరత్వాయ దేహినః |

స్థాను మన్యే అను సం యంతి యథా కర్మ యథా శ్రుతం ||” (కఠోపనిషత్ - 2 - 6 -7)

(సనాతనుడైన పరబ్రహ్మ గుఱించి అతి రహస్యమైన విషయము చెప్పుచున్నాను : - చనిపోయిన తర్వాత ఆత్మ ఏమగుచున్నదో చెప్పెదను - మఱియొక దేహమును పొందుటకు కొన్ని జీవులు మఱియొకదేహము నాశ్రయించెదరు. కొందఱుఒక చెట్టునో మఱిదేనినో ఆశ్రయించెదరు. పూర్వ, పూర్వ జన్మలలో వారు చేసిన కర్మల ఫలమనుభవించుటకువాటికి అనుకూలమైన శరీరమును విధి ప్రకారము పొందుదురు).

  1. “త్రైవిద్యా మాంసోమపాః పూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే |

తే పుణ్యమాసాద్య సురేంద్ర లోకం అశ్నంతి దివ్యాన్ దివి భోగాన్ |

తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ||” (శ్రీమద్భగవద్గీత - 9 - 20, 21)

(ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము చదివినవారు యజ్ఞములు చేసినవారై, పాపములను పోగొట్టుకొనినవారై స్వర్గలోకములోనుండుటకు ప్రార్ధింతురు. అట్టివారు పుణ్యమును చేసుకొని ఇంద్రలోకములో దివ్యమైన దేవేంద్రలోకభోగములననుభవించి, ఈ ఫలముచే వారు చేసిన పుణ్యము క్షీణించిన తర్వాత మరల మర్త్యలోకమును - భూలోకమును పొందుదురు - భూలోకమున జన్మించెదరు).

  1. “వర్ణా ఆశ్రమాశ్చ స్వకర్మనిష్టితాప్రేత్య, కర్మఫలమను భూయ తతశ్శేషేణ విశిష్ట దేశ జాతి కుల రూపాయుః శ్రుత విత్త వృత్త సుఖ మేథసో జన్మ ప్రతి వద్యంతే”. (గౌతమ ధర్మసూత్రములు - 11 - 31)

(వర్ణా శ్రమ ధర్మముల ననుష్టించినవారు - బ్రాహ్మణాదివర్ణములవారును, బ్రహ్మచర్యము మొదలగు ఆశ్రమములవారును తమకు విధించిన కర్మలను చేయుట యందు నిష్టులైన వారు చనిపోయిన తర్వాత స్వర్గాదిలోకములందువారు చేసిన కర్మలకు అనుగుణమైన ఫలమనుభవించి, మిగిలిన కర్మలచేత ఉత్తమమగు దేశమందు, జాతిలోను,కులమందును, రూపము,వయస్సుగలవారై ధనవంతులు,సుఖవంతులు,శీలవంతులు,బుద్ధిమంతులై జన్మించెదరు).

  1. యం యం వాపి స్మరన్ భావం త్యిజత్యంతే కళేబరం |

తంతమే నైతి కౌంతేయ సదా తద్భావ భావితః ||.

(మరణకాలమందు యే యే భావములను స్మరించుచు చనిపోవునో వాటినే నిత్యము ధ్యానించుటవలన చనిపోయినతర్వాత ఆ భావములనే పొందును. ఇట్లు భగవంతుని గుఱించి స్మరించిన యడల భగవంతునే పొందును - ఎప్పుడు చనిపోవుదురో ముందుగా తెలియనందున ఎల్లపుడూ భగవంతుని ఎప్పుడునూ - వీలు కలిగినఫుడు - స్మరించు చుండవలెను).

“మ. భరతుండల్లన యంత్యకాలము వెసం బ్రాపింపగా నప్పుడా

హరిణం బుం గడు భక్తి చిత్తగతి సత్యాసక్తి నీక్షింపనా

హరిణంబుం దన యాత్మలో నిలిపి దేహంబంతటం బాసి తా

హరిణీ గర్భమునం జనించి హరిణంబై యొప్పె బూర్వ స్మృతిన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము (5 - 1 - )

  1. జీవుడు దేహమును విడిచి ఎట్లు పోవుననగా –

    1. “తముత్కాంతం ప్రాణో (అ)నూత్క్రామతి, ప్రాణమనూత్క్రం మంతం సర్వే ప్రాణా అనుత్క్రామంతి”

(బృహదారణ్యకోపనిషత్ - 4 - 4 - 2)

(జీవుని మరణకాలమందు అతని స్థూలదేహమును విడిచిపోవునపుడు మూలప్రాణము (ప్రాణవాయువు) అతనితోకూడ పోవును, ఆ ముఖ్యప్రాణమును మిగిలిన ప్రాణములు - అనగా, అపానము, వ్యానము, ఉదానసమానములున్నూ, ఉపప్రాణములున్నూ, ముఖ్యప్రాణముతోకూడ పోవును).

