← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దేహము dēhamu

Original — తెలుగు
  1. బ్రహ్మణః దేవాది సృష్టివిధౌ పంచభూతాని సూత్రాణి. తతశ్చ పాంచ భౌతికో దేహః.

(దేహము మొదలగువాటిని సృష్టించుటలో బ్రహ్మకు పంచ భూతములు సూత్రములు. అందుచేత దేహము పాంచ భౌతికము - పంచభూతమయము, పంచభూతములతో తయారైనది.

  1. పంచభూతాత్మకతా దేహస్య కథ మిత్యతః ఆహ –

“పంచభూతాత్మకో దేహః పంచమండల పూరితః |

కాఠిన్యం పృధివీమేకాం పానీయం తద్ద్రవా కృతిః |

దీపనం చ భవేత్తే జః ప్రచారో వాయులక్షణం |

ఆకాశః సత్వతాం సర్వం జ్ఞాతవ్యం యోగమిచ్ఛుతా ||” (వారాహోపనిషత్)

(దేహము పంచభూతమయమని ఏట్లు చెప్పబడినది అనగా - దేహములోని కఠినమైన భాగము పృధివీ అంశము. దేహము లోని ద్రవముగానున్నది జలము. దేహము కాంతివంతముగా నుండుట అగ్నివలన. దేహములోని ప్రచారము వాయువువలన, ఆకాశము దేహమంతటను వ్యాపించి యున్నది. ఈ విషయము యోగాభ్యాసకులు తెలుసుకొనవలెను).

  1. దేహప్రవిభక్త పంచభూతాంశాః యావన్ని క్షీయంతే తావదవికలో దేహో భవతి, తత్ క్షయేతు వికృతిమేతి ఇత్యాహః:-

“తత్పృధ్వీమండలే క్షీణే వలిరాయతి దేహినాం |

తద్వ దాపోగణా వాయే కేశాస్యుః పాండవాః క్రమాత్ |

తేజక్షయే క్షుథాకాంతిర్నశ్యతే మారుతక్షయే |

వేపధుః సంభవేన్నిత్యం నాభాసో నైవజీవతి |

ఇత్థం భూతక్షయాన్నిత్యం జీవితః భూతధారణం ||“. (వరాహోపనిషత్)

(దేహములో వ్యాపించియున్న పంచభూతములయొక్క అంశలు (పాళ్ళు) క్షీణించనంతకాలము దేహము వికలము కాదు. పంచభూతముల అంశలు క్షీణించినంతనే దేహము వికృతమగును - మార్పునొందును. ఈ విషయమును గుఱించి వరాహోపనిషత్తులో ఇట్లు చెప్పబడినది : - పృధివీ అంశ క్షీణించినంతనే జుత్తు తెల్లనగును; అగ్ని అంశ క్షీణించిన దేహకాంతి, ఆకలితగ్గును. వాయువు అంశ క్షీణించిన దేహములో వణుకు కలుగును. ఆకాశాంశము క్షీణించిన మరణించును. ఈ ప్రకారము పంచభూతములు శరీరమును ధరించియున్నవి).

  1. ” అష్ట ప్రకృతయః - మూల ప్రకృతిః, మహదహంకారౌ, పంచతన్మాత్రాణి -, త్రిగుణాః (సత్వరజస్తమోగుణః), ఏకాదశేంద్రియాణి, పంచమహాభూతాని (షోఢశవికారాః) ఏతేషాం సర్వేషాం సంఘాతో దేహః“.

(అష్ట ప్రకృతులు (అనగా మూలప్రకృతి, మహత్తత్వము, అహంకారము, పంచ తన్మాత్రలు - అనగా సూక్ష్మ రూపములోనున్న పంచభూతములు) -, త్రిగుణములు (అనగా సత్వగుణము, రజోగుణము, తమోగుణము), పదకొండు ఇంద్రియములు - (అనగా జ్ఞానేంద్రియములు అయిదు, అంతరేంద్రియమైన మనస్సు, అయిదు మహాభూతములు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి). (ఇంద్రియములు పంచభూతములు కలిసి పదహారు వికారములు) వీటి అన్నింటి సంఘాతమే - కలియికయే - దేహము).

  1. “జీవుండు భూతేంద్రియమనోమయం బైన దేహంబు గలిగియుండు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 31 -1009)

  2. “సీ. పాంచ భౌతికమైన భవనంబు దేహంబు, పురుషుడు దీనిలో బూర్వకర్మ

వశమున నొకవేళ వర్తించు, దీపించు, దఱియైన నొకవేళ దలగిపోవు

జెడెనేని దేహంబు సెడుగాని పురుషుడు సెడడాతని కింత సేటులేదు

పురుషుని దేహ పుంజంబునకు వేఱుగాని ఏకత్వంబు గానరాదు

ఆ. దారువుల వెలుంగు దహనుని కైవడి,

గాయముల చరించు గాలిభంగి

నాళలీనమైన నభము చాడ్పున వేఱు

తెలియవలయు దేహి దేహములకు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 2 - 51)

  1. మాంసా స్వక్పూయ విణ్మూత్ర స్నాయు మజ్జాస్థి సం యుతే |

దేహేచే త్ప్రీతిమాన్ మూఢో భవితా నరకేపిసః ||”

(మాంసము, మూత్రము, స్నాయువు, మజ్జా, అస్థి మొదలగు వాటితో కూడినది దేహము. అట్టి దేహము మీద ప్రీతి గలవాడు నరకమును పొందును).

