← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

ధర్మ్యం dharmyaṃ

Original — తెలుగు
  1. ధర్మయుక్తం (ధర్మముతో కూడియున్నది).

  2. ధర్మాదినపేతం (ధర్మమునుండి దూరము కానిది).

ధర్మాత్ స్వరూపా దనపేతం (ధర్మమనగా స్వరూపము - దానినుండి వేరుకానిది).

అప్రచ్యుతం (హింసాది దోషముచే దుష్టముకానిది. ధర్మమే అయినది).

  1. ధర్మజాతం (ధర్మమువలన కలిగినది).

  2. ధర్మ్యత్వం, ధర్మాదనపేతత్వం, తత్ హేతుః న్యాయతః ప్రవృత్తత్వం.

(ధర్మత్వము, ధర్మముకన్న దూరముకానిది, వేఱుకానిది).

  1. ధర్మాదనపేతం - అనేక గుణవతోపి ధర్మవిరుద్ధత్వం దృష్టం, నతథా ఆత్మజ్ఞానం ధర్మవిరోధి కింతు ధర్మ్యం ధర్మాత్ అనపేతం”

(శ్రీశంకరః)

(అనేకగుణములు కలిగియుండునవి ధర్మమునకు విరుద్ధముగా నుండుటకలదు. ఆత్మజ్ఞానము ధర్మమునకు విరుద్ధము కానిది, ధర్మ్యము, ధర్మముకన్న వేఱుకానిది).

  1. ధర్మఓ విష్ణుః, తద్విషయం ధర్మ్యం. (ధర్మమనగా విష్ణువు - విష్ణువు విషయమైనది).

  2. “ధర్మో భగవాన్, తద్విషయం ధర్మ్యం, సర్వం జగత్ ధత్తే ఇతి ధర్మః” (శ్రీ ఆనందతీర్థః)

(ధర్మము అనగా భగవంతుడు, భగవంతుడు విషయమైనది ధర్మ్యం, సమస్త జగత్తును ధరించునది కనుక ధర్మము, భగవంతుడు).

  1. ధర్మాదనపేతం, ధర్మత్వమ్హి నిఃశ్రేయస సాధనత్వం స్వరూపేణై వాత్యర్థ ప్రియత్వేన తదానీమేవ తద్దర్శనాపాదన తయా చ స్వయం నిశ్రేయస రూపమపి నిరతిశయ నిశ్రేయస రూపాత్యంతిక మిత్ప్రాప్తి సాధనం ఇత్యర్థః.”

(ధర్మముకన్న వేరుకానిది, ధర్మత్వము - నిఃశ్రేయస్సునకు - మోక్షమునకు - సాధనమైనది. స్వరూపముచేత అత్యంత ప్రియకరమైనదగుటచేత, అప్పటికప్పుడే - తక్షణమే - నిదర్శనము కలుగచేయు నదగుటచేత నిరతిశయ నిఃశ్రేయస రూపమైన నన్ను - (భగవంతుని) పొందుటకు సాధనమైనది).

  1. “అద్వేష్టా సర్వ భూతానాం మైత్రః కరుణ ఏవచ |

- - యేతు ధర్మ్యామృతమిదం యధోక్తం పర్యుపాసతే |

శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తే (అ)తీవ మే ప్రియాః ||” (శ్రీమద్భగవద్గీత - 12 - 13 to 20)

“అద్వేష్టృత్వాది చిహ్నాని జీవన్ముక్త శరీరిణాం |

స్వభావ భూతాని మాని తదుక్తం వార్తికేస్ఫుటం |

ఉత్పనాత్మావ బోధస్య హ్య ద్వేష్టృత్వాదయో గుణాః |

అయత్నతో భవం త్యేవ న తే సాధన రూపిణః |

సంపాద్యమానం యత్నేన ధర్మజాతమిదం సతః |

విరక్త స్మాత్య జిజ్ఞాసోర్ముముక్షోర్మోక్ష సాధనం ||“. (గీతాభావప్రకాశము - 12 - 126 to 129)

(శ్రీమద్భగవద్గీతలోని అధ్యాయము 12 లోని శ్లోకములు 13 నుండి 20 వరకు గల శ్లోకములలో భగవద్భక్తునియొక్క ధర్మములు చెప్పబడినవి. అవియే జీవన్ముక్తుని లక్షణములు, స్వభావమువలన కలిగినవి. ఈ విషయము వార్తికమందు స్పష్టముగా చెప్పబడినది - ఆత్మజ్ఞానముదుయించిన వానికి యీ ‘అద్వేష్టా’ మొదలగు గుణములు వారు ప్రయత్నము చేయకయే కలుగును, ఇవి వారి యడల సాధారణరూపములు కావు - అనగా వారు సాధనచేసి సాధింపవలసినవి కావు. ఈ చెప్పిన గుణములు ధర్మరూపములైనవి. ప్రయత్నముచేసి సంపాదించిన యీ గుణములు పరమ భక్తుల లక్షణములు - భగవంతునికి మిక్కిలి ప్రియమైన వారి గుణములు, ధర్మములు. విరక్తుడు, ఆత్మజిజ్ఞాసువు, మోక్షముకోరువాడు అయినవానికి మోక్షసాధనం. ఈ లక్షణములు గలవారు భగవంతునికి మిక్కిలి ప్రియములగుటవల్ల భగవంతుడు వారికి తప్పక యిచ్చును).