  1. “మమై వాంశో జీవలోకే జీవ భూతః సనాతనః |

మనః షష్టాణీంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి |

శరీరం యదవాప్నోతి యచ్చాప్యుక్రామతీశ్వరః |

గృహీత్వై తాని సం యాతి వాయుర్గంధానివాశయాత్ ||“. (శ్రీమద్భగవద్గీత - 15 - 7, 8)

(సనాతనుడనైన నా అంశయే అయిన జీవలోకములోని జీవుడు ప్రకాలిలోనున్న ఆరు విషయములను - ఆకర్షించును. ఏ శరీరమును ధరించినను, ఏ శరీరమును విడిచిపోయినను వీటిని (ఇంద్రియములను) తనవెంట తీసుకొని పోవును -గంధమును వాయువు తనతో తీసుకొని పోయినట్లు). యథా వాయుః పవనః గంధాన్ ఆశయాత్ పుష్పాదేః సం యాతి తథా ఈశ్వరః - దేహాదిసంఘాత స్వామీ, జీవః - యచ్చాపియదాపి ఉత్క్రామతి తదా పూర్వస్మాత్ శరీరాత్ శరీరాంతరం అవాప్నోతి తదా గృహీత్వా ఏతాని మనుష్షష్టానీంద్రియాణి సం యాతి - సమ్యక్ యాతి గచ్చతి” (శ్రీశంకరః)

(పుష్పములనుండి గంధమును వాయువు ఏప్రకారముగా తనతో తీసుకొనిపోవునో ఆ ప్రకారముగా ఈశ్వరుడు - దేహము మొదలగువాటి కూటమికి ప్రభువైన జీవుడు - ఎప్పుడు ఏ శరీరమును విడిచి పైకి పోవునో అప్పుడు ముందుశరీరమునుండి ఇంకొకశరీరమునకు తనతోకూడ మనస్సును ఇంద్రియములను తనతోతీసుకొనిపోవును).

(పైన చెప్పిన దానివలన తెలియునది ఏమనగా - ఈ స్థూల దేహము కన్న వేఱొకటి సూక్ష్మదేహము జీవునకున్నది. జీవుడు స్థూలదేహమును విడిచిపోవునపుడు, సూక్ష్మదేహముతో పోవును. ఇంకొక జన్మ ఎత్తినపుడు ఈ సూక్ష్మ దేహముతో ఇంకొక స్థూలదేహమును ప్రవేశించును. సూక్ష్మదేహముతో వెనుకటి దేహముల వాసనలను కూడ తీసుకొని పోవును. ఆ వాసనలననుసరించియే స్థూలదేహము కలుగును. ఆ సూక్ష్మదేహములోనున్న జీవుడు తల్లి కడుపులో దేహమును పెంచుకొనును).

  1. “తృణ జలూకా తృణస్యాంతం గత్వా తృణాంతరమాక్రమ్య ఆత్మానాం దేహం పూర్వస్మాత్ త్రుణాత్ ఉప సమ్హరతి - పూర్వ తృణం ముంచతి, ఏవమేవ అయమాత్మా దేహాంతరం పరిగృహ్య పూర్వ దేహం ముంచతి - ఇతి మధ్యే విలంబా భావః శ్రుత్యంతరే ఉక్తః”. (శ్రీ ఆనందగిరి).

(గడ్డి పురుగు గడ్డిరేకు కొసకు వెళ్ళి మఱియొక గడ్డిపోచను పట్టుకొని తర్వాత మొదటి గడ్డిపోచనుండి తన శరీరమును లాగి వేసుకొనును. ఆ రీతిగానే ఆత్మ ఇంకొక దేహమును చూచుకొని, దానిని పట్టుకొని మొదటి దేహమును వదలి వేయును. దీనిని బట్టి ఒక దేహమునుండి ఇంకొక దేహమును పొందునపుడు ఈ రెండింటి మధ్యకాలమందు వ్యవధి ఉండదు అని వేఱొక శ్రుతిలో చెప్పబడినది).

