← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

ధర్మ పత్ని dharma patni

Original — తెలుగు
  1. ధర్మస్య పత్నీ, ధర్మార్థ పత్నీ ఇత్యర్ధః-

(ధర్మార్ధములను పురుషార్ధములను సాధించుటలో అర్ధాంగి అయినది).

“వ. పురుషునకు నంగనవలన ధర్మార్థకామంబులు సిద్ధించు. కర్ణధారుండు నావచేతం బయోధి గడుచు చందంబున గృహమేధి సర్వాశ్రమవాసులనరసి రక్షించుచు నిజాశ్రమంబున వ్యసనార్ణవంబు దరియింపంజేయు భార్య పురుషునందు నర్థంబు. భార్యయందు సకల గృహ కార్యభారంబునుం జేర్చి పురుషుండు నిశ్చితుండై సుఖియించుచుండు - మఱియు నితరాశ్రమ దుర్జయంబులైన ఇంద్రియ శత్రువర్గంబుల భార్యా సమేతుండైన గృహస్థుండు, దుర్గాధిపతియైన రాజు శతృసంఘంబుల జయించు చందంబున, లీలామాత్రంబునం జయించు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 14 - 459)

Transliteration
  1. dharmasya patnī, dharmārtha patnī ityardhaḥ-

(dharmārdhamulanu puruṣārdhamulanu sādhiṃcuṭalō ardhāṃgi ayinadi).

“va. puruṣunaku naṃganavalana dharmārthakāmaṃbulu siddhiṃcu. karṇadhāruṃḍu nāvacētaṃ bayōdhi gaḍucu caṃdaṃbuna gṛhamēdhi sarvāśramavāsulanarasi rakṣiṃcucu nijāśramaṃbuna vyasanārṇavaṃbu dariyiṃpaṃjēyu bhārya puruṣunaṃdu narthaṃbu. bhāryayaṃdu sakala gṛha kāryabhāraṃbunuṃ jērci puruṣuṃḍu niścituṃḍai sukhiyiṃcucuṃḍu - maṟiyu nitarāśrama durjayaṃbulaina iṃdriya śatruvargaṃbula bhāryā samētuṃḍaina gṛhasthuṃḍu, durgādhipatiyaina rāju śatṛsaṃghaṃbula jayiṃcu caṃdaṃbuna, līlāmātraṃbunaṃ jayiṃcu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 14 - 459)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.