  1. “శరీరస్య విణ్మూత్రస్వేద శ్లేష్మాది భస్తికా రూపత్వం, త్వక్చర్మ మాంస రుధిర మేధో (అ)స్థిమజ్జాద్య శుద్ధాత్మకత్వం, వటలాంతతోయ జల బుద్బుదాదివత్ ప్రతిక్షణం వినాశ భయచకితత్వం, ఆధ్యాత్మికాది దైవికాధి భౌతికతాపత్రయ పరీతత్వాత్ దుఃఖాత్మకత్వం, సుషుప్త మూర్చ్ఛాదిషు చేతనా రాహిత్యాత్, ఘటకుడ్య కాష్ట లోష్టాది సమత్వంచ అత ఏవ నిత్య శుద్ధ బుద్ధ ముక్తాత్మభిన్నం ఏవం రూపం శరీరం కరణం భోక్త్య భోగ్య రూపంచ అనాత్మత్వేయో జానాతి సక్షేత్రజ్ఞః”.

(శరీరము విణ్మూత్రములు, చమట, శ్లేష్మము, మొదలగునవి భస్త్రినవలె కలిగియుండునదిన్నీ, చర్మము,మాంసము, రక్తము, మేధస్సు, ఎముకలు, మజ్జమొదలగు అశుద్ధవస్తువులుకలదిన్నీ, కుండలోని నీటిబుడగలు మొదలగువాటివలె క్షణ క్షణము నశించునను భయాందోళనతో నిండియున్నదిన్నీ, ఆధ్యాత్మికము, ఆధిదైవికము, ఆధిభౌతికము అను మూడు విధములగు తాపత్రయముగలదగుటచేత దుఃఖము కలుగచేయునదనిన్నీ, సుషుప్తి, మూర్చ, మొదలగు చైతన్యములేని అవస్థలుగల కుండ, కఱ్ఱ, ఱాయి మొదలగువాటితో సమానమైనదిన్నీ, ఈ కారణములవలననే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైన ఆత్మ స్వరూపముకన్న భిన్నమైనది యగు శరీరము భోక్త భోగ్యము తానే యగుటచేత అనాత్మయని ఎవడు దీనిని తెలుసుకొనునో వాడే క్షేత్రజ్ఞుడు - (శరీరము క్షేత్రము - దానిని తెలుసుకొనినవాడు క్షేత్రజ్ఞుడు) క్షేత్రమగు శరీరమును, దాని తత్వమును తెలిసిన వాడు - పండించు భూమి సారమును తెలిసిన కృషీలుడు వలె).

  1. పంచభూతాత్మకో దేహ స్త్రి దోషస్సప్త ధాతవః |

త్రిగుణానేక వికౄతిరనేకముల సంచయః

తాపత్రయానుభవీచ భూతాత్మా క్షణభంగురః |

దేవతా పిత్రుదైతేయ నరపశ్వాది భేదవాన్ |

జరామరణ జన్మాదిమహాదుఃఖైక భాజనః |

కాలకర్మ గుణాధీనో జాగ్రత్స్వప్న సుషుప్తిషు |

విశేషతో మంచ వానాం దేహో దుఃఖైవ భాజనం |

ప్రాణేన ధ్రియతే నిత్యం వాయునేవ బలాహకః ||“. (చికిత్సాసార సంగ్రహము)

(ఈ దేహము ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృధ్వి అను పంచభూతములు కలిగినది. కఫము, వాతము, పైత్యము అను మూడు దోషములు కలది, ఏడు ధాతువులు కలది, సత్వ రజస్తమోగుణములు మూడు గలది. అనేక వికృతులు (మార్పులు) చెందునది; అనేకమలములతో నిండియుండునది. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికములను మూడువిధముల తాపముగలది, క్షణములో నశించునది; దేవతులు, పితరులు, దైత్యులు నరులు, పశువులు మొదలగు జన్మ భేదములు గలది. జననము ముసలితనము, మరణము వలన కలుగు అనేక దుఃఖములననుభవించునది; జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ అను మూడు అవస్థలయందును, కాల, కర్మ, గుణముల ప్రభావమునకు వశమై యుండునది. ముఖ్యముగా మానవుల శరీరము దుఃఖమునే అనుభవించునది; ప్రాణముచేత నడపబడుచున్నది).