  1. “అదైతయోః పథోః నకతరేణ చ న తానీ మాని క్షుద్రాణి అసకృదావర్తినీ భూతాని భవంతి - జాయస్వ మ్రియస్వ ఇత్యే తత్తృతీయ స్థానం”

(ఛాందోగ్యోపనిషత్ - 5 - 10 - 8)

(విద్యచేత - జ్ఞానముచేత - దేవయానమార్గము ననుసరించియు, ఇష్టా పూర్తాది కర్మలు చేయుటచేత పితృయానము ననుసరించియు, చంద్ర లోకమునకు పోవుచుందురు - ఆ రెండు మార్గములమీద పోవలేని జ్ఞానహీనులు, కర్మహీనులు మూడవమార్గముననుసరించి - తృతీయః పంథాననుసరించి పోవుదురు - వారు క్షుద్రులు - పుట్టుచు, చనిపోవుచుండుట అను మూడవ మార్గమున పోవుదురు).

“అధైతమేవా ధ్వనం పునర్నివర్తంతే యధే తమాకాశం, ఆకాశాద్వాయుః, వాయుర్భూత్వా ధూమో భవతి, ధూమో భూత్వా అభ్రం భవతి, అభ్రం భూత్వా మేఘో భవతి మేఘో భూత్వా ప్రవర్షతి.” (ఛాందోగ్యోపనిషత్ - 5 - 10 - 5)

“త ఇహ వ్రీహి యవా ఔషధి వనస్పతయః తిలమాషా ఇతి జాయంతే. యోయోహ్యన్నమత్తి యో రేతస్సిం చతి తద్భూయ ఏవ భవతి.”

(ఛాందోగ్యోపనిషత్తు - 5 - 10 - 6)

(చంద్రమండలమునుండి దిగివచ్చువారు - అచటకు వెళ్ళిన రీతినే తిరిగి వత్తురు - ఆ చంద్రమండలమునుండి ఆకాశమును, ఆకాశమునుండి వాయువును పొందును. వాయువై ధూమమగును - ధూమమై అభ్రమగును, అభ్రమై మేఘమగును, మేఘమై వర్షించును - వర్షరూపమై నేలపై బడినతర్వాత, వ్రీహి, యవ, ఔషధి, వనస్పతి, తిల మాష రూపములలో జన్మింతురు, అన్న భావమున పొంది పురుషునిచే తినబడి యాత్మలో ప్రవేశించి తద్భావమును పొందును - తర్వాత ” యోనేః శరీరం” - యోనినుండి శరీరమును పొందుచున్నారు - అనగా కర్మఫల భోగ యోగ్యమగు శరీరమును పొందును).

  1. బ్రహ్మవిదామపి కేషాంచి దితి హాస పురాణయోః దేహాంతరోత్పత్తి దర్శనాత్. తథాహ్య పాంతర తమానామ వేదాచార్యః పురాణర్షిః విష్ణు నియోగాత్ కలి ద్వాపరయోస్సందౌ కృష్ణ ద్వైపాయన స్సంబ భూవ ఇతిస్మరంతి. వశిష్టశ్చ బ్రహ్మణః మానసః పుత్రస్సన్ నిమిశాపాదవగత పూర్వదేహః పునర్బహ్మా దేశాత్ మిత్రావరుణాభ్యాం సంచభూవేతి. భృగ్వాదీనామపి బ్రహ్మణః ఏవమానసానాం పుత్రాణాం వారుణీయజ్ఞే పునరుత్పత్తిః స్మర్యతే. సనత్కుమారోపి బ్రహ్మాణ ఏవ మానసపుత్రః స్వయం రుద్రాయవరిప్ర దానాత్ స్కందత్వేన ప్రాదుర్బభూవ. ఏవమేవ దక్షనారద ప్రభృతీనామపి భూయసి దేహాంతరోత్పత్తి కథా తేన తేన నిమిత్తేన భవతి స్మృతా - - - సర్వే చైతే సమధిగత సకల వేదార్ధః స్మర్యంతే.” - - - తత్ర కిం విదుషో వర్తమాన దేహపాతానంతరం దేహాంతరప్రాప్తిరస్తి, నవా, ఇతి సందేహే అస్తీతిపూర్వపక్షః - సిద్ధాంతస్తు అపాంతరతమ ప్రభృతీనాం అధికారికాణాం లోకవ్యవస్థ హేతుషు, అదికారేషు, పరమేశ్వరేణ నియుక్తానాం సమ్యగ్దర్శనతః ప్రక్షీణ కర్మణాం యావదిధికారమవ స్థితిః యావత్ప్రారబ్ధకర్మ అవస్థితః తస్య ప్రారబ్ధకర్మణః భోగేన క్షయే ప్రతిబంధకాంతరా భావాత్ అప్రతిబంధ సాక్షాత్కారో వర్తమాన దేహ పాతానంతరం కైవల్యం సంపాదయతీతి న దేహేంతర ప్రాప్తిః ఇతి సిద్ధం”

