దేహో అస్యాస్తీతి దేహీ - ఆత్మా. (దేహము కలవాడు, ఆత్మ, జీవుడు)
దేహే స్థూల సూక్ష్మౌ విద్యతే అస్య స దేహీ - చిదాత్మా -
(స్థూలదేహము, సూక్ష్మదేహము అను రెండు దేహములు గలవాడు - చిదాత్మ - (చైతన్యముగల ఆత్మ)).
(దేహము కలవాడు, దేహమును ధరించువాడు, శరీరము గలవాడు - శరీరమును ధరించువాడు).
(దేహముకన్న వేఱైనవాడు ; దేహము గలవాడు; దేహమునకు సాక్షి అయినవాడు).
(దేహమును అభిమానించువాడు - దేహమునందు గూఢముగానుండి దానిని అభిమానించువాడు).
దేహో అహం ఇతి మన్య మానః, జీవః. (దేహము నేను అని తలచువాడు; జీవుడు - జీవము గలవాడు)
“దేహే వర్తమానం - మహదాది విశేషైః ఆరబ్ద దేవమనుష్యాది దేహసం బంధినం.” (శ్రీమాన్ రామానుజః)
(దేహమందుండువాడు - మహత్తత్వము మొదలగువాటిచే ఆరంభింపబడిన దేవతులు, మనుష్యులుమొదలగు వారి దేహముతో సంబంధము గలవాడు).
యః కర్మ కర్తా జీవః స ఏవ దేహీ, నాన్యః. (కర్మ చేయువాడు జీవుడు. అతనే దేహి, ఇంకొకడుకాడు)
“దేహాః సర్వే త్రికాలస్థా జగన్మండలవర్తినః |
అస్యసంతీతి దేఈస్యాత్ తస్తైకస్యాత్మ నో విభోః |
బ్రహ్మాది స్థావరాతేషు శరీరేష్వ ఖిలేష్వపి |
వ్యాపినౌ నాస్తి భేదస్య గంధ ఇత్యపి దర్శితం ||“. (గీతాభావప్రకాశము - 2 - 120, 121)
(దేహములు కలవాడు కనుక దేహి - త్రికాలములందును జగత్తు అంతటిలోను నుండు దేహములు కలవాడు కనుక దేహి అని చెప్పబడుచున్నాడు - అన్నికాలములందు, అన్ని దేహములందు ఒక్కడే పరమాత్మ జీవరూపములో నున్నాడు కనుక ఆ దేహములన్నియు అతనివే - బ్రహ్మ మొదలు, స్థావరములవరకు గల దేహములందు వ్యాపించియున్న ఆత్మ దేహి - ఒక్కడే, భేదములేదు).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 52)
ప్రాణి (ప్రాణము గలవాడు).
“సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః |
నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమ వ్యయం ||“. (శ్రీమద్బ్గవద్గీత - 14 - 5)
(సత్వము, రజస్సు, తమస్సు అను త్రిగుణములు ప్రకృతినుండికలిగినవి. ఇవి దేహిని దేహమందు బందించుచున్నవి).
“సీ. భూపాలకోత్తమ ! భూతహితుండు సుజ్ఞాన స్వరూపకుడైనయట్టి
ప్రాణికి దేహ సంబంధమెట్లగునన్న మహినొప్పు నీశ్వరమాయలేక
కలుగదు; నిద్రలో కలలోన దోచిన దేహబంధంబుల తెఱగువలెను హరియోగమాయామహత్వంబునం బాంచ భౌతిక దేహ సంబంధుడగుచు
తే. నట్టి మాయాగుణంబుల నాత్మ యోలి
బాల్య కౌమార యౌవన భావములను
నర సుపర్వాదిమూర్తుల బొరసి, యేను
నాయదివి ” యను సంసారమాయదగిలి”
వ. వర్తించు “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 9 - 223)
జచ్చుచునుంట జూచెదరు చావకమానెడివారి భంగినీ
చచ్చినవానికేడ్చెదరు, చావున కొల్లక డాగ వచ్చునే - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 2 - 46)
dēhō asyāstīti dēhī - ātmā. (dēhamu kalavāḍu, ātma, jīvuḍu)
dēhē sthūla sūkṣmau vidyatē asya sa dēhī - cidātmā -
(sthūladēhamu, sūkṣmadēhamu anu reṃḍu dēhamulu galavāḍu - cidātma - (caitanyamugala ātma)).