  1. “దశద్వారపురం దేహం దశనాడి మహాపథన |

దశ భిర్వాయుభిర్వ్యాప్తం, దశేంద్రియ పరిచ్ఛదం |

షఢాధారాప వరకం, షడన్వయ మహావనం |

చతుః పీఠ సమాకీర్ణం చతురామ్నాయ దీపకం |

బిందునాద మహాలింగం, శివశక్తి నికేతనం |

దేహం శివాలయం ప్రోక్తంసిద్ధి దం సర్వ దేహినాం ||“. (యోగశిఖోపనిషత్)

(దేహము పదిద్వారములుగల పురము, పదినాడులు సంచరించు ప్రదేశము. ప్రాణవాయువులు అయిదు. ఉపవాయువులు అయిదు. అంతటా వ్యాపించుయుండునది; అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు కర్మేంద్రియములు గలది, ఆరు కమలములు - (నాడీ చక్రములు) - కలది; నాలుగు పీఠములు కలది, నాలుగు వేదములను ప్రకాశింపచేయునది; బిందువు, నాదముతోనుండు సూక్ష్మ శరీరము కలది, శివుని శక్తికి నిలయమైనది - సిద్ధి నిచ్చునది). (దేహములోనున్న జీవుడు భగవదన్శ. అదియున్న దేహము దేవుని ఆలయము - అందుచేత దేహము దేవాలయము).

  1. “ఆధారే కరణే దోషా నవోచాత్ భోక్తృ భోగయోః |

భోగాది కరణం దేహస్తస్య దోషా ఇమేస్ఫుటాః |

అస్థి చర్మస్నాయు మజ్జా మాంస శుక్లోదయా (అ)ఖిలాః |

భీభత్సా కారణేష్వేషు మజ్జతా భుజ్యతే కథం |

విణ్మూత్ర ఖాతే మగ్నస్సన్ భుంక్తే కో(అ)పి నబుద్ధిమాన్ |

- - చిత్తే(అ)పి బహవో దోషాః వర్తం తేహి నిరంతరం |

కామక్రోధౌ లాభమోహౌ విషాదేర్ష్యే భయాదయః |

యే సంత్యేతైర్గ్రస్త చిత్తే భోగినాం కిం సుఖం భవేత |

- - ఉత్పన్న ధ్వంసినో యద్వత్ స్యుః దశమ శకాదయః |

తదైవ సర్వ భోక్తారో మ్రియంతే స్వాయుషః క్షయే |

భోక్త్యాణాం నశ్వరాణాం కో భోగః స్యాన్ మృత్యు చింతయా |

- - అభి గిర్యాదికం సర్వం నశ్వరం కిముతే రత్ |

భోగకాలేకృతం కర్మ భూయోజన్మద దాతి హి ||“. (అనుభూతిప్రకాశయాం)

(భోగాదికరణమైన దేహముయొక్క దోషములు ఇట్లు చెప్పబడినవి : - అస్థి, చర్మము, స్నాయువు, మజ్జా, మాంసము, శుక్లము - వీటిని కలుగచేయునది. విణ్మూత్రములతో కూడియున్నది. మనసులో కూడా దోషములున్నవి - కామము, క్రోధము, లోభము, మోహము, విషాదము, ఈర్ష్య, భయము మొదలగునవి మానసికదోషములు. ఇటువంటి దోషములు గల మనస్సు వలన ఏమి సుఖము ? మశకము మొదలగునవి పుట్టుచు చనిపోవుచున్నవి. సమస్తమైన వారు వారి ఆయువు క్షీణించగనే చనిపోవుదురు. ఇట్లు మృత్యువు ఉన్నదను చింతగలవారికి - ఏప్పుడైనా నశించక తప్పని స్వభావముగలవారికి శరీరము వలన ఏమి భోగము కలుగును ? భోగకాలమందు చేయు కర్మ మరల జన్మను కలిగించును. ఇటువంటిది దేహము. దీని వలన ఏమి సుఖము అనుభవమగును, ఏమి భోగము అనుభవమగును ?).

  1. “వ. దేహంబు నిత్యంబు కాదు, తోడరాదు, మృతంబైన దేహంబును శునకాదులు భక్షించును, దేహికర్మంబులాచరించి, కర్మబద్ధుండయి గ్రమ్మఱం గర్మాను కూలంబైన దేహంబు దాల్చు.” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 7 - 241)

  2. జాతస్య మరణం ధ్రువం (పుట్టినదానికి మరణము తప్పదు).

“పోకన్మానదు ప్రాణమె తతనువున్ పోషించి రక్షించినన్”. (మానసబోధ)

  1. “యతో భూతక్షయతో దేహః క్షీయతే అతోనిత్యం దేహస్య జీవితం ప్రతితత్తద్భూతధారణం కర్తవ్యం.”

(దేహము పంచభూతమయమగుటచేత దేహములోని భూతముల అంశ క్షీణించుటచేత దేహము క్షీణించును. కనుక దేహము జీవించియుండుటకు ఆ భూతముల అంశ ఉండునట్లు చేయవలయును).

  1. “యావత్పవనో నివసతి దేహే తావత్పృచ్ఛతి కుశలం గేహి |

గతి సతివా యే దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే||“. (భజగోవిందం)

(దేహములో ప్రాణమున్నంతవఱకే ఇంటిలో గౌరవము - దేహమునుండి ప్రాణము పోయినచో తన భార్య కూడ ఆ మృతదేహమును గుఱించి భయపడును).

