దీప్యతి, ప్రకాశయతి ఇతి దేవః. (ప్రకాశించువాడు; ప్రకాశింపచేయువాడు).
“దీప్యతే క్రీడతే యస్మాత్ రోచ తేద్యో తతే దివి |
తస్మాత్ దేవ ఇతి ప్రోక్తః స్తూయతే సర్వదేవతైః ||”
(అంతరిక్షమందు ప్రకాశించువాడు, క్రీడించువాడు, అందుచేత దేవుడని చెప్పబడుచున్నాడు, దేవతలుచేత దేవుడని స్తోత్రము చేయబడుచున్నాడు).
(ప్రపంచ ప్రళయములో అన్నియు నశించిపోగా - నామరూపములు లేక తనలో లీనమైపోయినను, తానొక్కడే మిగిలియుండి ప్రకాశించువాడు - పరమాత్మ).
(’ దేవ’ అను మాటలకు అనేక అర్ధములున్నవి - క్రీడ, జయింపకోరుట, వ్యవహరించుట, ప్రకాశించుట, స్తోత్రము చేయుట, సంతోషించుట, మదించుట, నిద్రపోవుట, కాంతిగలిగియుండుట, గమనము - అందుచేత ప్రకాశించువాడు కనుక దేవుడు) (’ దేవుడు’ అనుమాట’ దివు’ అను ధాతువునుండి కలిగినది).
దీవ్యతి, ఆనందేన క్రీడతి ఇతి దేవః. (ఆనందముచేత క్రీడించివాడు - ఆనందరూపుడు).
దీవ్యతి, గచ్ఛతి ఇతి దేవః - గమన శీలః.
(దేవ శబ్దమునకు గమనము అని అర్ధము - గమనము గలవాడు - అట్టి స్వభావముగలవాడు).
(ఉదయించుట, అస్తమించుట అను గమనములు కలిగియుండుటచేత ఒక స్థలమునుండి ఇంకొక స్థలమునకు వెళ్ళువాడు. విశాలమైన ఆకాశమున గమనము కలవాడు).
(ప్రకాశించువాడు సృష్టిమొదలగు పనులలో క్రీడించువాడు, ఆత్మగా ప్రకాశించువాడు)
ద్యోతనాత్ దేవః ; ద్యోతనాత్మకః. (ప్రకాశించువాడు కనుక దేవుడు అని చెప్పబడుచున్నాడు - ప్రకాశించు రూపముగలవాడు - ప్రకాశమే రూపముగా గలవాడు).
ద్యోతమాన స్వభావః - విజ్ఞానైకరసః ఇత్యర్థః -
(ప్రకాశించు స్వభావము గలవాడు; విజ్ఞానమే తనలో కలవాడు - విజ్ఞానమే అయినవాడు).
ద్యోతనాది గుణ విశిష్టః. (ప్రకాశించుట మొదలగు గుణము గలవాడు)
ద్యోతనవాన్ - ద్యోతనాత్ వేదన స్వరూపః ఇత్యర్థః –
“శ్లో||. నదేవః పుండరీకాక్షో నదేవస్త్రి లోచనః |
నదేవో దేహ రూపోపి, నదేవస్తిత్త రూపకః ||
అకృత్రిమమనాద్యంతం వేదనం దేవ ఉచ్యుతే ||“. (వాసిష్టే)
(ద్యోతీరూపుడు, వేదనస్వరూపుడు, పుండరీకాక్షుడైన విష్ణువు దేవుడు కాడు; మూడు నేత్రములుగల శివుడు దేవుడుకాడు; దేహముతోనుండువాడు దేవుడుకాడు; చిత్తము దేవుడుకాడు. ఇవన్నియు కౄత్రిమము లు - చేయబడిన వస్తువులు (కార్యములు), పుట్టినవి. అందుచేత ఇవి యేవీ దేవుడుకాడు. కార్యవస్తువుకానిది, జనమరణములులేనిది అదియే దేవుడు).
ద్యోతయితా, దీపయితా. (ప్రకాశింపచేయువాడు; తేజస్వి).
ద్యులోకవర్తిత్వాత్ దేవః. (అంతరిక్షమందుండువాడు).
