← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దేవతులు dēvatulu

Original — తెలుగు
  1. హిరణ్యగర్భా దయః దేవాః. (హిరణ్యగర్భుడు - చతుర్ముఖబ్రహ్మ - మొదలగువారు).

  2. వసురుద్రా దయః (వసువు, రుద్రుడు మొదలగువారు).

  3. ద్యుతిమత్యః ; ప్రభయా దీవ్యన్ ద్యోతమానాః (కాంతిగలవారు; కాంతిచేత ప్రకాశించువారు).

  4. “దేవతులు నారాయణ శరీర సంభూతులు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 84)

  5. “సత్వాదిగుణ పరిమాణామంబుల నమరులైరి. ఊర్జిత సత్వగుణంబున దేవతలు త్రిదివంబునొందిరి”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 6 - )

  1. “స బ్రహ్మ, స శివః, స హరిః, సేంద్రః, సో(అ)క్షరః పరమః స్వరాట్” (మంత్రపుష్పం)

(అతనే - ఆ పరబ్రహ్మయే - చతుర్ముఖ బ్రహ్మ, అతనే శివుడు, అతనే విష్ణువు, అతనే ఇంద్రుడు, అతనే అక్షరుడైన - నాశము లేనివాడైన - పరముడు (పరమాత్మ) స్వరాట్టు (స్వయముగా ప్రకాశించువాడు).

  1. “సధాతా, సవిధాతా, సవాయుర్నిభ, ఉచ్ఛ్రితం |

సో(అ)ర్యమా, సవరుణః సరుద్రః, సమహాదేవః

సో(అ)గ్నిః, స ఉ సూర్యః, స ఉ ఏవ మహాయమః ||“.

(ఆ పరమాత్మయే థాత, విథాత, అతనే వాయువు, అర్యముడు, వరుణుడు, రుద్రుడు, అతనే మహా దేవుడు. అతనే అగ్ని, అతనే సూర్యుడు, అతనే యముడు. ఆ పరమాత్మ ఒక్కడే ఇన్ని దేవతల రూపములుగానుండి, వారి వారి పనులు చేయును. అందుచేత ఆ దేవతులందఱు పరమాత్మయే - ఆ దేవతలకు చేయు ఆరాధన పరమాత్మారాధనయే. ఆయా ఉపధులలోనుండి పరమాత్మయే యిన్ని భేదములుగా నున్నాడు).

  1. “సవరుణః, సాయమగ్నిర్భవతి, సమిత్రో భవతి ప్రాతురుద్యన్, సవితా భూత్వాంత రిక్షేణ యాతి, స ఇంద్రో భూత్వా తపతి మధ్యతో దివం”.

(ఆ పరమాత్మయే వరుణుడు. అగ్ని, మిత్రుడు, సవిత అయి అంతరిక్షమందు ప్రయాణము చేయును, ఇంద్రుడయి ఆకాశమధ్యమందు ఉండి తపింప చేయును).

  1. “ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయుః; ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్ప్రోన్నమః” (మంత్రపుష్పము)

(ఓంకారరూపుడైన యా పరమాత్మయే చతుర్ముఖబ్రహ్మ, అతనే వాయువు, అతనే ఆత్మ, అతనే సత్యం, అతనే సర్వము అయిన యాతనుగుఱించి నమస్కారము).

  1. “త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వ బ్రహ్మత్వం ప్రజాపతాః ||” (మంత్రపుష్పము)

(ఆ పరమాత్మ అయిన నీవే యజ్ఞము (యజ్ఞరూపుడవు), నీవే వషట్కారము, నీవే ఇంద్రుడవు, నీవే రుద్రుడవు, నీవే విష్ణువు, నీవే బ్రహ్మ, నీవే ప్రజాపతివి - ఈ దేవతులందఱూ నీవే, వీరందరూ నీరూపములే).

  1. “నన్వన్యేపి త్వమేవేశో దేవాస్త్వత్తః పృథిజ్ఞతే” (గీతాభావప్రకాశము - 9 - 155)

(ఇతరదేవతులుకూడ నీవే - వారు నీకంటె వేరుకాదు).

  1. “యథావర్షభుజో (ఖండమండల పతయః, భారతాది వర్ష భోక్తారః) అఖిలక్షితిపతేః (మహామండలేశ్వ రస్య సార్వభౌమస్య) బలిం ఉద్వహంతి, తథా ఇంద్రా దయః దేవాః మాయావృతాః (ప్రకృతి పరతంత్రాః) యత్ర యత్ర వ్యాపారే అధికృతాః (యస్మిన్ కర్మణి యేయేని యుక్తాః), తే సర్వేత్వం, (ఈశ్వరం) కింకరాః స్వామినమివ, సేవంతే. మనుష్యైః దత్తం హహకవ్యాథి లక్షణం బలిం భక్షయంతిచ, త్వదాజ్ఞా పరిపాలనమేవ బలివహన మిత్యర్థః”.

(సార్వభౌమునకిచ్చు కప్పము మొదలగు వాటిని అతనిచే నియమింపబడిన మండలాధిపతులు తీసుకొనుచున్నారు. ఆ ప్రకారముగానే ఇంద్రుడు మొదలగు దేవతులు పరమాత్మచే ఏయే కర్మలయందు నియోగింపబడిరో వారందఱూ, యజమానుని సేవకులు కొల్చునట్లు నిన్ను (పరమాత్మను) సేవించుచున్నారు - మానవులు ఇచ్చు బలిని (యజ్ఞములో హోమము చేయబడినవాటిని) భక్షించుచున్నారు. ఇట్లు వారు ఈ బలిని గ్రహించుట నీ యాజ్ఞాపాలనమే - ఇవన్నియు వారి రూపులోనున్న నీకే చెందుచున్నవి, వాటినన్నింటినీ నీవే స్వీకరించుచున్నావు).

