← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

ధూమాదిమార్గము dhūmādimārgamu

Original — తెలుగు
  1. పితృయానము –

  2. “యత్కాలేత్వనా వృత్తి మావృత్తింబైవ యోగినః |

ప్రయతాయాంతి తం కాలం వక్ష్యా మి భారతర్షభ ||

ధూమోరింతిస్తధా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం |

తత్త చాంద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే |

శుక్ల కృష్ణేగతీహ్యేతే జగతః శాశ్వతీ మతే |

ఎక యాయా త్య నావృత్తి మన్యయా వర్తతే పునః ||“. (శ్రీమద్భగవద్గీత - 8 - 23, 25, 26)

“తథా ధూమాది శబ్దైశ్చ లక్ష్యంతే దే దేవతాయతః |

మార్గభూతామృతాం స్తాం స్తా న్ప్రాపయంతి చ కర్మణః |

తస్మిన్ మార్గే మృతాః యాంతి ఫలం చాంద్రమసం జనాః |

కర్మణః కర్మ సంసిద్ధిం ప్రాప్య భుక్త్వా వతంత్య ధః |

పితృదేవైక్య భోగ్యత్వం యస్మాచ్చంద్ర మసస్తు తః |

లోకం చాంద్రమసం గత్వా కర్మణో ధః పతం త్యమీ |

అర్చిరాది గతిః శుక్లాధీ ప్రకాశమయ త్వతం |

ధూమాది గతిః కృష్ణా జ్ఞానహీనతయా తమః |

శాస్త్ర జ్ఞస్యాపి సర్వస్య విద్యా కర్మాది కారిణః |

ఏతే గతీ ప్రసిద్ధేద్వే అనాది జగతోమతే |

సంసారస్యాప్యనాదిత్వాదనా దిత్వం తయోర్మతం |

శుక్లయా యాత్యనావృత్తిం కృష్ణయే (ఆ)వర్తతే పునః |

తత్త్రైకా క్రమ మోక్షాయ సంసారా యాపరా స్మృతా ||“. (గీతాభావప్రకాశము - 8 - 141 to 147)

(దేవయానమువలెనే ధూమాదిమార్గములో ధూమాది శబ్దములచేత ఆయా అభిమానదేవతలు చెప్పబడుచున్నారు. పితృలోక ఆకాశచంద్రలోక దేవతలు చనిపోయినవారిని ఈ మార్గముమీదుగా తీసుకొనిపోయెదరు. పితృలోకము వెళ్ళుదురుగాన ఈ మార్గమును పితృయానమని, చంద్రలోకమునకు వెళ్ళుదురుగాన చాంద్రమసం అని కూడ అందురు. ఈ మార్గము మీదుగా వెళ్ళినవారు కర్మఫలమనుభవించి తిరిగి భూలోకములోజన్మ ఎత్తుదురు. ధూమము, రాత్రి, కృష్ణపక్షము దక్షిణాయనము అని చెప్పుటవలన ధూమము మొదట ఉండుటవలన ధూమాది మార్గము - ధూమము మొదలగునవి కలమార్గము. ఇదేపితృయానము, కృష్ణయానము. ఈ మార్గముద్వారా వెళ్ళినవారు జ్ఞానహీనులుకనుక - బ్రహ్మ జ్ఞానము లేనివారుగనుక మార్గము చీకటిగానుండునని - ‘కృష్ణ’, ‘ధూమ’ యని చెప్పబడినది).

  1. “సీ. గృహమందు వర్తించు గృహమేధులగువారు మహిత ధర్మార్ధకామముల కొఱకు

సంప్రీతులగుచు తత్సాధనానుష్ఠాన నిరతులై వేద నిర్ణీత భూరి

భగవత్సుధర్మ తద్భక్తి పరాజ్ఙుఖులై దేవగణములననుదినంబు

భజయించుచును భక్తి బైతృకర్మముల్ సేయుచు నెప్పుడు శిష్టచరితు

తే. లగుచు దగదేవ పితృ సువ్రతాడ్యులయిన

కామ్యచిత్తులు ధూమాదిగతుల జంద్ర

లోకమును జెంది పుణ్యంబులుప్తమయిన

మరలివత్తురు భువికి జన్మంబునొంద” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 32 - 1010)

  1. “ఇష్టాపూర్త కర్మలు చేయువారు, ధూమము, రాత్రి, కృష్ణపక్షము దక్షిణాయనము, పితృయానము, పింగళానాడి - ఈ మార్గమునపోయి, చంద్రలోకంబుచేరి, అచ్చట పుణ్యఫలములననుభవించుచు, అవి క్షీణింప, అచ్చోటనుండి మేఘమందు బడి, జలమై, ఆ జలరూపమున భూమి మీద ఔషధులతో చేరి, అన్నమై, జన్మానుగుణ్యమగు పురుషజంతుగర్భమందు చేరి, శుక్లంబై అవ్వల వనితాగర్భంబునం జేరి నవమాసంబులు గడచినతోడనే పుడమియందు ఉదయించి,పెరిగి, పుణ్యపాప మిశ్రమకర్మముల చేసి ఆత్మజ్ఞానము కలుగుదాక లోకాంతరంబులం బొందుచు, మరల పుట్టుచు, గిట్టుచుందురు. ఇది ధూమాది మార్గము”.
Transliteration
  1. pitṛyānamu –