స్వదేహ ప్రభయా ద్యోత నవాన్. (కాంతివంతమైన దేహముతో ప్రకాశించువాడు)
స్వప్రకాశః (స్వయముగా ప్రకాశించువాడు).
స్వ తేజసా దేదీప్యమానం; జ్యోతనశీలః.
(తన తేజస్సుతో బాగా ప్రకాశించువాడు) (ప్రకాశించు స్వభావము గలవాడు)
స్వప్రకాశ చైతన్యః (తనంతట తానే ప్రకాశించు చిఛక్తిగలవాడు).
చిదానంద జ్యోతి స్వరూపం. (చైతన్యము - జ్ఞానము - ఆనందము, ప్రకాశము స్వరూపముగా గలవాడు).
దేదీప్యమాన రూపత్వాత్ దేవః; దేదీప్యమానం.
(బాగుగా ప్రకాశించు రూపముగలవాడు, బాగుగా ప్రకాశించువాడు).
యిన చంద్రానల తారకగ్రహ గణం బేరీతి నారీతి నె
వ్వనిదీప్తిం ప్రతిదీప్తమయ్యె భువనవ్రాతంబు, దద్దీప్తిచే
నను దీప్తంబగునట్టి యీశ్వరునకే నశ్రాంతమున్ మ్రొక్కెదన్” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 82)
(శ్రీ వేంకటరమణమూర్తితో సమానమైన దేవుడు ఇప్పటికి లేడు; ఇకముందు ఉండబోడు).
(తన ఆత్మకంటె వేరుగా దేవుడనెడివాడు లేడు).
“అనిమిషా వై దేవాః ఇతి శ్రుతిః. (రెప్పపాటులేనివారు దేవతులు అని శ్రుతి చెప్పుచున్నది).
“ఏకో దేవస్సర్వ భూతానాం హృద్దేశే (అ)ర్జున తిష్ఠతి” (శ్రీమద్భగవద్గీత - 18 - 61 ?)
(సమస్తమైన భూతముల హృదయమందున్నవాడు ఒకడే దేవుడు).
(విష్ణు భక్తుడు దేవుడు - దైవ సంపత్తిగలవాడు - విష్ణుభక్తుడు కానివాడు అసురుడు - రాక్షసుడు - అసుర సంపత్తిగలవాడు).
dīpyati, prakāśayati iti dēvaḥ. (prakāśiṃcuvāḍu; prakāśiṃpacēyuvāḍu).
“dīpyatē krīḍatē yasmāt rōca tēdyō tatē divi |
tasmāt dēva iti prōktaḥ stūyatē sarvadēvataiḥ ||”
(aṃtarikṣamaṃdu prakāśiṃcuvāḍu, krīḍiṃcuvāḍu, aṃducēta dēvuḍani ceppabaḍucunnāḍu, dēvatalucēta dēvuḍani stōtramu cēyabaḍucunnāḍu).
(prapaṃca praḷayamulō anniyu naśiṃcipōgā - nāmarūpamulu lēka tanalō līnamaipōyinanu, tānokkaḍē migiliyuṃḍi prakāśiṃcuvāḍu - paramātma).
(’ dēva’ anu māṭalaku anēka ardhamulunnavi - krīḍa, jayiṃpakōruṭa, vyavahariṃcuṭa, prakāśiṃcuṭa, stōtramu cēyuṭa, saṃtōṣiṃcuṭa, madiṃcuṭa, nidrapōvuṭa, kāṃtigaligiyuṃḍuṭa, gamanamu - aṃducēta prakāśiṃcuvāḍu kanuka dēvuḍu) (’ dēvuḍu’ anumāṭa’ divu’ anu dhātuvunuṃḍi kaliginadi).
dīvyati, ānaṃdēna krīḍati iti dēvaḥ. (ānaṃdamucēta krīḍiṃcivāḍu - ānaṃdarūpuḍu).
dīvyati, gacchati iti dēvaḥ - gamana śīlaḥ.
(dēva śabdamunaku gamanamu ani ardhamu - gamanamu galavāḍu - aṭṭi svabhāvamugalavāḍu).
(udayiṃcuṭa, astamiṃcuṭa anu gamanamulu kaligiyuṃḍuṭacēta oka sthalamunuṃḍi iṃkoka sthalamunaku veḷḷuvāḍu. viśālamaina ākāśamuna gamanamu kalavāḍu).