  1. “క. దేహము కారాగేహము

మోహము నిగళంబు, రాగ ముఖరంబులు రిపు

వ్యూహములు; భక్తితో ని

న్నూహింపనియంత దడేవు నో కమలాక్షా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. 576)

  1. “అత్యంత మలినో దేహో దేహీ చాత్యంత నిర్మలః | - -”.

(దేహము మిక్కిలి మలినమైనది - అనేకవిధములైన మలములు - దోషములు - కలది - దేహి - దేహముగలవాడు, జీవాత్మ - ఏ విధమైన దోషములు లేనివాడు).

  1. :దేహ రాహిత్య లక్షణమే విదేహముక్తి“.

(ఇటుపైని దేహము లేకుండుటయే - జన్మ లేకపోవుటయే విదేహముక్తి - వినా + దేహం).

  1. “దిహ ఉపచయే” ఇతి ఉపచయ రూపాః దేహః; వినాశ స్వభావాః, ఉపచయాత్మకాః ఘటాదయః అంతవం తో దృష్టాః నిత్యస్య శరీరిణః కర్మ ఫల భోగార్ధ తయా భూత సంఘాత రూపాః; దేహాః కర్మావసాన వినాశినః - ఉపచయ రూపాః సావయవాః ఇత్యర్థః”

(దేహము అను మాట’ దిహ’ అను మాటనుండి పుట్టినది. ఆ మాటకు అర్ధము ఉపచయములు. అందుచేత దేహములు అనగా ఉపచయములు గలవి - అవయవములు గలది; ఘటము మొదలగునవి. అది నశించుచుండుట మనకు తెలిసిన విషయమే. దేహముగలవాడు దేహి. దేహికి కర్మఫలమనుభవించుటకు భూతముల సంఘాతమువలన - కలియక వలన - రూపము కలిగియున్నవి. దేహిచేసిన కర్మలఫలము ఆ దేహముతో అనుభవించగనే నశించును).

  1. కర్మ స్వరూపము -

  2. దహ్యతే ఇతి దేహః (దహించబడునది కనుక దేహమని చెప్పబడినది).

దేహియగు జీవుడు దేహమును విడిచిన తర్వాత దేహము కుళ్ళిపోవును కనుక దహించ బడుచున్నది. (లేక పూడ్చబడుచున్నది).

  1. “అంతవంత ఇమే దేహా నిత్య స్యోక్తాః శరీరిణిః | - -” (శ్రీమద్భగవద్గీత - 2 - 17)

(శాశ్వతుడైనటువంటి - అంతము లేనటువంటి దేహి యొక్క (జీవుని యొక్క) దేహములు (ఎన్ని దేహములను పొందినను) అంతము చేందునవియే - నశించునవియే).

“వాసాంసి జీర్ణాని యథావిహాయ నవాని గృహ్లాతి సరో (అ)పరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సం యాతి నవాని దేహీ ||”.

(శ్రీమద్భగవద్గీత - 2 - 21)

నరుడు జీర్ణించిన - చినిగిపోయి పాడైఇపోయిన - వస్త్రములను విడిచిపెట్టి కొత్త బట్టలను ధరించునట్లు జీర్ణించిపోయిన శరీరమును - రోగముచేగాని, వార్ధక్యముచేగాని, జీవుడు నివసించుటకు ఉపచరించని శరీరమును - దేహమును - జీవుడు విడిచిపెట్టి ఇంకొక శరీరమును - ధరించును).

” దేహినో (అ)స్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా| తథా దేహాంతరప్రాప్తిః - - - (శ్రీమద్భగవద్గీత - 2 - 13).

(ప్రస్తుత దేహములో ఆత్మ - జీవుడు - ఉన్నపుడు ఆ దేహమునకు కౌమారము, యౌవనము, ముసలితనము అను మార్పులు ఎట్లు కలుగుచుండునో ఆ ప్రకారముగానే జీవుడు ఈ దేహమును వదలి ఇంకొక దేహమును పొందు - జీవుని దేహములో మార్పులు కలుగును).

  1. “ఈ దేహి దేహంబు ద్రవ్య జ్ఞానక్రియాత్మకంబై న దేహికి వివిధ క్లేశ సంతాపంబులం జేయుచుండు -”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 15 - 459)

  1. “సీ. పాంచ భౌతికమైన భవనంబు దేహంబు, పురుషుడు దీనిలో బూర్వ కర్మ

వశమున నొకవేళ వర్తించు దీపించు దఱియైన నొకవేళ దలగిపోవు

జెడెనేని దేహంబు సెడుగాని పురుషుండు సెడడాతనికిని నింత సేటులేదు

పురుషునికిని దేహ పుంజంబునకు వేఱుగాని యేకత్వంబు గానరాదు

ఆ. దారువుల వెలుంగు దహనునికైవడి

గాయము జరించు గాలి భంగి

నాళలీనమైన నభము చాడ్పున వేఱు

దెలియవలయు దేహి దేహములకు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 2 - 51)

Transliteration
  1. brahmaṇaḥ dēvādi sṛṣṭividhau paṃcabhūtāni sūtrāṇi. tataśca pāṃca bhautikō dēhaḥ.