(బ్రహ్మజ్ఞానము గలవారికి జ్ఞానము కలుగుటవలననే ముక్తి కలుగును - (జ్ఞా నేనైవతు కైవల్యం) - అట్టివారికి దేహాంతరప్రాప్తి - పునర్జన్మ - లేదు అని చెప్పబడినది. అయినను కొన్ని పురాణమూలలోను ఇతిహాసములలోను అట్టి జ్ఞానులకుకూడ దేహాంతరప్రాప్తి కలదని చెప్పబడినది. ఒక పురాణ ఋషి వేదాచార్యుడు విష్ణుని నియోగమువలన కలియుగ ద్వాపరయుగ సంధిలో కృష్ణ ద్వైపాయనుడుగా పుట్టెను అని చెప్పబడినది. బ్రహ్మ యొక్క మానసపుత్రుడైన వశిష్టుడు బ్రహ్మాదేశముననుసరించి నిమిశాపాదపముగానుండి తర్వాత మిత్రావరణులకు పుట్టెను - బ్రహ్మయొక్క మానసపుత్రులే అయిన భృగువు మొదలగువారు వారణయజ్ఞమందు తిరిగి పుట్టినట్లు చెప్పబడినది. బ్రహ్మ మానసపుత్రుడైన సనత్కుమారుడు కూడ శివుని కుమారుడు స్కందుడుగా ఉద్భవించెను. ఈ ప్రకారముగానే దక్షుడు, నారదుడు మొదలగువారు మఱియొక జన్మ ఎత్తినట్లు - మరొక దేహమును పొందినట్లు చెప్పబడినది. వారందఱు ఆయా కారణములచేత నట్లు దేహాంతరమును - పునర్జన్మను పొందవలసి వచ్చెను. వీరందఱు వేద వేదాంతములు బాగుగా నెఱిగినవారే - బ్రహ్మ జ్ఞానులే, సాక్షాన్మోక్షార్హులే, పునర్జన్మ లేక ఉండవలసినవారే - ఇట్లు అయిన యెడల బ్రహ్మజ్ఞానులకు ఈ వర్తమాన దేహము విడిచిన తర్వాత దేహాంతర ప్రాప్తి యున్నదా లేదా అని సందేహము - దేహాంతరప్రాప్తి కలదు అని పూర్వపక్షవాదము - ఈ విషయములో సిద్ధాంతము ఈ విధముగానున్నది: - అపాంతరతముడగు పురాణ ఋషి చెప్పిన జ్ఞానులు లోకవ్యవస్థకారణముగా పరమేశ్వరునిచేత ఆయా కార్యములలో నియోగింపబడుటచేత వారి జ్ఞానము వలన ప్రారబ్దకర్మ క్షీణించువరకు వారు పైన చెప్పిన ప్రకారము ఉండి వారి ప్రారబ్దకర్మ అనుభవించుటవలన క్షీణించగానే ఇతర ప్రతిబంధకము లేవియు లేకుండుట వలన వర్తమాన దేహము నశించిన తర్వాత వారు కైవల్యమును - మోక్షమును - పొందుదురు. అందుచేత వారికి దేహాంతరప్రాప్తి లేదు అనుట సిద్ధము).

  1. దేహాంతర ప్రాప్తి అనగా - ” స్థూలాత్ శరీరాత్ అన్యేషాం లింగ శరీరాణాం సూక్ష్మాణాం స్థూల శరీరాను కారిణాం ప్రాప్తిః.

(ఈ స్థూల శరీరమును విడిచి, ఇతర స్థూల శరీరమునకు కారణమైన సూక్ష్మ శరీరమును పొందుట).

Transliteration
  1. dēhāt anyō dēhō dēhāṃtaraṃ, tatpāptiḥ. (oka dēhamunuṃḍi iṃkoka dēhamunu poṃduṭa).

