← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దివ్యధామము divyadhāmamu

Original — తెలుగు
  1. దేవగృహము ; భగవంతుని పదము ; పరమపదము ; వైకుంఠము.

  2. “సీ. అధ్యాత్మ తత్పరుండగువాడు పెక్కు జన్మంబుల బెక్కు కాలంబులందు

బ్రహ్మ పద ప్రాప్తి పర్యంతమును బుట్టు సర్వార్థ వైరాగ్య శాలియగుచు

పూని నాభక్తులచే నుపదేశింపబడిన విజ్ఞానసంపత్తిచేత

బరగ బ్రబుద్ధుడై బహువారములు భూరిమత్ప్రసాద ప్రాప్తిమతి దనర్చు

తే. నిజ పరిజ్ఞాన విచ్ఛిన్న నిఖిలసంశ

యుండు నిర్ముక్తలింగ దేహుండు నగుచు

ననఘ యోగీంద్ర హృద్గేయమగు మదీయ

దివ్య ధామంబు నొందు సందీప్తుడగుచు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 27 - 918)

Transliteration
  1. dēvagṛhamu ; bhagavaṃtuni padamu ; paramapadamu ; vaikuṃṭhamu.

  2. “sī. adhyātma tatparuṃḍaguvāḍu pekku janmaṃbula bekku kālaṃbulaṃdu

brahma pada prāpti paryaṃtamunu buṭṭu sarvārtha vairāgya śāliyagucu

pūni nābhaktulacē nupadēśiṃpabaḍina vijñānasaṃpatticēta

baraga brabuddhuḍai bahuvāramulu bhūrimatprasāda prāptimati danarcu

tē. nija parijñāna vicchinna nikhilasaṃśa

yuṃḍu nirmuktaliṃga dēhuṃḍu nagucu

nanagha yōgīṃdra hṛdgēyamagu madīya

divya dhāmaṃbu noṃdu saṃdīptuḍagucu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 27 - 918)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.