బలసి నిర్మలజల ప్రతిబింబుతుండైన దినకరుభంగి వర్తించునట్టి
యాత్మ ప్రకృతి గుణంబులయందు దగులువడి యహంకారమూఢులై తొడరి యేను
గడగి నిఖిలంబునకు నెల్ల గర్తనని ప్ర|సంగవశతను బ్రకృతదోషముల బొంది ||”
క. సురతిర్యజ్మనుజ స్థా
వరరూపములగుచు గర్మ వాసన చేతం
బరవైన మిశ్రయోనుల
దిరముగ జనియించి సంసృతిం గైకొని తాన్.
క. పూని చరించుచు విషయ
ధ్యానంబున జేసి స్వాప్నికార్థాగమ సం
ధానము రీతిన సత్పధ
మానసుడగుచున్ భ్రమించు మతి లోలుండై (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 27 - )
balasi nirmalajala pratibiṃbutuṃḍaina dinakarubhaṃgi vartiṃcunaṭṭi
yātma prakṛti guṇaṃbulayaṃdu daguluvaḍi yahaṃkāramūḍhulai toḍari yēnu
gaḍagi nikhilaṃbunaku nella gartanani pra|saṃgavaśatanu brakṛtadōṣamula boṃdi ||”
ka. suratiryajmanuja sthā
vararūpamulagucu garma vāsana cētaṃ
baravaina miśrayōnula
diramuga janiyiṃci saṃsṛtiṃ gaikoni tān.
ka. pūni cariṃcucu viṣaya
dhyānaṃbuna jēsi svāpnikārthāgama saṃ
dhānamu rītina satpadha
mānasuḍagucun bhramiṃcu mati lōluṃḍai (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 27 - )
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.