Transliteration
  1. hiraṇyagarbhā dayaḥ dēvāḥ. (hiraṇyagarbhuḍu - caturmukhabrahma - modalaguvāru).

  2. vasurudrā dayaḥ (vasuvu, rudruḍu modalaguvāru).

  3. dyutimatyaḥ ; prabhayā dīvyan dyōtamānāḥ (kāṃtigalavāru; kāṃticēta prakāśiṃcuvāru).

  4. “dēvatulu nārāyaṇa śarīra saṃbhūtulu” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 84)

  5. “satvādiguṇa parimāṇāmaṃbula namarulairi. ūrjita satvaguṇaṃbuna dēvatalu tridivaṃbunoṃdiri”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 6 - )

  1. “sa brahma, sa śivaḥ, sa hariḥ, sēṃdraḥ, sō(a)kṣaraḥ paramaḥ svarāṭ” (maṃtrapuṣpaṃ)

(atanē - ā parabrahmayē - caturmukha brahma, atanē śivuḍu, atanē viṣṇuvu, atanē iṃdruḍu, atanē akṣaruḍaina - nāśamu lēnivāḍaina - paramuḍu (paramātma) svarāṭṭu (svayamugā prakāśiṃcuvāḍu).

  1. “sadhātā, savidhātā, savāyurnibha, ucchritaṃ |

sō(a)ryamā, savaruṇaḥ sarudraḥ, samahādēvaḥ

sō(a)gniḥ, sa u sūryaḥ, sa u ēva mahāyamaḥ ||“.

(ā paramātmayē thāta, vithāta, atanē vāyuvu, aryamuḍu, varuṇuḍu, rudruḍu, atanē mahā dēvuḍu. atanē agni, atanē sūryuḍu, atanē yamuḍu. ā paramātma okkaḍē inni dēvatala rūpamulugānuṃḍi, vāri vāri panulu cēyunu. aṃducēta ā dēvatulaṃdaṟu paramātmayē - ā dēvatalaku cēyu ārādhana paramātmārādhanayē. āyā upadhulalōnuṃḍi paramātmayē yinni bhēdamulugā nunnāḍu).

  1. “savaruṇaḥ, sāyamagnirbhavati, samitrō bhavati prāturudyan, savitā bhūtvāṃta rikṣēṇa yāti, sa iṃdrō bhūtvā tapati madhyatō divaṃ”.

(ā paramātmayē varuṇuḍu. agni, mitruḍu, savita ayi aṃtarikṣamaṃdu prayāṇamu cēyunu, iṃdruḍayi ākāśamadhyamaṃdu uṃḍi tapiṃpa cēyunu).

  1. “ōṃ tadbrahma, ōṃ tadvāyuḥ; ōṃ tadātmā, ōṃ tatsatyaṃ, ōṃ tatsarvaṃ, ōṃ tatprōnnamaḥ” (maṃtrapuṣpamu)

(ōṃkārarūpuḍaina yā paramātmayē caturmukhabrahma, atanē vāyuvu, atanē ātma, atanē satyaṃ, atanē sarvamu ayina yātanuguṟiṃci namaskāramu).

  1. “tvaṃ yajñastvaṃ vaṣaṭkārastvamiṃdrastvaṃ rudrastvaṃ viṣṇustva brahmatvaṃ prajāpatāḥ ||” (maṃtrapuṣpamu)

(ā paramātma ayina nīvē yajñamu (yajñarūpuḍavu), nīvē vaṣaṭkāramu, nīvē iṃdruḍavu, nīvē rudruḍavu, nīvē viṣṇuvu, nīvē brahma, nīvē prajāpativi - ī dēvatulaṃdaṟū nīvē, vīraṃdarū nīrūpamulē).

  1. “nanvanyēpi tvamēvēśō dēvāstvattaḥ pṛthijñatē” (gītābhāvaprakāśamu - 9 - 155)

(itaradēvatulukūḍa nīvē - vāru nīkaṃṭe vērukādu).

  1. “yathāvarṣabhujō (khaṃḍamaṃḍala patayaḥ, bhāratādi varṣa bhōktāraḥ) akhilakṣitipatēḥ (mahāmaṃḍalēśva rasya sārvabhaumasya) baliṃ udvahaṃti, tathā iṃdrā dayaḥ dēvāḥ māyāvṛtāḥ (prakṛti parataṃtrāḥ) yatra yatra vyāpārē adhikṛtāḥ (yasmin karmaṇi yēyēni yuktāḥ), tē sarvētvaṃ, (īśvaraṃ) kiṃkarāḥ svāminamiva, sēvaṃtē. manuṣyaiḥ dattaṃ hahakavyāthi lakṣaṇaṃ baliṃ bhakṣayaṃtica, tvadājñā paripālanamēva balivahana mityarthaḥ”.

(sārvabhaumunakiccu kappamu modalagu vāṭini atanicē niyamiṃpabaḍina maṃḍalādhipatulu tīsukonucunnāru. ā prakāramugānē iṃdruḍu modalagu dēvatulu paramātmacē ēyē karmalayaṃdu niyōgiṃpabaḍirō vāraṃdaṟū, yajamānuni sēvakulu kolcunaṭlu ninnu (paramātmanu) sēviṃcucunnāru - mānavulu iccu balini (yajñamulō hōmamu cēyabaḍinavāṭini) bhakṣiṃcucunnāru. iṭlu vāru ī balini grahiṃcuṭa nī yājñāpālanamē - ivanniyu vāri rūpulōnunna nīkē ceṃducunnavi, vāṭinanniṃṭinī nīvē svīkariṃcucunnāvu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.