  2. “dēhinō (a)smin yathā dēhē kaumāraṃ yauvanaṃ jarā |

tathā dēhāṃtaraprāptirdhīrastatra namuhyati||“. (śrīmadbhagavadgīta - 2 - 12, 13)

(ī dēhamaṃduṃḍu jīviki bālyamu, kaumāramu, musalitanamu eṭlu vaccunō aṭlē dēhiki dēhāṃtaramu (maṟiyoka dēhamu) prāptiṃcunu. jīvuḍu okadēhamu vadali iṃkoka dēhamulō pravēśiṃcunu).

  1. “vāsāṃ si jīrṇāṇi yathā vihāya navāni gṛhṇāti narō (a)parāṇi |

tathā śarīrāṇi vihāya jīrṇā nyanyāni saṃ yāti navāni dēhā ||“. (śrīmadbhagavadgīta - 2 - 22)

(naruḍu cinigipōyina baṭṭalanu viḍicipeṭṭi kottavi tīsukonunaṭlu dēhiyaguvāḍu - dēhamu galavāḍu - jīvuḍu - musalitanamuvalana gāni, rōgamuvalanagāni, mariyē itara kāraṇamulavalana gāni, prastuta śarīramunu viḍicipeṭṭi maṟiyoka śarīramunu - kotta śarīramunu - poṃdunu).

  1. ” haṃtata idaṃ pravakṣyāmi guhyaṃ brahmā sanātanaṃ |

yadāvā maraṇaṃ prāpya ātmabhavati gautama |

yōnimanyē prapadyaṃ tē śarīratvāya dēhinaḥ |

sthānu manyē anu saṃ yaṃti yathā karma yathā śrutaṃ ||” (kaṭhōpaniṣat - 2 - 6 -7)

(sanātanuḍaina parabrahma guṟiṃci ati rahasyamaina viṣayamu ceppucunnānu : - canipōyina tarvāta ātma ēmagucunnadō ceppedanu - maṟiyoka dēhamunu poṃduṭaku konni jīvulu maṟiyokadēhamu nāśrayiṃcedaru. koṃdaṟuoka ceṭṭunō maṟidēninō āśrayiṃcedaru. pūrva, pūrva janmalalō vāru cēsina karmala phalamanubhaviṃcuṭakuvāṭiki anukūlamaina śarīramunu vidhi prakāramu poṃduduru).

  1. “traividyā māṃsōmapāḥ pūtapāpāḥ yajñairiṣṭvā svargatiṃ prārthayaṃtē |

tē puṇyamāsādya surēṃdra lōkaṃ aśnaṃti divyān divi bhōgān |

tētaṃ bhuktvā svargalōkaṃ viśālaṃ kṣīṇē puṇyē martyalōkaṃ viśaṃti ||” (śrīmadbhagavadgīta - 9 - 20, 21)

(ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamu cadivinavāru yajñamulu cēsinavārai, pāpamulanu pōgoṭṭukoninavārai svargalōkamulōnuṃḍuṭaku prārdhiṃturu. aṭṭivāru puṇyamunu cēsukoni iṃdralōkamulō divyamaina dēvēṃdralōkabhōgamulananubhaviṃci, ī phalamucē vāru cēsina puṇyamu kṣīṇiṃcina tarvāta marala martyalōkamunu - bhūlōkamunu poṃduduru - bhūlōkamuna janmiṃcedaru).

  1. “varṇā āśramāśca svakarmaniṣṭitāprētya, karmaphalamanu bhūya tataśśēṣēṇa viśiṣṭa dēśa jāti kula rūpāyuḥ śruta vitta vṛtta sukha mēthasō janma prati vadyaṃtē”. (gautama dharmasūtramulu - 11 - 31)

(varṇā śrama dharmamula nanuṣṭiṃcinavāru - brāhmaṇādivarṇamulavārunu, brahmacaryamu modalagu āśramamulavārunu tamaku vidhiṃcina karmalanu cēyuṭa yaṃdu niṣṭulaina vāru canipōyina tarvāta svargādilōkamulaṃduvāru cēsina karmalaku anuguṇamaina phalamanubhaviṃci, migilina karmalacēta uttamamagu dēśamaṃdu, jātilōnu,kulamaṃdunu, rūpamu,vayassugalavārai dhanavaṃtulu,sukhavaṃtulu,śīlavaṃtulu,buddhimaṃtulai janmiṃcedaru).

  1. yaṃ yaṃ vāpi smaran bhāvaṃ tyijatyaṃtē kaḷēbaraṃ |

taṃtamē naiti kauṃtēya sadā tadbhāva bhāvitaḥ ||.