(dēhamu modalaguvāṭini sṛṣṭiṃcuṭalō brahmaku paṃca bhūtamulu sūtramulu. aṃducēta dēhamu pāṃca bhautikamu - paṃcabhūtamayamu, paṃcabhūtamulatō tayārainadi.

  1. paṃcabhūtātmakatā dēhasya katha mityataḥ āha –

“paṃcabhūtātmakō dēhaḥ paṃcamaṃḍala pūritaḥ |

kāṭhinyaṃ pṛdhivīmēkāṃ pānīyaṃ taddravā kṛtiḥ |

dīpanaṃ ca bhavēttē jaḥ pracārō vāyulakṣaṇaṃ |

ākāśaḥ satvatāṃ sarvaṃ jñātavyaṃ yōgamicchutā ||” (vārāhōpaniṣat)

(dēhamu paṃcabhūtamayamani ēṭlu ceppabaḍinadi anagā - dēhamulōni kaṭhinamaina bhāgamu pṛdhivī aṃśamu. dēhamu lōni dravamugānunnadi jalamu. dēhamu kāṃtivaṃtamugā nuṃḍuṭa agnivalana. dēhamulōni pracāramu vāyuvuvalana, ākāśamu dēhamaṃtaṭanu vyāpiṃci yunnadi. ī viṣayamu yōgābhyāsakulu telusukonavalenu).

  1. dēhapravibhakta paṃcabhūtāṃśāḥ yāvanni kṣīyaṃtē tāvadavikalō dēhō bhavati, tat kṣayētu vikṛtimēti ityāhaḥ:-

“tatpṛdhvīmaṃḍalē kṣīṇē valirāyati dēhināṃ |

tadva dāpōgaṇā vāyē kēśāsyuḥ pāṃḍavāḥ kramāt |

tējakṣayē kṣuthākāṃtirnaśyatē mārutakṣayē |

vēpadhuḥ saṃbhavēnnityaṃ nābhāsō naivajīvati |

itthaṃ bhūtakṣayānnityaṃ jīvitaḥ bhūtadhāraṇaṃ ||“. (varāhōpaniṣat)

(dēhamulō vyāpiṃciyunna paṃcabhūtamulayokka aṃśalu (pāḷḷu) kṣīṇiṃcanaṃtakālamu dēhamu vikalamu kādu. paṃcabhūtamula aṃśalu kṣīṇiṃcinaṃtanē dēhamu vikṛtamagunu - mārpunoṃdunu. ī viṣayamunu guṟiṃci varāhōpaniṣattulō iṭlu ceppabaḍinadi : - pṛdhivī aṃśa kṣīṇiṃcinaṃtanē juttu tellanagunu; agni aṃśa kṣīṇiṃcina dēhakāṃti, ākalitaggunu. vāyuvu aṃśa kṣīṇiṃcina dēhamulō vaṇuku kalugunu. ākāśāṃśamu kṣīṇiṃcina maraṇiṃcunu. ī prakāramu paṃcabhūtamulu śarīramunu dhariṃciyunnavi).

  1. ” aṣṭa prakṛtayaḥ - mūla prakṛtiḥ, mahadahaṃkārau, paṃcatanmātrāṇi -, triguṇāḥ (satvarajastamōguṇaḥ), ēkādaśēṃdriyāṇi, paṃcamahābhūtāni (ṣōḍhaśavikārāḥ) ētēṣāṃ sarvēṣāṃ saṃghātō dēhaḥ”.

(aṣṭa prakṛtulu (anagā mūlaprakṛti, mahattatvamu, ahaṃkāramu, paṃca tanmātralu - anagā sūkṣma rūpamulōnunna paṃcabhūtamulu) -, triguṇamulu (anagā satvaguṇamu, rajōguṇamu, tamōguṇamu), padakoṃḍu iṃdriyamulu - (anagā jñānēṃdriyamulu ayidu, aṃtarēṃdriyamaina manassu, ayidu mahābhūtamulu ākāśamu, vāyuvu, agni, jalamu, bhūmi). (iṃdriyamulu paṃcabhūtamulu kalisi padahāru vikāramulu) vīṭi anniṃṭi saṃghātamē - kaliyikayē - dēhamu).

  1. “jīvuṃḍu bhūtēṃdriyamanōmayaṃ baina dēhaṃbu galigiyuṃḍu” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 31 -1009)

  2. “sī. pāṃca bhautikamaina bhavanaṃbu dēhaṃbu, puruṣuḍu dīnilō būrvakarma

vaśamuna nokavēḷa vartiṃcu, dīpiṃcu, daṟiyaina nokavēḷa dalagipōvu

jeḍenēni dēhaṃbu seḍugāni puruṣuḍu seḍaḍātani kiṃta sēṭulēdu

puruṣuni dēha puṃjaṃbunaku vēṟugāni ēkatvaṃbu gānarādu

ā. dāruvula veluṃgu dahanuni kaivaḍi,

gāyamula cariṃcu gālibhaṃgi

nāḷalīnamaina nabhamu cāḍpuna vēṟu

teliyavalayu dēhi dēhamulaku” (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 2 - 51)

  1. māṃsā svakpūya viṇmūtra snāyu majjāsthi saṃ yutē |

dēhēcē tprītimān mūḍhō bhavitā narakēpisaḥ ||”

(māṃsamu, mūtramu, snāyuvu, majjā, asthi modalagu vāṭitō kūḍinadi dēhamu. aṭṭi dēhamu mīda prīti galavāḍu narakamunu poṃdunu).

