← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

ధ్రువం dhruvaṃ

Original — తెలుగు
  1. “నిత్యః; అవినాశిత్వాత్ ధ్రువః” (శ్రీశంకరః)

(నిత్యమైనది; ఎల్లపుడు ఉండునది; నశింపనిది కనుక ధ్రువము).

  1. అచలం; అవిచాల్యం;కూటస్థః.

(చలింపనిది,చలింపచేయుటకువీలుకానిది,కూటమువలె నిలకడగానుండునది).

  1. ఆత్మవన్నిత్యం. (ఆత్మవలె నిత్యమైనది, ఎల్లపుడు ఉండునది).

  2. శాశ్వతత్వాత్ ధ్రువః. (శాశ్వతముగా నుండునది కనుక ధ్రువము).

  3. తేనైవ రూపేణ స్థితః. (మార్పులేక అదేరూపముతో నుండువాడు). 32

  4. అపరిణామి - (మార్పు లేనిది, మార్పు చెందనిది).

  5. సదా ఏక రసమితి యావత్. (ఎల్లపుడు ఒక రసముగా - చైతన్యరసముగా - ఒకే రీతిగా నుండువాడు).

  6. జన్మ నిధన రహితః (జనన మరణములు లేనిది).

  7. వృద్ధ్యాది రహితం (వృద్ధి - పెరుగుట - మొదలగునవి లేనిది).

  8. అప్రచ్యుత స్వరూపం, అక్షరం ఇత్యర్థః (అప్రచ్యుత స్వరూపముగలది, క్షీణింపనిది, నశింపనిది).

  9. నిశ్చితం;అపరిహార్యం ; ఆవశ్యకం. (నిశ్చయము చేయబడినది; పరిహరింపవీలుకానిది, ఆవశ్యకమైనది).

  10. అధ్రువ మాయా పాయాత్. (అధ్రువమగు మాయను పోగొట్టునది కనుక ధ్రువము).

  11. “అతో మాయావి కారాణామధిష్ఠాన తయా (అ)చలం |

అత ఏవ ధ్రువం నిత్యం పరిణామ వివర్జితం |” (గీతాభావప్రకాశము - 12 - 28, 29)

(మాయ మార్పుచెంది అనేక ఆకారములుగా మారగా వాటికి అధిష్టానమగుటవలన అచలమైనది, చంచలము కానిది, కదలనిది; నిత్యముగానుండునది, పరిణామము - మార్పు - చెందనిది).

  1. ’సర్వోత్తర ధ్రువపదం” (నారాయణీయం)

(అన్నింటికన్న - అన్ని నక్షత్రములకన్న - ఉత్తరముగా, మీదగా నున్న స్థిరమైన స్థానము - ధ్రువుని పదము).

  1. ” ధ్రువః సర్వేషాం జ్యోతిర్గణానాం గ్రహనక్షత్ర భాదినాం అస్పష్ట వేగేన అనిమేషేణ కాలేన భ్రామ్యతాం భ్రామ్యమాణోనాం స్థాణురివావష్టంభః పరమేశ్వరేణ విహితః ఇతిన్యాయః, మేడిస్తంభే బద్ధాః పశవో బలీవర్ధాః ఇవ ధ్రువమేవ మేడిస్థానాపన్నం చరంతే“.

(సమస్తమైన జ్యోతిర్గుణములు, గ్రహములు, నక్షత్రములు స్పష్టముగాని వేగముతో - తెలియలేనంతవేగముతో తిరుగుచుండువాటి మధ్యమున స్థాణువు వలె పరమేశ్వరునిచే ఆదేశింపబడియున్నవాడు - ధ్రువనక్షత్రము - మిగిలిన నక్షత్రములన్నియు ఈ ధ్రువనక్షత్రము (Pole Star) చుట్టును తిరుగుచుండును. మేడిస్తంబమునకు కట్టబడిన ఫశువులు దానిచుట్టు తిరుగుచుండగా ఆ స్థంబము మట్టుకు కదలక ఉండును. ధ్రువనక్షత్రముఆ స్తంబమువలెనున్నది. దాని చుట్టు తిరుగుచుండు నక్షత్రములు మొదలగునవి ఆ స్తంబము చుట్టు తిరుగు పశువులువలె నున్నవి).

  1. “ఆ ధ్రువుండు నిమిషమాత్రమెడలేక సంచరించు జ్యోతిర్గ్రహ నక్షత్రములకు నీశ్వరునుచేత ధాన్యాక్రమణంబున బశువులకై యేర్పరచిన మేధిస్థంబంబు తెఱంగున మేటిగా కల్పింపబడి ప్రకాశించుచుండు

క. తలక్రిందై వట్టువయై

సలలితమగు శిన్శుమార చక్రమునందున్

నెలకొని పుచ్ఛాగ్రంబున

నిలిచి ధ్రువుండుండు నెపుడు నిర్మలచరితా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1 - 17 - 92, 94)

  1. “అది (శింశుమారచక్రము) సర్వదేవతామయంబైన పుండరీకాక్షుని దివ్య దేహంబు ధ్రువునింగా నెఱుంగుము”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 2 - 95)

  1. “వ. ఎందేని మేథియందు బరిభ్రామ్యమాణగో చక్రంబునుంబోలె గ్రహనక్షత్ర తారాగణ జ్యోతిశ్చక్రంబు నక్షత్రరూపంబులైన ధర్మాగ్ని, కశ్యపశక్రులును, సప్తర్షులును, దారకానమేతులై ప్రదక్షిణంబు దిరుగుచుండుదురు - అట్టి దురాపంబును అనన్యాధిష్టితంబును లోకత్రయ ప్రళయకాలంబునందు నశ్వరంబుగాక ప్రకాశమానంబును నయిన ధ్రువ క్షితియను పదంబు - - -”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 9 - 290)

Transliteration
  1. “nityaḥ; avināśitvāt dhruvaḥ” (śrīśaṃkaraḥ)

(nityamainadi; ellapuḍu uṃḍunadi; naśiṃpanidi kanuka dhruvamu).