(prakāśiṃcuvāḍu sṛṣṭimodalagu panulalō krīḍiṃcuvāḍu, ātmagā prakāśiṃcuvāḍu)
dyōtanāt dēvaḥ ; dyōtanātmakaḥ. (prakāśiṃcuvāḍu kanuka dēvuḍu ani ceppabaḍucunnāḍu - prakāśiṃcu rūpamugalavāḍu - prakāśamē rūpamugā galavāḍu).
dyōtamāna svabhāvaḥ - vijñānaikarasaḥ ityarthaḥ -
(prakāśiṃcu svabhāvamu galavāḍu; vijñānamē tanalō kalavāḍu - vijñānamē ayinavāḍu).
dyōtanādi guṇa viśiṣṭaḥ. (prakāśiṃcuṭa modalagu guṇamu galavāḍu)
dyōtanavān - dyōtanāt vēdana svarūpaḥ ityarthaḥ –
“ślō||. nadēvaḥ puṃḍarīkākṣō nadēvastri lōcanaḥ |
nadēvō dēha rūpōpi, nadēvastitta rūpakaḥ ||
akṛtrimamanādyaṃtaṃ vēdanaṃ dēva ucyutē ||“. (vāsiṣṭē)
(dyōtīrūpuḍu, vēdanasvarūpuḍu, puṃḍarīkākṣuḍaina viṣṇuvu dēvuḍu kāḍu; mūḍu nētramulugala śivuḍu dēvuḍukāḍu; dēhamutōnuṃḍuvāḍu dēvuḍukāḍu; cittamu dēvuḍukāḍu. ivanniyu kṝtrimamu lu - cēyabaḍina vastuvulu (kāryamulu), puṭṭinavi. aṃducēta ivi yēvī dēvuḍukāḍu. kāryavastuvukānidi, janamaraṇamululēnidi adiyē dēvuḍu).
dyōtayitā, dīpayitā. (prakāśiṃpacēyuvāḍu; tējasvi).
dyulōkavartitvāt dēvaḥ. (aṃtarikṣamaṃduṃḍuvāḍu).
svadēha prabhayā dyōta navān. (kāṃtivaṃtamaina dēhamutō prakāśiṃcuvāḍu)
svaprakāśaḥ (svayamugā prakāśiṃcuvāḍu).
sva tējasā dēdīpyamānaṃ; jyōtanaśīlaḥ.
(tana tējassutō bāgā prakāśiṃcuvāḍu) (prakāśiṃcu svabhāvamu galavāḍu)
svaprakāśa caitanyaḥ (tanaṃtaṭa tānē prakāśiṃcu cichaktigalavāḍu).
cidānaṃda jyōti svarūpaṃ. (caitanyamu - jñānamu - ānaṃdamu, prakāśamu svarūpamugā galavāḍu).
dēdīpyamāna rūpatvāt dēvaḥ; dēdīpyamānaṃ.
(bāgugā prakāśiṃcu rūpamugalavāḍu, bāgugā prakāśiṃcuvāḍu).
yina caṃdrānala tārakagraha gaṇaṃ bērīti nārīti ne
vvanidīptiṃ pratidīptamayye bhuvanavrātaṃbu, daddīpticē
nanu dīptaṃbagunaṭṭi yīśvarunakē naśrāṃtamun mrokkedan” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 82)
(śrī vēṃkaṭaramaṇamūrtitō samānamaina dēvuḍu ippaṭiki lēḍu; ikamuṃdu uṃḍabōḍu).
(tana ātmakaṃṭe vērugā dēvuḍaneḍivāḍu lēḍu).
“animiṣā vai dēvāḥ iti śrutiḥ. (reppapāṭulēnivāru dēvatulu ani śruti ceppucunnadi).
“ēkō dēvassarva bhūtānāṃ hṛddēśē (a)rjuna tiṣṭhati” (śrīmadbhagavadgīta - 18 - 61 ?)
(samastamaina bhūtamula hṛdayamaṃdunnavāḍu okaḍē dēvuḍu).
(viṣṇu bhaktuḍu dēvuḍu - daiva saṃpattigalavāḍu - viṣṇubhaktuḍu kānivāḍu asuruḍu - rākṣasuḍu - asura saṃpattigalavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.