  1. “śarīrasya viṇmūtrasvēda ślēṣmādi bhastikā rūpatvaṃ, tvakcarma māṃsa rudhira mēdhō (a)sthimajjādya śuddhātmakatvaṃ, vaṭalāṃtatōya jala budbudādivat pratikṣaṇaṃ vināśa bhayacakitatvaṃ, ādhyātmikādi daivikādhi bhautikatāpatraya parītatvāt duḥkhātmakatvaṃ, suṣupta mūrcchādiṣu cētanā rāhityāt, ghaṭakuḍya kāṣṭa lōṣṭādi samatvaṃca ata ēva nitya śuddha buddha muktātmabhinnaṃ ēvaṃ rūpaṃ śarīraṃ karaṇaṃ bhōktya bhōgya rūpaṃca anātmatvēyō jānāti sakṣētrajñaḥ”.

(śarīramu viṇmūtramulu, camaṭa, ślēṣmamu, modalagunavi bhastrinavale kaligiyuṃḍunadinnī, carmamu,māṃsamu, raktamu, mēdhassu, emukalu, majjamodalagu aśuddhavastuvulukaladinnī, kuṃḍalōni nīṭibuḍagalu modalaguvāṭivale kṣaṇa kṣaṇamu naśiṃcunanu bhayāṃdōḷanatō niṃḍiyunnadinnī, ādhyātmikamu, ādhidaivikamu, ādhibhautikamu anu mūḍu vidhamulagu tāpatrayamugaladaguṭacēta duḥkhamu kalugacēyunadaninnī, suṣupti, mūrca, modalagu caitanyamulēni avasthalugala kuṃḍa, kaṟṟa, ṟāyi modalaguvāṭitō samānamainadinnī, ī kāraṇamulavalananē nitya śuddha buddha mukta svarūpamaina ātma svarūpamukanna bhinnamainadi yagu śarīramu bhōkta bhōgyamu tānē yaguṭacēta anātmayani evaḍu dīnini telusukonunō vāḍē kṣētrajñuḍu - (śarīramu kṣētramu - dānini telusukoninavāḍu kṣētrajñuḍu) kṣētramagu śarīramunu, dāni tatvamunu telisina vāḍu - paṃḍiṃcu bhūmi sāramunu telisina kṛṣīluḍu vale).

  1. paṃcabhūtātmakō dēha stri dōṣassapta dhātavaḥ |

triguṇānēka vikṝtiranēkamula saṃcayaḥ

tāpatrayānubhavīca bhūtātmā kṣaṇabhaṃguraḥ |

dēvatā pitrudaitēya narapaśvādi bhēdavān |

jarāmaraṇa janmādimahāduḥkhaika bhājanaḥ |

kālakarma guṇādhīnō jāgratsvapna suṣuptiṣu |

viśēṣatō maṃca vānāṃ dēhō duḥkhaiva bhājanaṃ |

prāṇēna dhriyatē nityaṃ vāyunēva balāhakaḥ ||“. (cikitsāsāra saṃgrahamu)

(ī dēhamu ākāśamu, vāyuvu, agni, jalamu, pṛdhvi anu paṃcabhūtamulu kaliginadi. kaphamu, vātamu, paityamu anu mūḍu dōṣamulu kaladi, ēḍu dhātuvulu kaladi, satva rajastamōguṇamulu mūḍu galadi. anēka vikṛtulu (mārpulu) ceṃdunadi; anēkamalamulatō niṃḍiyuṃḍunadi. ādhyātmika, ādhibhautika, ādhidaivikamulanu mūḍuvidhamula tāpamugaladi, kṣaṇamulō naśiṃcunadi; dēvatulu, pitarulu, daityulu narulu, paśuvulu modalagu janma bhēdamulu galadi. jananamu musalitanamu, maraṇamu valana kalugu anēka duḥkhamulananubhaviṃcunadi; jāgradavastha, svapnāvastha, suṣuptyavastha anu mūḍu avasthalayaṃdunu, kāla, karma, guṇamula prabhāvamunaku vaśamai yuṃḍunadi. mukhyamugā mānavula śarīramu duḥkhamunē anubhaviṃcunadi; prāṇamucēta naḍapabaḍucunnadi).

