← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దిక్కు dikku

Original — తెలుగు
  1. “ప్రాచ్యాది వ్యవహార హేతుర్దిక్.” (తర్క సంగ్రహే). (తూర్పు అను మొదలుగా వ్యవహరించబడినవి).

  2. “ఉదయాచల సన్నిహితా యాదిక్ సాప్రాచీ ; అస్తాచల సన్నిహితా యాదిక్ సాప్రతీచీ ; మేరోః సన్నిహితా యా దిక్ సో దీచీ ; మేరోర్వ్య వహితా యాదిక్ సా వాచీ”. (న్యాయ బోధినీ).

(ఉదయాద్రివైపు ఉన్న దిక్కు తూర్పు; అస్తాద్రివైపు ఉన్న దిక్కు పడమట ; మేరుపర్వతమువైపు ఉన్న దిక్కు ఉదీచీ ; దానికి ఎదురుగానున్నది దక్షిణము).

  1. రక్షణ - రక్షించువాడు.

“క. నీదిక్కు గానివారికి

నేదిక్కును లేదు వెదక యిహపరములకున్

మోదింప దలచువారికి

నీ దిక్కే దిక్కు సుమ్ము నీరజ నాభా ”

  1. “క. దిక్కులు గెలిచితి నన్నియు

దిక్కెవ్వడురోరి | నీకు - - - ?

  1. “క. - - -

దిక్కు గల లేనివారికి

దిక్కయ్యెడువాడు నాకు దిక్కు మహాత్మా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 8 - 261, 265)

Transliteration
  1. “prācyādi vyavahāra hēturdik.” (tarka saṃgrahē). (tūrpu anu modalugā vyavahariṃcabaḍinavi).

  2. “udayācala sannihitā yādik sāprācī ; astācala sannihitā yādik sāpratīcī ; mērōḥ sannihitā yā dik sō dīcī ; mērōrvya vahitā yādik sā vācī”. (nyāya bōdhinī).

(udayādrivaipu unna dikku tūrpu; astādrivaipu unna dikku paḍamaṭa ; mēruparvatamuvaipu unna dikku udīcī ; dāniki edurugānunnadi dakṣiṇamu).

  1. rakṣaṇa - rakṣiṃcuvāḍu.

“ka. nīdikku gānivāriki

nēdikkunu lēdu vedaka yihaparamulakun

mōdiṃpa dalacuvāriki

nī dikkē dikku summu nīraja nābhā ”

  1. “ka. dikkulu geliciti nanniyu

dikkevvaḍurōri | nīku - - - ?

  1. “ka. - - -

dikku gala lēnivāriki

dikkayyeḍuvāḍu nāku dikku mahātmā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 8 - 261, 265)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.