← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

ధీరః dhīraḥ

Original — తెలుగు
  1. ధియా రమతే ఇతి ధీరః. (బుద్ధితో రమించువాడు, గ్రహించువాడు).

  2. ధైర్యశీల సంపన్నః (ధైర్య గుణములు గలవాడు).

  3. ధియం ప్రేరయతీతి వ్యుత్పత్యా చిదాభాసద్వరా ధీతా దాత్మ్యా ధ్యాసేన ధ ప్రేరకః, ధీసాక్షీత్యర్ద్థః.

(ధీః అనగా బుద్ధిని, ప్రేరయితా = ప్రేరేపించువాడు అని. ధీరః అనుమాటకు వ్యుత్పత్యర్థము - బుద్ధిని ప్రేరేపించువాడు. అందుచేత చిదాభాసుని ద్వారా బుద్ధియందు తాదాత్మ్య సంబంధమువలన బుద్ధిని ప్రేరేపించునది - బుద్ధికి సాక్షి అయినవాడు).

  1. విషయేభ్యో బుద్ధిం యో నియచ్చతి స ఏవ ధీరః. (విషయములనుండి బుద్ధిని మరలించగలిగినవాడు).

  2. ధ్యానేన పశ్యతీతి ధీరః.

(ధ్యానము ద్వారా చూచువాడు - కనిపెట్టువాడు; ధ్యానమువలన కలిగిన శక్తిచే, అతిసూక్ష్మములైన వాటిని - అతీంద్రియ విషయములను - చూచువాడు).

  1. ఇంద్రియాది నిగ్రహ సమర్థః.

(ఇంద్రియములను మొదలగువాటిని నిగ్రహించుటలో - తన వశములో నుంచుకొనుటలో - సమర్థుడైనవాడు).

  1. బ్రహ్మచర్యాది సాధన సంపత్యా ధైర్య యుక్తాః.

(బ్రహ్మచర్యము మొదలగు సాధనసంపత్తి కలిగియుండుటచేత ధైర్యము గలవాడు).

  1. మనస్వీ (మంచి మనస్సు గలవాడు - పరమాత్మయందు నిల్పిన మనస్సు గలవాడు).

  2. పరమాత్మ ధ్యాన పరః. (పరమాత్మను ధ్యానించుట యందాసక్తి గలవాడు).

  3. బ్రహం విద్య రీయాన్. (బ్రహ్మ జ్ఞానము గలవారిలో శ్రేష్టుడు).

  4. ధీమాన్, అత్యంత వివేకీ, ప్రజ్ఞానశాలీ, ప్రజ్ఞానవాన్. (బుద్ధిమంతుడు,మంచివివేకముగలవాడు, ప్రజ్ఞకలవాడు).

  5. మనస్సును చలింపచేయు విషయములు తన చుట్టునున్నను నిశ్చలమైన మనస్సు గలవాడు.

Transliteration
  1. dhiyā ramatē iti dhīraḥ. (buddhitō ramiṃcuvāḍu, grahiṃcuvāḍu).

  2. dhairyaśīla saṃpannaḥ (dhairya guṇamulu galavāḍu).

  3. dhiyaṃ prērayatīti vyutpatyā cidābhāsadvarā dhītā dātmyā dhyāsēna dha prērakaḥ, dhīsākṣītyardthaḥ.

(dhīḥ anagā buddhini, prērayitā = prērēpiṃcuvāḍu ani. dhīraḥ anumāṭaku vyutpatyarthamu - buddhini prērēpiṃcuvāḍu. aṃducēta cidābhāsuni dvārā buddhiyaṃdu tādātmya saṃbaṃdhamuvalana buddhini prērēpiṃcunadi - buddhiki sākṣi ayinavāḍu).

  1. viṣayēbhyō buddhiṃ yō niyaccati sa ēva dhīraḥ. (viṣayamulanuṃḍi buddhini maraliṃcagaliginavāḍu).

  2. dhyānēna paśyatīti dhīraḥ.

(dhyānamu dvārā cūcuvāḍu - kanipeṭṭuvāḍu; dhyānamuvalana kaligina śakticē, atisūkṣmamulaina vāṭini - atīṃdriya viṣayamulanu - cūcuvāḍu).

  1. iṃdriyādi nigraha samarthaḥ.

(iṃdriyamulanu modalaguvāṭini nigrahiṃcuṭalō - tana vaśamulō nuṃcukonuṭalō - samarthuḍainavāḍu).

  1. brahmacaryādi sādhana saṃpatyā dhairya yuktāḥ.

(brahmacaryamu modalagu sādhanasaṃpatti kaligiyuṃḍuṭacēta dhairyamu galavāḍu).

  1. manasvī (maṃci manassu galavāḍu - paramātmayaṃdu nilpina manassu galavāḍu).

  2. paramātma dhyāna paraḥ. (paramātmanu dhyāniṃcuṭa yaṃdāsakti galavāḍu).

  3. brahaṃ vidya rīyān. (brahma jñānamu galavārilō śrēṣṭuḍu).

  4. dhīmān, atyaṃta vivēkī, prajñānaśālī, prajñānavān. (buddhimaṃtuḍu,maṃcivivēkamugalavāḍu, prajñakalavāḍu).

  5. manassunu caliṃpacēyu viṣayamulu tana cuṭṭununnanu niścalamaina manassu galavāḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.