  1. “daśadvārapuraṃ dēhaṃ daśanāḍi mahāpathana |

daśa bhirvāyubhirvyāptaṃ, daśēṃdriya paricchadaṃ |

ṣaḍhādhārāpa varakaṃ, ṣaḍanvaya mahāvanaṃ |

catuḥ pīṭha samākīrṇaṃ caturāmnāya dīpakaṃ |

biṃdunāda mahāliṃgaṃ, śivaśakti nikētanaṃ |

dēhaṃ śivālayaṃ prōktaṃsiddhi daṃ sarva dēhināṃ ||“. (yōgaśikhōpaniṣat)

(dēhamu padidvāramulugala puramu, padināḍulu saṃcariṃcu pradēśamu. prāṇavāyuvulu ayidu. upavāyuvulu ayidu. aṃtaṭā vyāpiṃcuyuṃḍunadi; ayidu jñānēṃdriyamulu, ayidu karmēṃdriyamulu galadi, āru kamalamulu - (nāḍī cakramulu) - kaladi; nālugu pīṭhamulu kaladi, nālugu vēdamulanu prakāśiṃpacēyunadi; biṃduvu, nādamutōnuṃḍu sūkṣma śarīramu kaladi, śivuni śaktiki nilayamainadi - siddhi niccunadi). (dēhamulōnunna jīvuḍu bhagavadanśa. adiyunna dēhamu dēvuni ālayamu - aṃducēta dēhamu dēvālayamu).

  1. “ādhārē karaṇē dōṣā navōcāt bhōktṛ bhōgayōḥ |

bhōgādi karaṇaṃ dēhastasya dōṣā imēsphuṭāḥ |

asthi carmasnāyu majjā māṃsa śuklōdayā (a)khilāḥ |

bhībhatsā kāraṇēṣvēṣu majjatā bhujyatē kathaṃ |

viṇmūtra khātē magnassan bhuṃktē kō(a)pi nabuddhimān |

- - cittē(a)pi bahavō dōṣāḥ vartaṃ tēhi niraṃtaraṃ |

kāmakrōdhau lābhamōhau viṣādērṣyē bhayādayaḥ |

yē saṃtyētairgrasta cittē bhōgināṃ kiṃ sukhaṃ bhavēta |

- - utpanna dhvaṃsinō yadvat syuḥ daśama śakādayaḥ |

tadaiva sarva bhōktārō mriyaṃtē svāyuṣaḥ kṣayē |

bhōktyāṇāṃ naśvarāṇāṃ kō bhōgaḥ syān mṛtyu ciṃtayā |

- - abhi giryādikaṃ sarvaṃ naśvaraṃ kimutē rat |

bhōgakālēkṛtaṃ karma bhūyōjanmada dāti hi ||“. (anubhūtiprakāśayāṃ)

(bhōgādikaraṇamaina dēhamuyokka dōṣamulu iṭlu ceppabaḍinavi : - asthi, carmamu, snāyuvu, majjā, māṃsamu, śuklamu - vīṭini kalugacēyunadi. viṇmūtramulatō kūḍiyunnadi. manasulō kūḍā dōṣamulunnavi - kāmamu, krōdhamu, lōbhamu, mōhamu, viṣādamu, īrṣya, bhayamu modalagunavi mānasikadōṣamulu. iṭuvaṃṭi dōṣamulu gala manassu valana ēmi sukhamu ? maśakamu modalagunavi puṭṭucu canipōvucunnavi. samastamaina vāru vāri āyuvu kṣīṇiṃcaganē canipōvuduru. iṭlu mṛtyuvu unnadanu ciṃtagalavāriki - ēppuḍainā naśiṃcaka tappani svabhāvamugalavāriki śarīramu valana ēmi bhōgamu kalugunu ? bhōgakālamaṃdu cēyu karma marala janmanu kaligiṃcunu. iṭuvaṃṭidi dēhamu. dīni valana ēmi sukhamu anubhavamagunu, ēmi bhōgamu anubhavamagunu ?).

  1. “va. dēhaṃbu nityaṃbu kādu, tōḍarādu, mṛtaṃbaina dēhaṃbunu śunakādulu bhakṣiṃcunu, dēhikarmaṃbulācariṃci, karmabaddhuṃḍayi grammaṟaṃ garmānu kūlaṃbaina dēhaṃbu dālcu.” (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 7 - 241)

  2. jātasya maraṇaṃ dhruvaṃ (puṭṭinadāniki maraṇamu tappadu).

“pōkanmānadu prāṇame tatanuvun pōṣiṃci rakṣiṃcinan”. (mānasabōdha)

  1. “yatō bhūtakṣayatō dēhaḥ kṣīyatē atōnityaṃ dēhasya jīvitaṃ pratitattadbhūtadhāraṇaṃ kartavyaṃ.”

(dēhamu paṃcabhūtamayamaguṭacēta dēhamulōni bhūtamula aṃśa kṣīṇiṃcuṭacēta dēhamu kṣīṇiṃcunu. kanuka dēhamu jīviṃciyuṃḍuṭaku ā bhūtamula aṃśa uṃḍunaṭlu cēyavalayunu).

  1. “yāvatpavanō nivasati dēhē tāvatpṛcchati kuśalaṃ gēhi |

gati sativā yē dēhāpāyē bhāryā bibhyati tasmin kāyē||“. (bhajagōviṃdaṃ)

(dēhamulō prāṇamunnaṃtavaṟakē iṃṭilō gauravamu - dēhamunuṃḍi prāṇamu pōyinacō tana bhārya kūḍa ā mṛtadēhamunu guṟiṃci bhayapaḍunu).

