← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దేవీ dēvī

Original — తెలుగు
  1. దీవ్యతి, ప్రకాశతే, ప్రకాశయతీతివా దేవీ.

(దీపించునది, ప్రకాశించునది, ఇతరవస్తువులను ప్రకాశింప చేయునది, క్రీడించునది).

  1. దేవనశీల; క్రీడాపరా. (ప్రకాశించు స్వభావముకలది; క్రీడయందు - సృష్టియను క్రీడయందు పరవశురాలైనది).

  2. ద్యోతనాత్మికా; ద్యోతమానా. (ప్రకాశమే రూపముగా గలది; ప్రకాశించునది).

  3. దేవస్య నారాయణస్య పత్నీ; శ్రీః ఇత్యర్ధః - దేవ శబ్దోపి పరబ్రహ్మాత్మ శబ్ద వాచ్య నారాయణవాచీ, అతః తత్పత్నీ -

(దేవుడు అను మాటకు పరబ్రహ్మ అని చెప్పబడు నారాయణుడు అని అర్ధము. అందుచేత దేవీ అనగా అతని భార్యాయిన శ్రీ లక్ష్మీదేవి యని యర్ధము).

  1. “ఈశ్వరోహం చ సూత్రాత్మా విరాడాత్మా హ మస్తిచ |

బ్రహ్మ హం విష్ణు రుద్రే చ బ్రాహ్మీ గౌరీ చ వైష్ణవీ ||”

(నేనే - దేవియే - ఈశ్వరుడను, సూత్రాత్మ, విరాడాత్మ, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు నేనే, సరస్వతీ, లక్ష్మీ పార్వతులు కూడా నేనే) - (ఇవన్నియు దేవీ మూర్తులే - దేవి పరబ్రహ్మ)

  1. దివ్యమైన తేజస్సు కలది.

  2. యానిత్యా కాలత్రయా బాధ్యా, ఆద్యా, సర్వాది కారణభూతా, బ్రహ్మరూపా, యాచనసాతన్మనాది సిద్ధా శక్తిః, జడరూపా, మాయాఖ్యా వహ్నేన. వహ్ని శక్తివత్ బ్రహ్మణిస్థితా, ఏద దు భయాత్మక మాయా విశిష్టం, బ్రహ్మ రూపం తత్వం, సాదేవీ దేవీపదవాచ్యం భవతి - యథా గజశరీరే ప్రవిష్టం చైతన్యం గజనామకం భవతి. తథా జగత్కారణమాయా శరీరే ప్రవిష్టం ప్రధమతః చైతన్యం ముఖ్యతయా మయా శక్తి ప్రకృతి సంజ్ఞికం భవతి. అత ఏవ సర్వోత్కృష్టం ప్రథమం దేవీ తత్వం భవతి.

(మూడుకాలములందు ఉండునది, మొదటిది, అన్నింటికీ కారణమైనది, సమస్తమునకుమొదటి కారణము - మూల కారణరూపమైనది. పరబ్రహ్మమైనది, పూర్వమునుండి ఉన్నది, జననము అనునది లేకుండగనే ఉన్నశక్తి, జడరూపమైనది. మాయయను పేరుగలది, అగ్నిలోనుండు అగ్నిశక్తివలె పరబ్రహ్మమందుండునది. ఈ రెండు తత్వములు కలిసిన మాయయను పరబ్రహ్మతత్వము. ఇటువంటి లక్షణములుగల దేవియే దేవీ యని చెప్పబడుచున్నది - ఏనుగు శరీరములోనుండు చైతన్య శక్తియే ఏనుగు అని చెప్పబడినట్లు జగత్తునకు కారణమైన మాయయను శరీరములో ప్రవేశించియుండు మొదటి చైతన్యశక్తి - పరమాత్మ యొక్క చిచ్ఛక్తి. మాయా సక్తి, ప్రకృతి యని పేరుగలదియే దేవి. ఇందువలన అన్నిటికంటె ఉత్కృష్టమైన మొట్ట మొదటి తత్వము - దేవీ. భగవంతుని శక్తి ప్రకృతిలో ప్రవేశించగా అది మొదటి తత్వము - తత్ = భగవంతుడు; త్వం = నీవు. నీవు అనగా యిక్కడ ప్రకృతి. ఈ రెండింటి మేళనము వలననే కలిగినది మొదటి తత్వము - అదియే దేవి, అదియే మాయ).