(maraṇakālamaṃdu yē yē bhāvamulanu smariṃcucu canipōvunō vāṭinē nityamu dhyāniṃcuṭavalana canipōyinatarvāta ā bhāvamulanē poṃdunu. iṭlu bhagavaṃtuni guṟiṃci smariṃcina yaḍala bhagavaṃtunē poṃdunu - eppuḍu canipōvudurō muṃdugā teliyanaṃduna ellapuḍū bhagavaṃtuni eppuḍunū - vīlu kaliginaphuḍu - smariṃcu cuṃḍavalenu).

“ma. bharatuṃḍallana yaṃtyakālamu vesaṃ brāpiṃpagā nappuḍā

hariṇaṃ buṃ gaḍu bhakti cittagati satyāsakti nīkṣiṃpanā

hariṇaṃbuṃ dana yātmalō nilipi dēhaṃbaṃtaṭaṃ bāsi tā

hariṇī garbhamunaṃ janiṃci hariṇaṃbai yoppe būrva smṛtin”. (śrīmadāṃdhramahābhāgavatamu (5 - 1 - )

  1. jīvuḍu dēhamunu viḍici eṭlu pōvunanagā –

    1. “tamutkāṃtaṃ prāṇō (a)nūtkrāmati, prāṇamanūtkraṃ maṃtaṃ sarvē prāṇā anutkrāmaṃti”

(bṛhadāraṇyakōpaniṣat - 4 - 4 - 2)

(jīvuni maraṇakālamaṃdu atani sthūladēhamunu viḍicipōvunapuḍu mūlaprāṇamu (prāṇavāyuvu) atanitōkūḍa pōvunu, ā mukhyaprāṇamunu migilina prāṇamulu - anagā, apānamu, vyānamu, udānasamānamulunnū, upaprāṇamulunnū, mukhyaprāṇamutōkūḍa pōvunu).

  1. “mamai vāṃśō jīvalōkē jīva bhūtaḥ sanātanaḥ |

manaḥ ṣaṣṭāṇīṃdriyāṇi prakṛti sthāni karṣati |

śarīraṃ yadavāpnōti yaccāpyukrāmatīśvaraḥ |

gṛhītvai tāni saṃ yāti vāyurgaṃdhānivāśayāt ||“. (śrīmadbhagavadgīta - 15 - 7, 8)

(sanātanuḍanaina nā aṃśayē ayina jīvalōkamulōni jīvuḍu prakālilōnunna āru viṣayamulanu - ākarṣiṃcunu. ē śarīramunu dhariṃcinanu, ē śarīramunu viḍicipōyinanu vīṭini (iṃdriyamulanu) tanaveṃṭa tīsukoni pōvunu -gaṃdhamunu vāyuvu tanatō tīsukoni pōyinaṭlu). yathā vāyuḥ pavanaḥ gaṃdhān āśayāt puṣpādēḥ saṃ yāti tathā īśvaraḥ - dēhādisaṃghāta svāmī, jīvaḥ - yaccāpiyadāpi utkrāmati tadā pūrvasmāt śarīrāt śarīrāṃtaraṃ avāpnōti tadā gṛhītvā ētāni manuṣṣaṣṭānīṃdriyāṇi saṃ yāti - samyak yāti gaccati” (śrīśaṃkaraḥ)

(puṣpamulanuṃḍi gaṃdhamunu vāyuvu ēprakāramugā tanatō tīsukonipōvunō ā prakāramugā īśvaruḍu - dēhamu modalaguvāṭi kūṭamiki prabhuvaina jīvuḍu - eppuḍu ē śarīramunu viḍici paiki pōvunō appuḍu muṃduśarīramunuṃḍi iṃkokaśarīramunaku tanatōkūḍa manassunu iṃdriyamulanu tanatōtīsukonipōvunu).

(paina ceppina dānivalana teliyunadi ēmanagā - ī sthūla dēhamu kanna vēṟokaṭi sūkṣmadēhamu jīvunakunnadi. jīvuḍu sthūladēhamunu viḍicipōvunapuḍu, sūkṣmadēhamutō pōvunu. iṃkoka janma ettinapuḍu ī sūkṣma dēhamutō iṃkoka sthūladēhamunu pravēśiṃcunu. sūkṣmadēhamutō venukaṭi dēhamula vāsanalanu kūḍa tīsukoni pōvunu. ā vāsanalananusariṃciyē sthūladēhamu kalugunu. ā sūkṣmadēhamulōnunna jīvuḍu talli kaḍupulō dēhamunu peṃcukonunu).

