- దేనియందు ‘అహం’,’ మమ’ అను బుద్ధి కలుగునో అది స్థూల శరీరము - దాని యందు ప్రీతి
కలుగుటచేత అదియే - స్థూలశరీరమే ఆత్మ యను వాదము - స్థూల శరీరమునకు ఉపకారకములైన స్త్రీ,
పుత్ర, ధనాదులు ప్రీతి కలిగించు వస్తువులు - శరీరము గుఱించి అవి ప్రీతి కరములైనవి - అందుచేత
శరీరము - స్థూల శరీరము ఆత్మ. స్థూల దేహమునకు వస్త్ర భూషణములు, మజ్జన భోజనములు మొదలగునవి
ప్రీతికరములు. అందుచేత దేహము ఆత్మ - ఈ దేహాత్మవాదము ఈ క్రిందవిధముగా ఖండింపబడినది, -’ ఈ దేహము
నాది’ అనునప్పుడు దేహముకంటె ఇతరవస్తువు ఉన్నదనుమాట స్పష్టమే. స్థూలదేహమునకు జనన
మరణములున్నవి. ఆత్మకు జననమరణములు లేవు - అందుచేత దేహము ఆత్మ కాదు. జన్మకు ముందును,
మరణమునకు తరువాత స్థూలదేహములేదు - అందుచేత దేహము ఆత్మకాదు - జననమరణములకుముందు ఆత్మలేని
యడల పాపపుణ్య కర్మలకు ఫలము లేకయుండును, పాపపుణ్యములు చేయకుండగనే కష్ట, సుఖములు
కలుగుచుండవలెను. అట్లగుటలేదు - కాబట్టి దేహము ఆత్మకాదు. మనము తినిన అన్నము యొక్క స్థూలభాగము
పురీషముగాను, సూక్ష్మభాగము మాంసముగాను, అతిసూక్ష్మభాగము మనస్సుగాను పరిణమించును. మనము త్రాగిన
జలముయొక్క స్థూలభాగము మూత్రముగాను, సూక్ష్మభాగము రక్తముగాను అతిసూక్ష్మభాగము ప్రాణముగాను
మారును - ఈ రీతిగా అన్నము యొక్కయు, జలము యొక్కయు పరిణామములైన పురీషమూత్రములు ఆత్మకావు -కనుక
అన్నముయొక్కయు, ఉదకముయొక్కయు పరిణామములైన మాంస రక్తములతోకూడియున్న మనస్సు, ప్రాణముమొదలైనవిగల
స్థూలశరీరము ఆత్మకాదు - కంటికి కనబడు వస్తువులన్నియు దృశ్యములు - శరీరము కంటికి కనబడునది
- ఆత్మ కంటికి కనబడదు. అందుచేత దేహము ఆత్మకాదు).
Transliteration
- dēniyaṃdu ‘ahaṃ’,’ mama’ anu buddhi kalugunō adi sthūla śarīramu -
dāni yaṃdu prīti kaluguṭacēta adiyē - sthūlaśarīramē ātma yanu vādamu -
sthūla śarīramunaku upakārakamulaina strī, putra, dhanādulu prīti
kaligiṃcu vastuvulu - śarīramu guṟiṃci avi prīti karamulainavi -
aṃducēta śarīramu - sthūla śarīramu ātma. sthūla dēhamunaku vastra
bhūṣaṇamulu, majjana bhōjanamulu modalagunavi prītikaramulu. aṃducēta
dēhamu ātma - ī dēhātmavādamu ī kriṃdavidhamugā khaṃḍiṃpabaḍinadi, -’ ī
dēhamu nādi’ anunappuḍu dēhamukaṃṭe itaravastuvu unnadanumāṭa spaṣṭamē.
sthūladēhamunaku janana maraṇamulunnavi. ātmaku jananamaraṇamulu lēvu -
aṃducēta dēhamu ātma kādu. janmaku muṃdunu, maraṇamunaku taruvāta
sthūladēhamulēdu - aṃducēta dēhamu ātmakādu - jananamaraṇamulakumuṃdu
ātmalēni yaḍala pāpapuṇya karmalaku phalamu lēkayuṃḍunu, pāpapuṇyamulu
cēyakuṃḍaganē kaṣṭa, sukhamulu kalugucuṃḍavalenu. aṭlaguṭalēdu - kābaṭṭi
dēhamu ātmakādu. manamu tinina annamu yokka sthūlabhāgamu purīṣamugānu,
sūkṣmabhāgamu māṃsamugānu, atisūkṣmabhāgamu manassugānu pariṇamiṃcunu.
manamu trāgina jalamuyokka sthūlabhāgamu mūtramugānu, sūkṣmabhāgamu
raktamugānu atisūkṣmabhāgamu prāṇamugānu mārunu - ī rītigā annamu
yokkayu, jalamu yokkayu pariṇāmamulaina purīṣamūtramulu ātmakāvu -kanuka
annamuyokkayu, udakamuyokkayu pariṇāmamulaina māṃsa raktamulatōkūḍiyunna
manassu, prāṇamumodalainavigala sthūlaśarīramu ātmakādu - kaṃṭiki
kanabaḍu vastuvulanniyu dṛśyamulu - śarīramu kaṃṭiki kanabaḍunadi - ātma
kaṃṭiki kanabaḍadu. aṃducēta dēhamu ātmakādu).
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.