  1. “ka. dēhamu kārāgēhamu

mōhamu nigaḷaṃbu, rāga mukharaṃbulu ripu

vyūhamulu; bhaktitō ni

nnūhiṃpaniyaṃta daḍēvu nō kamalākṣā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. 576)

  1. “atyaṃta malinō dēhō dēhī cātyaṃta nirmalaḥ | - -”.

(dēhamu mikkili malinamainadi - anēkavidhamulaina malamulu - dōṣamulu - kaladi - dēhi - dēhamugalavāḍu, jīvātma - ē vidhamaina dōṣamulu lēnivāḍu).

  1. :dēha rāhitya lakṣaṇamē vidēhamukti”.

(iṭupaini dēhamu lēkuṃḍuṭayē - janma lēkapōvuṭayē vidēhamukti - vinā + dēhaṃ).

  1. “diha upacayē” iti upacaya rūpāḥ dēhaḥ; vināśa svabhāvāḥ, upacayātmakāḥ ghaṭādayaḥ aṃtavaṃ tō dṛṣṭāḥ nityasya śarīriṇaḥ karma phala bhōgārdha tayā bhūta saṃghāta rūpāḥ; dēhāḥ karmāvasāna vināśinaḥ - upacaya rūpāḥ sāvayavāḥ ityarthaḥ”

(dēhamu anu māṭa’ diha’ anu māṭanuṃḍi puṭṭinadi. ā māṭaku ardhamu upacayamulu. aṃducēta dēhamulu anagā upacayamulu galavi - avayavamulu galadi; ghaṭamu modalagunavi. adi naśiṃcucuṃḍuṭa manaku telisina viṣayamē. dēhamugalavāḍu dēhi. dēhiki karmaphalamanubhaviṃcuṭaku bhūtamula saṃghātamuvalana - kaliyaka valana - rūpamu kaligiyunnavi. dēhicēsina karmalaphalamu ā dēhamutō anubhaviṃcaganē naśiṃcunu).

  1. karma svarūpamu -

  2. dahyatē iti dēhaḥ (dahiṃcabaḍunadi kanuka dēhamani ceppabaḍinadi).

dēhiyagu jīvuḍu dēhamunu viḍicina tarvāta dēhamu kuḷḷipōvunu kanuka dahiṃca baḍucunnadi. (lēka pūḍcabaḍucunnadi).

  1. “aṃtavaṃta imē dēhā nitya syōktāḥ śarīriṇiḥ | - -” (śrīmadbhagavadgīta - 2 - 17)

(śāśvatuḍainaṭuvaṃṭi - aṃtamu lēnaṭuvaṃṭi dēhi yokka (jīvuni yokka) dēhamulu (enni dēhamulanu poṃdinanu) aṃtamu cēṃdunaviyē - naśiṃcunaviyē).

“vāsāṃsi jīrṇāni yathāvihāya navāni gṛhlāti sarō (a)parāṇi tathā śarīrāṇi vihāya jīrṇā nyanyāni saṃ yāti navāni dēhī ||”.

(śrīmadbhagavadgīta - 2 - 21)

naruḍu jīrṇiṃcina - cinigipōyi pāḍaiipōyina - vastramulanu viḍicipeṭṭi kotta baṭṭalanu dhariṃcunaṭlu jīrṇiṃcipōyina śarīramunu - rōgamucēgāni, vārdhakyamucēgāni, jīvuḍu nivasiṃcuṭaku upacariṃcani śarīramunu - dēhamunu - jīvuḍu viḍicipeṭṭi iṃkoka śarīramunu - dhariṃcunu).

” dēhinō (a)smin yathā dēhē kaumāraṃ yauvanaṃ jarā| tathā dēhāṃtaraprāptiḥ - - - (śrīmadbhagavadgīta - 2 - 13).

(prastuta dēhamulō ātma - jīvuḍu - unnapuḍu ā dēhamunaku kaumāramu, yauvanamu, musalitanamu anu mārpulu eṭlu kalugucuṃḍunō ā prakāramugānē jīvuḍu ī dēhamunu vadali iṃkoka dēhamunu poṃdu - jīvuni dēhamulō mārpulu kalugunu).

  1. “ī dēhi dēhaṃbu dravya jñānakriyātmakaṃbai na dēhiki vividha klēśa saṃtāpaṃbulaṃ jēyucuṃḍu -”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 15 - 459)

  1. “sī. pāṃca bhautikamaina bhavanaṃbu dēhaṃbu, puruṣuḍu dīnilō būrva karma

vaśamuna nokavēḷa vartiṃcu dīpiṃcu daṟiyaina nokavēḷa dalagipōvu

jeḍenēni dēhaṃbu seḍugāni puruṣuṃḍu seḍaḍātanikini niṃta sēṭulēdu

puruṣunikini dēha puṃjaṃbunaku vēṟugāni yēkatvaṃbu gānarādu

ā. dāruvula veluṃgu dahanunikaivaḍi

gāyamu jariṃcu gāli bhaṃgi

nāḷalīnamaina nabhamu cāḍpuna vēṟu

deliyavalayu dēhi dēhamulaku”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 2 - 51)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.