  1. acalaṃ; avicālyaṃ;kūṭasthaḥ.

(caliṃpanidi,caliṃpacēyuṭakuvīlukānidi,kūṭamuvale nilakaḍagānuṃḍunadi).

  1. ātmavannityaṃ. (ātmavale nityamainadi, ellapuḍu uṃḍunadi).

  2. śāśvatatvāt dhruvaḥ. (śāśvatamugā nuṃḍunadi kanuka dhruvamu).

  3. tēnaiva rūpēṇa sthitaḥ. (mārpulēka adērūpamutō nuṃḍuvāḍu). 32

  4. apariṇāmi - (mārpu lēnidi, mārpu ceṃdanidi).

  5. sadā ēka rasamiti yāvat. (ellapuḍu oka rasamugā - caitanyarasamugā - okē rītigā nuṃḍuvāḍu).

  6. janma nidhana rahitaḥ (janana maraṇamulu lēnidi).

  7. vṛddhyādi rahitaṃ (vṛddhi - peruguṭa - modalagunavi lēnidi).

  8. apracyuta svarūpaṃ, akṣaraṃ ityarthaḥ (apracyuta svarūpamugaladi, kṣīṇiṃpanidi, naśiṃpanidi).

  9. niścitaṃ;aparihāryaṃ ; āvaśyakaṃ. (niścayamu cēyabaḍinadi; parihariṃpavīlukānidi, āvaśyakamainadi).

  10. adhruva māyā pāyāt. (adhruvamagu māyanu pōgoṭṭunadi kanuka dhruvamu).

  11. “atō māyāvi kārāṇāmadhiṣṭhāna tayā (a)calaṃ |

ata ēva dhruvaṃ nityaṃ pariṇāma vivarjitaṃ |” (gītābhāvaprakāśamu - 12 - 28, 29)

(māya mārpuceṃdi anēka ākāramulugā māragā vāṭiki adhiṣṭānamaguṭavalana acalamainadi, caṃcalamu kānidi, kadalanidi; nityamugānuṃḍunadi, pariṇāmamu - mārpu - ceṃdanidi).

  1. ’sarvōttara dhruvapadaṃ” (nārāyaṇīyaṃ)

(anniṃṭikanna - anni nakṣatramulakanna - uttaramugā, mīdagā nunna sthiramaina sthānamu - dhruvuni padamu).

  1. ” dhruvaḥ sarvēṣāṃ jyōtirgaṇānāṃ grahanakṣatra bhādināṃ aspaṣṭa vēgēna animēṣēṇa kālēna bhrāmyatāṃ bhrāmyamāṇōnāṃ sthāṇurivāvaṣṭaṃbhaḥ paramēśvarēṇa vihitaḥ itinyāyaḥ, mēḍistaṃbhē baddhāḥ paśavō balīvardhāḥ iva dhruvamēva mēḍisthānāpannaṃ caraṃtē”.

(samastamaina jyōtirguṇamulu, grahamulu, nakṣatramulu spaṣṭamugāni vēgamutō - teliyalēnaṃtavēgamutō tirugucuṃḍuvāṭi madhyamuna sthāṇuvu vale paramēśvarunicē ādēśiṃpabaḍiyunnavāḍu - dhruvanakṣatramu - migilina nakṣatramulanniyu ī dhruvanakṣatramu (Pole Star) cuṭṭunu tirugucuṃḍunu. mēḍistaṃbamunaku kaṭṭabaḍina phaśuvulu dānicuṭṭu tirugucuṃḍagā ā sthaṃbamu maṭṭuku kadalaka uṃḍunu. dhruvanakṣatramuā staṃbamuvalenunnadi. dāni cuṭṭu tirugucuṃḍu nakṣatramulu modalagunavi ā staṃbamu cuṭṭu tirugu paśuvuluvale nunnavi).

  1. “ā dhruvuṃḍu nimiṣamātrameḍalēka saṃcariṃcu jyōtirgraha nakṣatramulaku nīśvarunucēta dhānyākramaṇaṃbuna baśuvulakai yērparacina mēdhisthaṃbaṃbu teṟaṃguna mēṭigā kalpiṃpabaḍi prakāśiṃcucuṃḍu

ka. talakriṃdai vaṭṭuvayai

salalitamagu śinśumāra cakramunaṃdun

nelakoni pucchāgraṃbuna

nilici dhruvuṃḍuṃḍu nepuḍu nirmalacaritā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1 - 17 - 92, 94)

  1. “adi (śiṃśumāracakramu) sarvadēvatāmayaṃbaina puṃḍarīkākṣuni divya dēhaṃbu dhruvuniṃgā neṟuṃgumu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 2 - 95)

  1. “va. eṃdēni mēthiyaṃdu baribhrāmyamāṇagō cakraṃbunuṃbōle grahanakṣatra tārāgaṇa jyōtiścakraṃbu nakṣatrarūpaṃbulaina dharmāgni, kaśyapaśakrulunu, saptarṣulunu, dārakānamētulai pradakṣiṇaṃbu dirugucuṃḍuduru - aṭṭi durāpaṃbunu ananyādhiṣṭitaṃbunu lōkatraya praḷayakālaṃbunaṃdu naśvaraṃbugāka prakāśamānaṃbunu nayina dhruva kṣitiyanu padaṃbu - - -”

(śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 9 - 290)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.