  1. “tṛṇa jalūkā tṛṇasyāṃtaṃ gatvā tṛṇāṃtaramākramya ātmānāṃ dēhaṃ pūrvasmāt truṇāt upa samharati - pūrva tṛṇaṃ muṃcati, ēvamēva ayamātmā dēhāṃtaraṃ parigṛhya pūrva dēhaṃ muṃcati - iti madhyē vilaṃbā bhāvaḥ śrutyaṃtarē uktaḥ”. (śrī ānaṃdagiri).

(gaḍḍi purugu gaḍḍirēku kosaku veḷḷi maṟiyoka gaḍḍipōcanu paṭṭukoni tarvāta modaṭi gaḍḍipōcanuṃḍi tana śarīramunu lāgi vēsukonunu. ā rītigānē ātma iṃkoka dēhamunu cūcukoni, dānini paṭṭukoni modaṭi dēhamunu vadali vēyunu. dīnini baṭṭi oka dēhamunuṃḍi iṃkoka dēhamunu poṃdunapuḍu ī reṃḍiṃṭi madhyakālamaṃdu vyavadhi uṃḍadu ani vēṟoka śrutilō ceppabaḍinadi).

  1. “adaitayōḥ pathōḥ nakatarēṇa ca na tānī māni kṣudrāṇi asakṛdāvartinī bhūtāni bhavaṃti - jāyasva mriyasva ityē tattṛtīya sthānaṃ”

(chāṃdōgyōpaniṣat - 5 - 10 - 8)

(vidyacēta - jñānamucēta - dēvayānamārgamu nanusariṃciyu, iṣṭā pūrtādi karmalu cēyuṭacēta pitṛyānamu nanusariṃciyu, caṃdra lōkamunaku pōvucuṃduru - ā reṃḍu mārgamulamīda pōvalēni jñānahīnulu, karmahīnulu mūḍavamārgamunanusariṃci - tṛtīyaḥ paṃthānanusariṃci pōvuduru - vāru kṣudrulu - puṭṭucu, canipōvucuṃḍuṭa anu mūḍava mārgamuna pōvuduru).

“adhaitamēvā dhvanaṃ punarnivartaṃtē yadhē tamākāśaṃ, ākāśādvāyuḥ, vāyurbhūtvā dhūmō bhavati, dhūmō bhūtvā abhraṃ bhavati, abhraṃ bhūtvā mēghō bhavati mēghō bhūtvā pravarṣati.” (chāṃdōgyōpaniṣat - 5 - 10 - 5)

“ta iha vrīhi yavā auṣadhi vanaspatayaḥ tilamāṣā iti jāyaṃtē. yōyōhyannamatti yō rētassiṃ cati tadbhūya ēva bhavati.”

(chāṃdōgyōpaniṣattu - 5 - 10 - 6)

(caṃdramaṃḍalamunuṃḍi digivaccuvāru - acaṭaku veḷḷina rītinē tirigi vatturu - ā caṃdramaṃḍalamunuṃḍi ākāśamunu, ākāśamunuṃḍi vāyuvunu poṃdunu. vāyuvai dhūmamagunu - dhūmamai abhramagunu, abhramai mēghamagunu, mēghamai varṣiṃcunu - varṣarūpamai nēlapai baḍinatarvāta, vrīhi, yava, auṣadhi, vanaspati, tila māṣa rūpamulalō janmiṃturu, anna bhāvamuna poṃdi puruṣunicē tinabaḍi yātmalō pravēśiṃci tadbhāvamunu poṃdunu - tarvāta ” yōnēḥ śarīraṃ” - yōninuṃḍi śarīramunu poṃducunnāru - anagā karmaphala bhōga yōgyamagu śarīramunu poṃdunu).