(dēhamu kalavāḍu, dēhamunu dhariṃcuvāḍu, śarīramu galavāḍu - śarīramunu dhariṃcuvāḍu).
(dēhamukanna vēṟainavāḍu ; dēhamu galavāḍu; dēhamunaku sākṣi ayinavāḍu).
(dēhamunu abhimāniṃcuvāḍu - dēhamunaṃdu gūḍhamugānuṃḍi dānini abhimāniṃcuvāḍu).
dēhō ahaṃ iti manya mānaḥ, jīvaḥ. (dēhamu nēnu ani talacuvāḍu; jīvuḍu - jīvamu galavāḍu)
“dēhē vartamānaṃ - mahadādi viśēṣaiḥ ārabda dēvamanuṣyādi dēhasaṃ baṃdhinaṃ.” (śrīmān rāmānujaḥ)
(dēhamaṃduṃḍuvāḍu - mahattatvamu modalaguvāṭicē āraṃbhiṃpabaḍina dēvatulu, manuṣyulumodalagu vāri dēhamutō saṃbaṃdhamu galavāḍu).
yaḥ karma kartā jīvaḥ sa ēva dēhī, nānyaḥ. (karma cēyuvāḍu jīvuḍu. atanē dēhi, iṃkokaḍukāḍu)
“dēhāḥ sarvē trikālasthā jaganmaṃḍalavartinaḥ |
asyasaṃtīti dēīsyāt tastaikasyātma nō vibhōḥ |
brahmādi sthāvarātēṣu śarīrēṣva khilēṣvapi |
vyāpinau nāsti bhēdasya gaṃdha ityapi darśitaṃ ||“. (gītābhāvaprakāśamu - 2 - 120, 121)
(dēhamulu kalavāḍu kanuka dēhi - trikālamulaṃdunu jagattu aṃtaṭilōnu nuṃḍu dēhamulu kalavāḍu kanuka dēhi ani ceppabaḍucunnāḍu - annikālamulaṃdu, anni dēhamulaṃdu okkaḍē paramātma jīvarūpamulō nunnāḍu kanuka ā dēhamulanniyu atanivē - brahma modalu, sthāvaramulavaraku gala dēhamulaṃdu vyāpiṃciyunna ātma dēhi - okkaḍē, bhēdamulēdu).
(śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 52)
prāṇi (prāṇamu galavāḍu).
“satvaṃ rajastama iti guṇāḥ prakṛti saṃbhavāḥ |
nibadhnaṃti mahābāhō dēhē dēhinama vyayaṃ ||“. (śrīmadbgavadgīta - 14 - 5)
(satvamu, rajassu, tamassu anu triguṇamulu prakṛtinuṃḍikaliginavi. ivi dēhini dēhamaṃdu baṃdiṃcucunnavi).
“sī. bhūpālakōttama ! bhūtahituṃḍu sujñāna svarūpakuḍainayaṭṭi
prāṇiki dēha saṃbaṃdhameṭlagunanna mahinoppu nīśvaramāyalēka
kalugadu; nidralō kalalōna dōcina dēhabaṃdhaṃbula teṟaguvalenu hariyōgamāyāmahatvaṃbunaṃ bāṃca bhautika dēha saṃbaṃdhuḍagucu
tē. naṭṭi māyāguṇaṃbula nātma yōli
bālya kaumāra yauvana bhāvamulanu
nara suparvādimūrtula borasi, yēnu
nāyadivi ” yanu saṃsāramāyadagili”
va. vartiṃcu “. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 9 - 223)
jaccucunuṃṭa jūcedaru cāvakamāneḍivāri bhaṃginī
caccinavānikēḍcedaru, cāvuna kollaka ḍāga vaccunē - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 2 - 46)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.