← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దేవీభాగవతం dēvībhāgavataṃ

Original — తెలుగు
  1. “మూలప్రకృతిజన్య విష్ణుబ్రహ్మ ప్రభృతీనాం ఏకైక గుణోపాధికానాం ప్రతిపాదకాని పురాణాని అన్యాని. దేవీభాగవతంతు గుణత్రయ సామ్యావస్థ మాయాశబల బ్రహ్మరూప మూలప్రకృతి ప్రతిపాదకం సాకాద్భవతి.తస్మాత్ ఇదమేవ సర్వోత్కృష్టం, ఏతత్స దృశం అన్య పురాణం న భవిష్యతి”.

(మూలప్రకృతి వలనకలిగిన విష్ణు, బ్రహ్మ మొదలగువారు మూలప్రకృతియొక్క త్రిగుణములలో ఒక్కొక్కగుణము ఉపాధిగా గలవారు అని ఇతర పురాణములలో చెప్పబడినది.కాని దేవీభాగవతము మట్టుకు త్రిగుణముల సామ్యావస్థ గలమాయా శబల బ్రహ్మరూప మూలప్రకృతిని గుఱించి ప్రతిపాదించునది దేవీ భాగవతము. దేవియే సాక్షాత్ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపము - అందుచేత దేవీభాగవతమే ఉత్కృష్టమైనది, దీనితో సమానమైన ఇతర పురాణములేదు).

  1. “భగవత్యాః మాయోపాధిక బ్రహ్మ రూపిణ్యాః ప్రతిపాదకం అర్థ శ్లోకాత్మకం సూత్ర భూతమేవ సర్వవేదసారం సర్వం ఖలు ఇదం బ్రహ్మః; నేహ నానాస్తి కించన” ఇతి సర్వ వేదతాత్పర్యార్థ ప్రతిపాదక వాక్యార్ధాభి లాపకం పురాణం మంత్రరూపం ప్రకటీకృతం“.

(ఈ దేవీ భాగవతము మాయ ఉపాధిగాగల పరబ్రహ్మరూపిణి అయిన భగవతిని (దేవిని) ప్రతిపాదించునది. దీనిలోని శ్లోకముల అర్థభావమే సర్వ వేదాంతసారము. ” ఇదంతయు బ్రహ్మమే” బ్రహ్మకానిది ఈ జగత్తులో ఏదియునులేదు - అను వేదాంతసారమును ఈ పురాణము ప్రకటించుచున్నది).

Transliteration
  1. “mūlaprakṛtijanya viṣṇubrahma prabhṛtīnāṃ ēkaika guṇōpādhikānāṃ pratipādakāni purāṇāni anyāni. dēvībhāgavataṃtu guṇatraya sāmyāvastha māyāśabala brahmarūpa mūlaprakṛti pratipādakaṃ sākādbhavati.tasmāt idamēva sarvōtkṛṣṭaṃ, ētatsa dṛśaṃ anya purāṇaṃ na bhaviṣyati”.

(mūlaprakṛti valanakaligina viṣṇu, brahma modalaguvāru mūlaprakṛtiyokka triguṇamulalō okkokkaguṇamu upādhigā galavāru ani itara purāṇamulalō ceppabaḍinadi.kāni dēvībhāgavatamu maṭṭuku triguṇamula sāmyāvastha galamāyā śabala brahmarūpa mūlaprakṛtini guṟiṃci pratipādiṃcunadi dēvī bhāgavatamu. dēviyē sākṣāt nirguṇa parabrahma svarūpamu - aṃducēta dēvībhāgavatamē utkṛṣṭamainadi, dīnitō samānamaina itara purāṇamulēdu).

  1. “bhagavatyāḥ māyōpādhika brahma rūpiṇyāḥ pratipādakaṃ artha ślōkātmakaṃ sūtra bhūtamēva sarvavēdasāraṃ sarvaṃ khalu idaṃ brahmaḥ; nēha nānāsti kiṃcana” iti sarva vēdatātparyārtha pratipādaka vākyārdhābhi lāpakaṃ purāṇaṃ maṃtrarūpaṃ prakaṭīkṛtaṃ”.

(ī dēvī bhāgavatamu māya upādhigāgala parabrahmarūpiṇi ayina bhagavatini (dēvini) pratipādiṃcunadi. dīnilōni ślōkamula arthabhāvamē sarva vēdāṃtasāramu. ” idaṃtayu brahmamē” brahmakānidi ī jagattulō ēdiyunulēdu - anu vēdāṃtasāramunu ī purāṇamu prakaṭiṃcucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.