Transliteration
  1. dīvyati, prakāśatē, prakāśayatītivā dēvī.

(dīpiṃcunadi, prakāśiṃcunadi, itaravastuvulanu prakāśiṃpa cēyunadi, krīḍiṃcunadi).

  1. dēvanaśīla; krīḍāparā. (prakāśiṃcu svabhāvamukaladi; krīḍayaṃdu - sṛṣṭiyanu krīḍayaṃdu paravaśurālainadi).

  2. dyōtanātmikā; dyōtamānā. (prakāśamē rūpamugā galadi; prakāśiṃcunadi).

  3. dēvasya nārāyaṇasya patnī; śrīḥ ityardhaḥ - dēva śabdōpi parabrahmātma śabda vācya nārāyaṇavācī, ataḥ tatpatnī -

(dēvuḍu anu māṭaku parabrahma ani ceppabaḍu nārāyaṇuḍu ani ardhamu. aṃducēta dēvī anagā atani bhāryāyina śrī lakṣmīdēvi yani yardhamu).

  1. “īśvarōhaṃ ca sūtrātmā virāḍātmā ha mastica |

brahma haṃ viṣṇu rudrē ca brāhmī gaurī ca vaiṣṇavī ||”

(nēnē - dēviyē - īśvaruḍanu, sūtrātma, virāḍātma, brahma, viṣṇuvu, rudruḍu nēnē, sarasvatī, lakṣmī pārvatulu kūḍā nēnē) - (ivanniyu dēvī mūrtulē - dēvi parabrahma)

  1. divyamaina tējassu kaladi.

  2. yānityā kālatrayā bādhyā, ādyā, sarvādi kāraṇabhūtā, brahmarūpā, yācanasātanmanādi siddhā śaktiḥ, jaḍarūpā, māyākhyā vahnēna. vahni śaktivat brahmaṇisthitā, ēda du bhayātmaka māyā viśiṣṭaṃ, brahma rūpaṃ tatvaṃ, sādēvī dēvīpadavācyaṃ bhavati - yathā gajaśarīrē praviṣṭaṃ caitanyaṃ gajanāmakaṃ bhavati. tathā jagatkāraṇamāyā śarīrē praviṣṭaṃ pradhamataḥ caitanyaṃ mukhyatayā mayā śakti prakṛti saṃjñikaṃ bhavati. ata ēva sarvōtkṛṣṭaṃ prathamaṃ dēvī tatvaṃ bhavati.

(mūḍukālamulaṃdu uṃḍunadi, modaṭidi, anniṃṭikī kāraṇamainadi, samastamunakumodaṭi kāraṇamu - mūla kāraṇarūpamainadi. parabrahmamainadi, pūrvamunuṃḍi unnadi, jananamu anunadi lēkuṃḍaganē unnaśakti, jaḍarūpamainadi. māyayanu pērugaladi, agnilōnuṃḍu agniśaktivale parabrahmamaṃduṃḍunadi. ī reṃḍu tatvamulu kalisina māyayanu parabrahmatatvamu. iṭuvaṃṭi lakṣaṇamulugala dēviyē dēvī yani ceppabaḍucunnadi - ēnugu śarīramulōnuṃḍu caitanya śaktiyē ēnugu ani ceppabaḍinaṭlu jagattunaku kāraṇamaina māyayanu śarīramulō pravēśiṃciyuṃḍu modaṭi caitanyaśakti - paramātma yokka cicchakti. māyā sakti, prakṛti yani pērugaladiyē dēvi. iṃduvalana anniṭikaṃṭe utkṛṣṭamaina moṭṭa modaṭi tatvamu - dēvī. bhagavaṃtuni śakti prakṛtilō pravēśiṃcagā adi modaṭi tatvamu - tat = bhagavaṃtuḍu; tvaṃ = nīvu. nīvu anagā yikkaḍa prakṛti. ī reṃḍiṃṭi mēḷanamu valananē kaliginadi modaṭi tatvamu - adiyē dēvi, adiyē māya).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.