  2. “yatkālētvanā vṛtti māvṛttiṃbaiva yōginaḥ |

prayatāyāṃti taṃ kālaṃ vakṣyā mi bhāratarṣabha ||

dhūmōriṃtistadhā kṛṣṇaḥ ṣaṇmāsā dakṣiṇāyanaṃ |

tatta cāṃdramasaṃ jyōtiryōgī prāpya nivartatē |

śukla kṛṣṇēgatīhyētē jagataḥ śāśvatī matē |

eka yāyā tya nāvṛtti manyayā vartatē punaḥ ||“. (śrīmadbhagavadgīta - 8 - 23, 25, 26)

“tathā dhūmādi śabdaiśca lakṣyaṃtē dē dēvatāyataḥ |

mārgabhūtāmṛtāṃ stāṃ stā nprāpayaṃti ca karmaṇaḥ |

tasmin mārgē mṛtāḥ yāṃti phalaṃ cāṃdramasaṃ janāḥ |

karmaṇaḥ karma saṃsiddhiṃ prāpya bhuktvā vataṃtya dhaḥ |

pitṛdēvaikya bhōgyatvaṃ yasmāccaṃdra masastu taḥ |

lōkaṃ cāṃdramasaṃ gatvā karmaṇō dhaḥ pataṃ tyamī |

arcirādi gatiḥ śuklādhī prakāśamaya tvataṃ |

dhūmādi gatiḥ kṛṣṇā jñānahīnatayā tamaḥ |

śāstra jñasyāpi sarvasya vidyā karmādi kāriṇaḥ |

ētē gatī prasiddhēdvē anādi jagatōmatē |

saṃsārasyāpyanāditvādanā ditvaṃ tayōrmataṃ |

śuklayā yātyanāvṛttiṃ kṛṣṇayē (ā)vartatē punaḥ |

tattraikā krama mōkṣāya saṃsārā yāparā smṛtā ||“. (gītābhāvaprakāśamu - 8 - 141 to 147)

(dēvayānamuvalenē dhūmādimārgamulō dhūmādi śabdamulacēta āyā abhimānadēvatalu ceppabaḍucunnāru. pitṛlōka ākāśacaṃdralōka dēvatalu canipōyinavārini ī mārgamumīdugā tīsukonipōyedaru. pitṛlōkamu veḷḷudurugāna ī mārgamunu pitṛyānamani, caṃdralōkamunaku veḷḷudurugāna cāṃdramasaṃ ani kūḍa aṃduru. ī mārgamu mīdugā veḷḷinavāru karmaphalamanubhaviṃci tirigi bhūlōkamulōjanma ettuduru. dhūmamu, rātri, kṛṣṇapakṣamu dakṣiṇāyanamu ani ceppuṭavalana dhūmamu modaṭa uṃḍuṭavalana dhūmādi mārgamu - dhūmamu modalagunavi kalamārgamu. idēpitṛyānamu, kṛṣṇayānamu. ī mārgamudvārā veḷḷinavāru jñānahīnulukanuka - brahma jñānamu lēnivāruganuka mārgamu cīkaṭigānuṃḍunani - ‘kṛṣṇa’, ‘dhūma’ yani ceppabaḍinadi).

  1. “sī. gṛhamaṃdu vartiṃcu gṛhamēdhulaguvāru mahita dharmārdhakāmamula koṟaku

saṃprītulagucu tatsādhanānuṣṭhāna niratulai vēda nirṇīta bhūri

bhagavatsudharma tadbhakti parājṅukhulai dēvagaṇamulananudinaṃbu

bhajayiṃcucunu bhakti baitṛkarmamul sēyucu neppuḍu śiṣṭacaritu

tē. lagucu dagadēva pitṛ suvratāḍyulayina

kāmyacittulu dhūmādigatula jaṃdra

lōkamunu jeṃdi puṇyaṃbuluptamayina

maralivatturu bhuviki janmaṃbunoṃda” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 32 - 1010)

  1. “iṣṭāpūrta karmalu cēyuvāru, dhūmamu, rātri, kṛṣṇapakṣamu dakṣiṇāyanamu, pitṛyānamu, piṃgaḷānāḍi - ī mārgamunapōyi, caṃdralōkaṃbucēri, accaṭa puṇyaphalamulananubhaviṃcucu, avi kṣīṇiṃpa, accōṭanuṃḍi mēghamaṃdu baḍi, jalamai, ā jalarūpamuna bhūmi mīda auṣadhulatō cēri, annamai, janmānuguṇyamagu puruṣajaṃtugarbhamaṃdu cēri, śuklaṃbai avvala vanitāgarbhaṃbunaṃ jēri navamāsaṃbulu gaḍacinatōḍanē puḍamiyaṃdu udayiṃci,perigi, puṇyapāpa miśramakarmamula cēsi ātmajñānamu kalugudāka lōkāṃtaraṃbulaṃ boṃducu, marala puṭṭucu, giṭṭucuṃduru. idi dhūmādi mārgamu”.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.