  1. brahmavidāmapi kēṣāṃci diti hāsa purāṇayōḥ dēhāṃtarōtpatti darśanāt. tathāhya pāṃtara tamānāma vēdācāryaḥ purāṇarṣiḥ viṣṇu niyōgāt kali dvāparayōssaṃdau kṛṣṇa dvaipāyana ssaṃba bhūva itismaraṃti. vaśiṣṭaśca brahmaṇaḥ mānasaḥ putrassan nimiśāpādavagata pūrvadēhaḥ punarbahmā dēśāt mitrāvaruṇābhyāṃ saṃcabhūvēti. bhṛgvādīnāmapi brahmaṇaḥ ēvamānasānāṃ putrāṇāṃ vāruṇīyajñē punarutpattiḥ smaryatē. sanatkumārōpi brahmāṇa ēva mānasaputraḥ svayaṃ rudrāyavaripra dānāt skaṃdatvēna prādurbabhūva. ēvamēva dakṣanārada prabhṛtīnāmapi bhūyasi dēhāṃtarōtpatti kathā tēna tēna nimittēna bhavati smṛtā - - - sarvē caitē samadhigata sakala vēdārdhaḥ smaryaṃtē.” - - - tatra kiṃ viduṣō vartamāna dēhapātānaṃtaraṃ dēhāṃtaraprāptirasti, navā, iti saṃdēhē astītipūrvapakṣaḥ - siddhāṃtastu apāṃtaratama prabhṛtīnāṃ adhikārikāṇāṃ lōkavyavastha hētuṣu, adikārēṣu, paramēśvarēṇa niyuktānāṃ samyagdarśanataḥ prakṣīṇa karmaṇāṃ yāvadidhikāramava sthitiḥ yāvatprārabdhakarma avasthitaḥ tasya prārabdhakarmaṇaḥ bhōgēna kṣayē pratibaṃdhakāṃtarā bhāvāt apratibaṃdha sākṣātkārō vartamāna dēha pātānaṃtaraṃ kaivalyaṃ saṃpādayatīti na dēhēṃtara prāptiḥ iti siddhaṃ”

(brahmajñānamu galavāriki jñānamu kaluguṭavalananē mukti kalugunu - (jñā nēnaivatu kaivalyaṃ) - aṭṭivāriki dēhāṃtaraprāpti - punarjanma - lēdu ani ceppabaḍinadi. ayinanu konni purāṇamūlalōnu itihāsamulalōnu aṭṭi jñānulakukūḍa dēhāṃtaraprāpti kaladani ceppabaḍinadi. oka purāṇa ṛṣi vēdācāryuḍu viṣṇuni niyōgamuvalana kaliyuga dvāparayuga saṃdhilō kṛṣṇa dvaipāyanuḍugā puṭṭenu ani ceppabaḍinadi. brahma yokka mānasaputruḍaina vaśiṣṭuḍu brahmādēśamunanusariṃci nimiśāpādapamugānuṃḍi tarvāta mitrāvaraṇulaku puṭṭenu - brahmayokka mānasaputrulē ayina bhṛguvu modalaguvāru vāraṇayajñamaṃdu tirigi puṭṭinaṭlu ceppabaḍinadi. brahma mānasaputruḍaina sanatkumāruḍu kūḍa śivuni kumāruḍu skaṃduḍugā udbhaviṃcenu. ī prakāramugānē dakṣuḍu, nāraduḍu modalaguvāru maṟiyoka janma ettinaṭlu - maroka dēhamunu poṃdinaṭlu ceppabaḍinadi. vāraṃdaṟu āyā kāraṇamulacēta naṭlu dēhāṃtaramunu - punarjanmanu poṃdavalasi vaccenu. vīraṃdaṟu vēda vēdāṃtamulu bāgugā neṟiginavārē - brahma jñānulē, sākṣānmōkṣārhulē, punarjanma lēka uṃḍavalasinavārē - iṭlu ayina yeḍala brahmajñānulaku ī vartamāna dēhamu viḍicina tarvāta dēhāṃtara prāpti yunnadā lēdā ani saṃdēhamu - dēhāṃtaraprāpti kaladu ani pūrvapakṣavādamu - ī viṣayamulō siddhāṃtamu ī vidhamugānunnadi: - apāṃtaratamuḍagu purāṇa ṛṣi ceppina jñānulu lōkavyavasthakāraṇamugā paramēśvarunicēta āyā kāryamulalō niyōgiṃpabaḍuṭacēta vāri jñānamu valana prārabdakarma kṣīṇiṃcuvaraku vāru paina ceppina prakāramu uṃḍi vāri prārabdakarma anubhaviṃcuṭavalana kṣīṇiṃcagānē itara pratibaṃdhakamu lēviyu lēkuṃḍuṭa valana vartamāna dēhamu naśiṃcina tarvāta vāru kaivalyamunu - mōkṣamunu - poṃduduru. aṃducēta vāriki dēhāṃtaraprāpti lēdu anuṭa siddhamu).

  1. dēhāṃtara prāpti anagā - ” sthūlāt śarīrāt anyēṣāṃ liṃga śarīrāṇāṃ sūkṣmāṇāṃ sthūla śarīrānu kāriṇāṃ prāptiḥ.

(ī sthūla śarīramunu viḍici, itara sthūla śarīramunaku kāraṇamaina sūkṣma śarīramunu poṃduṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.