Transliteration
  1. dharmayuktaṃ (dharmamutō kūḍiyunnadi).

  2. dharmādinapētaṃ (dharmamunuṃḍi dūramu kānidi).

dharmāt svarūpā danapētaṃ (dharmamanagā svarūpamu - dāninuṃḍi vērukānidi).

apracyutaṃ (hiṃsādi dōṣamucē duṣṭamukānidi. dharmamē ayinadi).

  1. dharmajātaṃ (dharmamuvalana kaliginadi).

  2. dharmyatvaṃ, dharmādanapētatvaṃ, tat hētuḥ nyāyataḥ pravṛttatvaṃ.

(dharmatvamu, dharmamukanna dūramukānidi, vēṟukānidi).

  1. dharmādanapētaṃ - anēka guṇavatōpi dharmaviruddhatvaṃ dṛṣṭaṃ, natathā ātmajñānaṃ dharmavirōdhi kiṃtu dharmyaṃ dharmāt anapētaṃ”

(śrīśaṃkaraḥ)

(anēkaguṇamulu kaligiyuṃḍunavi dharmamunaku viruddhamugā nuṃḍuṭakaladu. ātmajñānamu dharmamunaku viruddhamu kānidi, dharmyamu, dharmamukanna vēṟukānidi).

  1. dharmaō viṣṇuḥ, tadviṣayaṃ dharmyaṃ. (dharmamanagā viṣṇuvu - viṣṇuvu viṣayamainadi).

  2. “dharmō bhagavān, tadviṣayaṃ dharmyaṃ, sarvaṃ jagat dhattē iti dharmaḥ” (śrī ānaṃdatīrthaḥ)

(dharmamu anagā bhagavaṃtuḍu, bhagavaṃtuḍu viṣayamainadi dharmyaṃ, samasta jagattunu dhariṃcunadi kanuka dharmamu, bhagavaṃtuḍu).

  1. dharmādanapētaṃ, dharmatvamhi niḥśrēyasa sādhanatvaṃ svarūpēṇai vātyartha priyatvēna tadānīmēva taddarśanāpādana tayā ca svayaṃ niśrēyasa rūpamapi niratiśaya niśrēyasa rūpātyaṃtika mitprāpti sādhanaṃ ityarthaḥ.”

(dharmamukanna vērukānidi, dharmatvamu - niḥśrēyassunaku - mōkṣamunaku - sādhanamainadi. svarūpamucēta atyaṃta priyakaramainadaguṭacēta, appaṭikappuḍē - takṣaṇamē - nidarśanamu kalugacēyu nadaguṭacēta niratiśaya niḥśrēyasa rūpamaina nannu - (bhagavaṃtuni) poṃduṭaku sādhanamainadi).

  1. “advēṣṭā sarva bhūtānāṃ maitraḥ karuṇa ēvaca |

- - yētu dharmyāmṛtamidaṃ yadhōktaṃ paryupāsatē |

śraddhadānā matparamā bhaktāstē (a)tīva mē priyāḥ ||” (śrīmadbhagavadgīta - 12 - 13 to 20)

“advēṣṭṛtvādi cihnāni jīvanmukta śarīriṇāṃ |

svabhāva bhūtāni māni taduktaṃ vārtikēsphuṭaṃ |

utpanātmāva bōdhasya hya dvēṣṭṛtvādayō guṇāḥ |

ayatnatō bhavaṃ tyēva na tē sādhana rūpiṇaḥ |

saṃpādyamānaṃ yatnēna dharmajātamidaṃ sataḥ |

virakta smātya jijñāsōrmumukṣōrmōkṣa sādhanaṃ ||“. (gītābhāvaprakāśamu - 12 - 126 to 129)

(śrīmadbhagavadgītalōni adhyāyamu 12 lōni ślōkamulu 13 nuṃḍi 20 varaku gala ślōkamulalō bhagavadbhaktuniyokka dharmamulu ceppabaḍinavi. aviyē jīvanmuktuni lakṣaṇamulu, svabhāvamuvalana kaliginavi. ī viṣayamu vārtikamaṃdu spaṣṭamugā ceppabaḍinadi - ātmajñānamuduyiṃcina vāniki yī ‘advēṣṭā’ modalagu guṇamulu vāru prayatnamu cēyakayē kalugunu, ivi vāri yaḍala sādhāraṇarūpamulu kāvu - anagā vāru sādhanacēsi sādhiṃpavalasinavi kāvu. ī ceppina guṇamulu dharmarūpamulainavi. prayatnamucēsi saṃpādiṃcina yī guṇamulu parama bhaktula lakṣaṇamulu - bhagavaṃtuniki mikkili priyamaina vāri guṇamulu, dharmamulu. viraktuḍu, ātmajijñāsuvu, mōkṣamukōruvāḍu ayinavāniki mōkṣasādhanaṃ. ī lakṣaṇamulu galavāru bhagavaṃtuniki mikkili priyamulaguṭavalla bhagavaṃtuḍu vāriki tappaka yiccunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.